డైవైడర్! | Fibrillation originates road divider | Sakshi
Sakshi News home page

డైవైడర్!

Published Wed, Oct 29 2014 12:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

డైవైడర్! - Sakshi

డైవైడర్!

దడపుట్టిస్తున్న రోడ్ డివైడర్లు
పెరుగుతున్న ప్రమాదాలు
మృత్యువాతపడుతున్న సిటిజన్లు
నిర్మాణంలో అశాస్త్రీయతే కారణం

 
ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు... రైట్-లెఫ్ట్ రహదారుల్ని వేరు చేసేందుకు ఏర్పాటు చేసిన డివైడర్లు గ్రేటర్ వాసుల ప్రాణాలను హరిస్తున్నాయి. నిర్మాణంలో కొరవడిన శాస్త్రీయత.. ప్రమాణాలు పాటించక పోవడం.. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కేం ద్రాలుగా మారుతున్నాయి. నగరవాసులకు డర్ పుట్టిస్తూ ప్రమాదహేతువులుగా మారుతున్నాయి. జంట కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రహదారులతోపాటు శివారు మార్గాల్లో ఏర్పాటుచేసిన డివైడర్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 శాతం డివైడర్ల కారణంగానే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇవి కాంక్రీటుతో నిర్మితం కావడం, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఉండడంతో ఢీ కొట్టిన వాహనం నుజ్జునుజ్జుకావడంతోపాటు చోదకుడు ప్రాణాలతో బయటపడే  అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. వీటివల్ల ఏటా ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కొన్నిచోట్ల హఠాత్తుగా ఏర్పాటు చేస్తున్న డివైడర్లు రాత్రి సమయాల్లో కనిపించిక ప్రాణాలను హరిస్తున్నాయి.

నిర్మాణంలో తేడానే కారణం:

సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పున్న రోడ్ల మధ్యలో డివైడర్లు నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ ఏర్పాటు చేయాల్సి వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉన్న వీటి మధ్య ఖాళీ స్థలం ఉండడంతో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులు, లాలీపాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం ఆర్జించాలనే జీహెచ్‌ఎంసీ వైఖరి కారణంగా డివైడర్ల ప్లేస్‌లో సెంట్రల్ మీడియమ్స్ వచ్చి చేరుతున్నాయి. వీటివల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయి.

కనిపించని హెచ్చరిక సైన్‌బోర్డ్స్...

ఫలాన ప్రాంతం ప్రమాదకరమైంది, ప్రమాద హేతువు అని వివరించేందుకు సదరు స్పాట్‌కు కొద్దిదూరంలో హెచ్చరిక సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు రెండు వైపులా కనీసం 200 మీటర్ల దూరంలో తొలి బోర్డు (కాషన్-1), 100 మీటర్ల దగ్గర మరోటి (కాషన్-2) కచ్చితంగా ఉండాలి. అత్యంత ప్రమాదకరంగా మారిన డివైడర్ల వద్ద ఈ సైన్‌బోర్డులు మచ్చుకైనా కనిపించవు.
 
హజార్డ్ మార్కర్స్ విషయమూ పట్టదు..


ఈ డెత్ స్పాట్స్ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాంతాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా నిర్ణీత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా హజార్డ్ మార్కర్స్ (ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి.
 
కలర్స్, క్యాట్ ఐస్ ఏర్పాటూ అంతంతే...

ప్రమాదహేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తోపాటు రోడ్ మార్జిన్స్‌లోనూ పెయింటింగ్ వేయడం అవసరం. సాధారణ పెయింట్స్ కంటే రిఫ్లెక్టివ్ పెయింట్స్ వల్ల ఉపయోగాలు ఎక్కువ. రాత్రి వేళ కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మార్జిన్స్‌తోపాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రి పూట మెరిసే క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలి. ఇవి రాత్రి పూట వాహనచోదకుల దృష్టిని ఆకర్షిస్తాయి. నగరంలో డివైడర్ల వద్ద వీటి ఏర్పాటు సైతం అంతంతగానే ఉంటోంది.

 పరిష్కారం మార్గం ఇలా..

డివైడర్‌ను పూర్తి శాస్త్రీయ పద్ధతిలో, ఇంజినీరింగ్ నిపుణుల సహకారంతో ఏర్పాటు చేయాలి. కొత్తగా వెలిసిన డివైడర్ల వద్ద వాటి ఉనికి తెలిసేలా సూచికలు కచ్చితంగా ఉండాలి. రాత్రి వేళల్లో డివైడర్లను గుర్తించేందుకు వీలుగా రిఫ్లెక్టర్లు, క్యాట్‌ఐస్ వంటివి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.

 ఈ ఏడాది ‘డివైడర్ మృతుల్లో’ కొందరు...

మలేషియా టౌన్‌షిప్ సర్కిల్‌లో ఎంబీఏ విద్యార్థులు దీపక్, శశాంక్
పహాడీషరీఫ్ కొత్తరోడ్డు స్విమ్మింగ్ పూల్ వద్ద కె.హరి, చిన్నారి శృతి
ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం.283 వద్ద ప్రింటింగ్ ప్రెస్‌వర్కర్ కుమార్
మల్కాజ్‌గిరిలోని ఓ మోడల్ స్కూల్ వద్ద బీటెక్ విద్యార్థి సాయికిరణ్
 ఉప్పల్ నల్లచెరువు కట్టపై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్
 పెద్ద షాపూర్ చెక్‌పోస్ట్ వద్ద ప్రైవేట్ ఉద్యోగి లక్ష్మారెడ్డి
అఫ్జల్‌గంజ్ నేషనల్ లాడ్జి వద్ద ఇంటర్ విద్యార్థి అఫ్సర్
ఆలియాబాద్ చౌరస్తా వద్ద సెంట్రింగ్ వర్కర్ విష్ణువర్ధన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement