రోడ్డు ప్రమాదంలో ఎంపీడీవో మృతి
కనకదుర్గ వారధి (తాడేపల్లి రూరల్):
తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గ వారధి వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా పమిడిముక్కల ఎంపీడీవో బసవరాజు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు.. గుంటూరులో ఇంటి నిర్మాణం పనులు చూచి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి విజయవాడ తన ఇంటికి వెళుతున్న బసవరాజును కనకదుర్గ వారధి వద్దకు రాగానే ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బసవరాజు తల బస్సు వెనక టైరు కింద పడడంతో హెల్మెట్ ఉన్నప్పటికీ తల భాగం పూర్తిగా ఛిద్రమైంది. తాడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు బసవరాజు ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.