నాని.. నెక్ట్స్‌ ఏంటీ..? | Upcoming Movies Of Nani | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 3 2018 10:15 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Upcoming Movies Of Nani - Sakshi

ఒక సినిమా సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టేసి నాని ఇప్పుడు స్లో అయ్యాడు. ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం తేడా కొట్టేయడంతో నెక్ట్స్ సినిమా ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో సీనియర్‌ హీరో నాగార్జునతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమా విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదు.

ఈ లోగా బిగ్‌ బాస్‌ సీజన్‌ 2కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను ఫైనల్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడట. కొరటాల శివతో సినిమా చేయాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. విక్రమ్‌ కుమార్‌ తో సినిమా ఉంటుదన్న ప్రచారం జరిగినా.. తాజాగా విక్రమ్‌, అల్లు అర్జున్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. అంటే ప్రస్తుతానికి నాని నెక్ట్స్‌ సినిమా ఫిక్స్‌ కానట్టే అందుకే మంచి కథతో ఎవరు ముందు వస్తే వాళ్లకే డేట్స్‌ ఇవ్వాలని నాని ఫిక్స్‌ అయ్యాడట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement