pamidimukkala
-
స్నేహితుల దినోత్సవం రోజు విషాదం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పమిడిముక్కల మండలం గురజాడ వద్ద అదుపుతప్పి ఓ కారు కల్వర్టుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన అమర్, యూసఫ్, శివరాజ్ విజయవాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా విజయవాడ నుండి మచిలీపట్నం బీచ్‌కు వెళ్లిన 11 మంది యువకులు తిరుగు ప్రయాణంలో గురజాడ వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాల్లో విషాధ ఛాయలు అలముకున్నాయి. (ప్రాణం లేదని.. కాటికి తీసుకెళ్తే.. ) -
రోడ్డు ప్రమాదంలో ఎంపీడీవో మృతి
కనకదుర్గ వారధి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గ వారధి వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా పమిడిముక్కల ఎంపీడీవో బసవరాజు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు.. గుంటూరులో ఇంటి నిర్మాణం పనులు చూచి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి విజయవాడ తన ఇంటికి వెళుతున్న బసవరాజును కనకదుర్గ వారధి వద్దకు రాగానే ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బసవరాజు తల బస్సు వెనక టైరు కింద పడడంతో హెల్మెట్ ఉన్నప్పటికీ తల భాగం పూర్తిగా ఛిద్రమైంది. తాడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు బసవరాజు ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.