నాని.. ప్రయోగానికి రెడీ! | Natural Star Nani Next With Director Vikram K Kumar | Sakshi
Sakshi News home page

Apr 17 2018 1:59 PM | Updated on Jul 15 2019 9:21 PM

Natural Star Nani Next With Director Vikram K Kumar - Sakshi

హీరో నాని

వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన నాని జోరుకు కృష్ణార్జున యుద్ధం బ్రేక్‌ వేసింది. ఈ సినిమాలో నాని మార్క్‌ కొత్తదనం కనిపించకపోవటంతో అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్త పడాలని భావిస్తున్నాడు నేచురల్‌ స్టార్‌. అందుకే నెక్ట్స్ ఓ ప‍్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం నాని, సీనియర్‌ హీరోగా నాగార్జునతో కలిసి ఓ మల్టీ స్టారర్‌ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అవసరాల శ్రీనివాస్‌, విక్రమ్‌ కె కుమార్‌, హను రాఘవపూడి లాంటి దర్శకులు నానితో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. నాని మాత్రం విక్రమ్‌ కె కుమార్‌తో సినిమా చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నాడట. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ దర్శకత్వంలో నటిస్తే తన ఇమేజ్‌ ను కాపాడుకోవచ్చని భావిస్తున్నాడట. అయితే ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న మల్టీ స్టారర్‌ పూర్తయితే గాని నాని నెక్ట్స్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement