నాని
ఐయామ్ ఓకే అంటున్నారు హీరో నాని. ఇంతకీ ఏం జరిగిందంటే... ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని శుక్రవారం ఉదయం డ్రైవర్ శ్రీనివాస్‌తో కలిసి ఇంటికి వెళ్తున్నారు హీరో నాని. ఎర్లీ మార్నింగ్ నాలుగున్నర గంటల సమయంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. నానికి పెద్ద గాయాలేం కాలేదు. అయితే... ముందు కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారన్న వార్తలు వచ్చాయి.
పోలీసులు నాని తండ్రి రాంబాబుకు ఫోన్ చేయగా ఆ సమయంలో నాని కారులోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంపై నాని స్పందించారు. ‘‘ఐయామ్ ఓకే. అక్కడక్కడా చిన్నగా గీసుకుపోయింది. అంతే. యుద్ధానికి (షూటింగ్‌కు) స్మాల్ బ్రేక్. నెక్ట్స్ వీక్‌లో మళ్లీ యాక్షన్‌లోకి దిగుతాను’’ అన్నారు నాని. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కృష్ణార్జున యుద్ధం’ ఫస్ట్ లుక్స్‌తోపాటు ఓ సాంగ్‌ను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment