Three deid
-
చిన్నారితో సహా కుటుంబాన్ని కబళించిన లారీ
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం కేవిపల్లి మండలంలోని గ్యారంపల్లి కస్పా వద్ద ఈ ప్రమాదం జరిగింది. పీలేరు నుంచి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి వైపు వెళ్తున్న ఓ మోటార్ బైక్ అదే మార్గం నుంచి వెళుతున్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో రెండేళ్ల చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు చిన్న గొట్టిగల్లుకు చెందిన శంకరప్ప, హారిక, చిన్నారి లిల్లీగా పోలీసులు గుర్తించారు. (ఐదుగురు స్నేహితులను బలిగొన్న అతివేగం ) -
స్నేహితుల దినోత్సవం రోజు విషాదం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పమిడిముక్కల మండలం గురజాడ వద్ద అదుపుతప్పి ఓ కారు కల్వర్టుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన అమర్, యూసఫ్, శివరాజ్ విజయవాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా విజయవాడ నుండి మచిలీపట్నం బీచ్‌కు వెళ్లిన 11 మంది యువకులు తిరుగు ప్రయాణంలో గురజాడ వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాల్లో విషాధ ఛాయలు అలముకున్నాయి. (ప్రాణం లేదని.. కాటికి తీసుకెళ్తే.. ) -
అనంతపురంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాప్తాడు మండలం గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్- బెంగళూర్ హైవేపై వేగంగా వస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు వివరాలు వెంటనే వెల్లడి కాలేదు. -
దైవ దర్శనానికి వెళుతూ...
రఘునాథపల్లి /హన్మకొండ: దేవున్ని మనసారా దర్శించుకోవాలనుకున్న వారి కోరిక తీరకుండానే ఆ దైవం చెంతకు చేరిపోయారు. దైవ దర్శనానికి వెళుతున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం పాలైన విషాద ఘటన ఆది వారం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కోమల్ల, రఘునాథపల్లి మధ్యనగల వెంకటాయపాలెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. హన్మకొండ నక్కలగుట్టకు చెందిన ట్రాన్స్‌కోలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నెల్లుట్ల రవీందర్‌రెడ్డి (54), భార్య అనురాధ(46), కుమార్తె నితిక(24)తోపాటు సమీప బంధువు భువనేశ్వరి, డ్రైవర్ రాజుతో కలిసి తన టాటా సుమోలో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి బయలుదేరారు. మరోవైపు హైదరాబాద్‌లోని కొత్తబస్తీ చైతన్యపురికి చెందిన 12మంది ట్రావెల్ వ్యాన్‌లో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి మేడారం వెళ్తున్నారు. ఈ క్రమంలో వెంకటాయపాలెం వద్దకు చేరుకోగానే ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు వాహనాలు ఒక్కసారిగా ఢీకొన్నాయి. టాటాసుమో ట్రావెల్ వ్యాన్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టి అదే ఊపులో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రవీందర్‌రెడ్డి భార్య అనురాధ, కూతురు నితిక అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన రవీందర్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయాలపాలైన డ్రైవర్ రాజు, భువనేశ్వరిలను జనగామ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. రవీందర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దమ్మాయికి వివాహమై హైద రాబాద్‌లో ఉంటున్నారు. సోమవారం అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు పేర్కొ న్నారు. స్వల్ప గాయాలతో.. ట్రావెల్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన చింతగట్ల అరుణ, దామోదర్‌రెడ్డి, అరుంధతి, జయపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డికి స్వల్పగాయాలు కాగా, మిగతావారు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జనగామ రూరల్ సీఐ సతీష్, టౌన్ సీఐ నర్సింహ ఘటనా స్థలికి చేరుకుని బాధితులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.