
నా దారి అడ్డదారి
ఉరుకులు పరుగులు తీసినా.. కాలంతో పందెం వేసినా.. గజిబిజిగా తిరిగినా.. ప్రతి ఒక్కరి పరుగు భద్రమైన రేపటి కోసమే. కొద్దిక్షణాల కోసం కొండంత భవితను పణంగా పెట్టడం వివేకమనిపించుకోదు. పక్క చిత్రాల్లో చూడండి.
మొగల్రాజపురంలోని సీతారామపురం సిగ్నల్ నుంచి పుష్పా హోటల్ సెంటర్‌కు వెళ్లే కస్తూరి భాయిపేట రోడ్డులో డివైడర్ మధ్యలో ఖాళీ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు ఇలా ప్రమాదకరంగా వెళ్తున్నారు. రాంగ్‌రూట్‌లో వెళ్లడం అప్పటికి బాగానే ఉన్నా.. ఏదైనా ప్రమాదం జరిగితే.. - సాక్షి, విజయవాడ