సాక్షి, న్యూఢిల్లీ : ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ది ప్రింట్ హిందీ ఎడిటర్ , సీనియర్ మహిళా జర్నలిస్టు రేణు అగల్ ఇకలేరు. డిల్లీకి చెందిన రేణు అగల్ దాదాపు నెల రోజుల పాటు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. దీంతో పాత్రికేయ మితృలందరూ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా తనదైన ముద్ర వేసుకుని, మంచి మనిషిగా ఎపుడూ నవ్వుతూ, నలుగురికి సాయపడుతూ ఉండే రేణు అకాలమరణం పత్రికా ప్రపంచానికి తీరని లోటంటూ విచారం వ్యక్తం చేశారు. ఆ నవ్వులిక మాయమంటూ రేణు సన్నిహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీబీసీ ఆన్‌లైన్ ఎడిటర్ గీతా పాండే రేణు మృతిపై సంతాపం ప్రకటించారు.
మార్చి 25 న రేణు అగల్ విధులను ముగించుకొని రిక్షాలో ఇంటికి వెళుతుండగా డీఆర్‌డీఓ అధికారి తప్పతాగి మద్యం మత్తులో అతివేగంగాకారుతో ఢీకొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కానిస్టేబుల్ అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, తరువాత బెయిల్‌పై విడుదల చేశారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన ఏడు రోజుల తరువాత రిక్షా డ్రైవర్ చాంద్ కూడా చనిపోయాడు. వాహనంపై నియంత్రణ కోల్పోయిన జిగ్ జాగ్‌గా ప్రయాణిస్తూ మొదట ఒక వ్యక్తిని కొట్టాడు. అనంతరం సైకిల్-రిక్షాపైకి దూసుకెళ్లాడని కానిస్టేబుల్ తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో రిక్షాలో కూర్చున్న మహిళ కింద పడిపోయారనీ, స్థానికుల సాయంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతను పారిపోయాడని తెలిపారు. నిందిత డ్రైవర్‌ను కాళి బారి మార్గ్ నివాసి గౌరవ్ బాత్రాగా గుర్తించినట్లు డీసీపీ (ఉత్తర) అల్ఫోన్స్ తెలిపారు. అతనిపైకేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా రేణు అగల్ 1996 లో బీబీసీ లండన్‌లో పనిచేశారు. ప్రత్యేక కరస్పాండెంట్‌గా సుదీర్ఘకాలం15 ఏళ్లు పని చేశారు. 2011 లో పెంగ్విన్ బుక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో కమిషనింగ్ ఎడిటర్‌గా చేరారు. ఆ తరువాత 2018 లో సీనియర్ ఎడిటర్‌గా ది ప్రింట్ హిందీ టీం చేరడానికి ముందు 2015 లో జగ్గర్నాట్ బుక్స్‌కు పనిచేశారు.
So shocking. RIP.
— Shantanu Nandan Sharma (@shantanunandan2) April 22, 2021
Deepest condolences to family, friends
Comments
Please login to add a commentAdd a comment