Manam Movie
-
‘మనం’ రీరిలీజ్.. అనూప్ రూబెన్స్ మ్యూజికల్ వీడియో వైరల్
అక్కినేని హీరోల సీనీ కెరీర్లో ‘మనం’ చాలా ప్రత్యేకమైన మూవీ. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన ఈ చిత్రం 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో అనుప్ రూబెన్స్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంటాయి. ‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. నేడు(మే 23)సాయంత్రం హైద్రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవీ థియేటర్లో మనం రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మనం’ మ్యూజికల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మనం వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా అనూప్ ఈ వీడియోను రిలీజ్ చేశాడు. అనూప్ కీ బోర్డు మీద వాయించిన ట్యూన్స్ మళ్లీ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాయి.అనూప్ ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తీస్తోన్న పాన్ ఇండియా మూవీకి, గౌరీ రోనంకి తీస్తోన్న చిత్రానికి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. అంతే కాక సుమంత్ హీరోగా సంతోష్ తెరకెక్కిస్తున్న సినిమాకు, సక్సెస్ ఫుల్ కాంబో అయిన ఆది సాయి కుమార్‌తో కృష్ణ ఫ్రమ్ బృందావనం సినిమాకు, విజయ్ కొండ, ఆకాష్ పూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం
సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, ఒకానొక సందర్భంలో చిత్ర సీమని ఏలిన లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అక్కినేని అభిమానులను అలరిస్తున్నారు నాగార్జున, నాగచైతన్య, అఖిల్. ఇలా ఒకే వంశానికి చెందిన నలుగురు హీరోలతో ఓ సినిమా తీయాలని అనేమంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఎవరికీ సాధ్యం కాని మ్యాజిక్‌ను విక్రమ్ కుమార్ ‘మనం’తో సుసాధ్యం చేశాడు. ‘మనం’ టాలీవుడ్లోనే ఓ మధుర జ్ఞాపకం. మూడు తరాల హీరోలు కలిసి చేసిన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీకి, అభిమానులకు ఎవర్గ్రీన్ మూవీ, ఏఎన్నార్ చివరి చిత్రం ‘మనం’ విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తయింది. కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు కేవలం కొందరి కోసం మాత్రమే పుడతాయి. అలా ‘మనం’ కథ కూడా అక్కినేని కుటుంబం కోసం పుట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య పాత్రలు చాల కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. నలుగురు అక్కినేని హీరోలతో ఏదో ఓ సినిమా తీయాలని రోటీన్ స్టోరీతో కాకుండా విభిన్నంగా ప్రస్తుత జెనరేషనకు తగ్గుట్టు టిపకల్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విక్రమ్ కుమార్. అయితే ఎక్కడా తడబడకుండా, పక్కా స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేశాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రేక్షకులు లీనమయ్యేలా తీయడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇక అఖిల్ పాత్ర కూడా ఎదో ఇరికించినట్టు కాకుండా సందర్భానుసారంగా వస్తుంది. ఈ సినిమాకు మరో ఆయువుపట్టు మ్యూజిక్. అనూప్ రుబెన్స్ అందించిన సంగీతం మైండ్‌బ్లాక్ అనే చెప్పాలి. అక్కినేని మూడు తరాల హీరోలతో పాటు సమంత, శ్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తెరపై వీక్షించిన అభిమానులు మైమర్చిపోయారు. దీంతో ఏఎన్నార్ చివరి చిత్రం చిరస్థాయిలో నిల్చిపోయేలా అద్భుత విజయాన్ని అభిమానులు అందించారు. ఇక ఈ సినిమా విడుదలై ఆరేళ్లు అవుతున్న సందర్భంగా నాగార్జున, నాగచైతన్య, అనూప్ చిత్ర విశేషాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్లు చేశారు. చదవండి: రానా రోకా ఫంక్షన్: సామ్ ఫుల్ హ్యాపీ కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా మనం. ఈ సినిమా లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కూడా కావటంతో ఈ సినిమా ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. అయితే చాలా రోజులు మనం సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. మరోసారి అక్కినేని కుటుంబ కథానాయకులంతా కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ గట్టిగా వినిపించింది. ప్రస్తుతం మన్మథుడు 2 సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మనం సీక్వెల్‌ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాహుల్ స్పందించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తాను మన్మథుడు 2 పనుల్లో బిజీగా ఉన్నట్టుగా చెప్పిన రాహుల్ ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని చెప్పారు. అంటే ప్రస్తుతానికి మనం సీక్వెల్‌కు సంబంధించి ఎలాంటి ఆలోచన లేనట్టే అని తెలుస్తోంది. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన మన్మథుడు 2 ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, రావూ రమేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
అదే బ్యానర్లో మరో సినిమా..!
