
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పమిడిముక్కల మండలం గురజాడ వద్ద అదుపుతప్పి ఓ కారు కల్వర్టుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన అమర్, యూసఫ్, శివరాజ్ విజయవాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా విజయవాడ నుండి మచిలీపట్నం బీచ్‌కు వెళ్లిన 11 మంది యువకులు తిరుగు ప్రయాణంలో గురజాడ వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాల్లో విషాధ ఛాయలు అలముకున్నాయి. (ప్రాణం లేదని.. కాటికి తీసుకెళ్తే.. )
Comments
Please login to add a commentAdd a comment