సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, ఒకానొక సందర్భంలో చిత్ర సీమని ఏలిన లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అక్కినేని అభిమానులను అలరిస్తున్నారు నాగార్జున, నాగచైతన్య, అఖిల్. ఇలా ఒకే వంశానికి చెందిన నలుగురు హీరోలతో ఓ సినిమా తీయాలని అనేమంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఎవరికీ సాధ్యం కాని మ్యాజిక్‌ను విక్రమ్ కుమార్ ‘మనం’తో సుసాధ్యం చేశాడు. ‘మనం’ టాలీవుడ్‌లోనే ఓ మధుర జ్ఞాపకం. మూడు తరాల హీరోలు కలిసి చేసిన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీకి, అభిమానులకు ఎవర్‌గ్రీన్ మూవీ, ఏఎన్నార్ చివరి చిత్రం ‘మనం’ విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తయింది.
కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు కేవలం కొందరి కోసం మాత్రమే పుడతాయి. అలా ‘మనం’ కథ కూడా అక్కినేని కుటుంబం కోసం పుట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య పాత్రలు చాల కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. నలుగురు అక్కినేని హీరోలతో ఏదో ఓ సినిమా తీయాలని రోటీన్ స్టోరీతో కాకుండా విభిన్నంగా ప్రస్తుత జెనరేషనకు తగ్గుట్టు టిపకల్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విక్రమ్ కుమార్. అయితే ఎక్కడా తడబడకుండా, పక్కా స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేశాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రేక్షకులు లీనమయ్యేలా తీయడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.
ఇక అఖిల్ పాత్ర కూడా ఎదో ఇరికించినట్టు కాకుండా సందర్భానుసారంగా వస్తుంది. ఈ సినిమాకు మరో ఆయువుపట్టు మ్యూజిక్. అనూప్ రుబెన్స్ అందించిన సంగీతం మైండ్‌బ్లాక్ అనే చెప్పాలి. అక్కినేని మూడు తరాల హీరోలతో పాటు సమంత, శ్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తెరపై వీక్షించిన అభిమానులు మైమర్చిపోయారు. దీంతో ఏఎన్నార్ చివరి చిత్రం చిరస్థాయిలో నిల్చిపోయేలా అద్భుత విజయాన్ని అభిమానులు అందించారు. ఇక ఈ సినిమా విడుదలై ఆరేళ్లు అవుతున్న సందర్భంగా నాగార్జున, నాగచైతన్య, అనూప్ చిత్ర విశేషాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్లు చేశారు.
చదవండి:
రానా రోకా ఫంక్షన్: సామ్ ఫుల్ హ్యాపీ
కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు
ఆయన చివరి చిత్రానికి ఆరేళ్లు..
Published Sat, May 23 2020 11:07 AM | Last Updated on Sat, May 23 2020 12:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment