చిట్యాల(నల్లగొండ): విజయవాడ- హైదరాబాద్ జాతీయరహదారిపై సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సుమో చిట్యాల వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, రోడ్డుపై బోల్తా పడింది.
ఆ వెనుకే వేగంగా వచ్చిన కారు కూడా డివైడర్‌ను, సుమోను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో సుమోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడగా, కారులో ఉన్న బెంగళూరుకు చెందిన నాన్సీ(22) అక్కడికక్కడే చనిపోగా ఆమె తల్లి అనిత తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.
డివైడర్‌ను ఢీకొట్టిన కారు: యువతి మృతి
Published Mon, May 16 2016 1:45 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM
Advertisement
Advertisement