మనం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అఖిల్ సరసన కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమా పనులు పూర్తి కాకముందే నాగార్జున.. విక్రమ్‌తో మరో సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కిస్తున్న విక్రమ్, తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్య హీరోగా రూపొందించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. విక్రమ్ డెడికేషన్, వర్కింగ్ స్టైల్ నచ్చిన కింగ్ వరుస సినిమాలకు అవకాశం ఇస్తున్నాడట. ప్రస్తుతానికి నాగార్జున టీం నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. హలో ప్రచార కార్యక్రమాల్లోనే ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. -
'లెజెండ్'కు 9అవార్డులు వస్తాయని నిరూపిస్తారా!
సాక్షి, హైదరాబాద్ : హింసాత్మక ప్రవృత్తితో కూడిన మూవీలు చేసే దర్శకుడు బోయపాటి శీనుకు బీఎన్ రెడ్డి అవార్డు ఇవ్వడం దారుణమని చిరంజీవి రాష్ట్ర యువత అధికార ప్రతినిధి నాగేంద్ర అన్నారు. సుప్రసిద్ధ వ్యక్తి బీఎన్ రెడ్డి ఎన్నో విలువలతో కూడిన సినిమాలు తీశారు. ఇక్కడ బోయపాటికి బీఎన్ రెడ్డి గురించి తెలుసా. బోయపాటి ఏం చేశారని, ఆయన సినిమాలలో ఏం చూపించారని బీఎన్ రెడ్డి అవార్డు ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదంపై ఆయన మాట్లాడారు. 'మెగా హీరోలకు, వారి సినిమాలకు అవార్డులు ఇవ్వలేదని మేం చెప్పడం లేదు. అవార్డులు కావాలని అడగలేదు. కానీ, అసలు లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు వస్తాయని ఎవరైనా నిరూపించగలరా. ప్రజా క్షేత్రంలోకి వచ్చి ఒపినియన్ పోల్ లాంటిది పెడితే.. ఆ సినిమాకు ఎన్ని అవార్డులొస్తాయన్న వాస్తవం బయటపడుతుంది. మనం సినిమా ఎంతో మంచి మూవీ. అందులో ఎన్నో విలువలున్నాయి. ఉత్తమ చిత్రం సహా పలు విభాగాల్లో అవార్డులు రావాల్సిన మనం మూవీకి కేవలం 'ద్వితీయ ఉత్తమ చిత్రం' అవార్డుతోనే సరిపెట్టారు. చివరిశ్వాస ఉన్నంతవరకూ నటిస్తానని చెప్పిన మహానటుడి చివరి చిత్రం 'మనం'. మనం చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వకపోవడం మహానటుడు ఏఎన్నార్ ను అవమానించడమే అవుతుంది. రుద్రమదేవి కోసం నటి అనుష్క ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. తెలుగువాడి చరిత్రను తెలియజెప్పే ఆ మూవీకి సరైన గుర్తింపు దక్కలేదు. 'రుద్రమదేవి'లో నటనకుగానూ ఉత్తమ నటి అవార్డు అందుకోవాల్సిన అనుష్కకు 'సైజ్ జీరో'కు గానూ ఇవ్వడంలో అర్థం లేదు. ఎన్నో మంచి చిత్రాలు తీసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు బీఎన్‌రెడ్డి పురస్కారం ఇచ్చారు. ఎందుకంటే ఆయన మూవీలకూ సరైన గుర్తింపు ఇవ్వకపోవడమే అందుకు ప్రధాన కారణమని' నాగేంద్ర అభిప్రాయపడ్డారు. మరోవైపు గుణశేఖర్, నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వడం అల్లు అర్జున్ను అవమానించమేనని గుణశేఖర్ పేర్కొన్నారు. 'అవార్డుల ఎంపికలో అవకతవకలను ప్రశ్నిస్తే మూడేళ్లు నిషేధిస్తారట. ఏపిలో గుత్తాధిపత్యం నడుస్తోందంటూ' ఆవేదన వ్యక్తం చేశారు. 'నంది అవార్డుల ఎంపికలో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగింది. ఉత్తమ నటుడు అవార్డును ప్రభాస్ కు ఎందుకివ్వలేదు..? రుద్రమదేవి సినిమాకు ఎందుకు అన్యాయం చేశారని' నిర్మాత బుజ్జి ప్రశ్నించారు. -
అవార్డులపై నమ్మకం పోతుంది : కత్తి మహేష్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా విషయంపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజంగా ప్రతిభకు తగ్గట్లు అవార్డులు ఇచ్చారా ఆయన ప్రశ్నించారు. అవార్డులు ఇచ్చేవాడు మనవాడయితే ఎలాంటి సినిమా తీసినా పర్వాలేదేమో అంటూ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు నెటిజన్లు ఏపీ ప్రభుత్వం సోమవారం ప్రకటించిన నంది అవార్డుల ఎంపికను విమర్శిస్తున్నారు. ఆ సినిమాలకు పలానా కేటగిరీలో ఎందుకు అవార్డులు ఇచ్చారన్నదానిపై కనీసం రెండు పేరాగ్రాఫ్ సమాచారం ఇవ్వాలన్నారు మూవీ క్రిటిక్ మహేశ్ కత్తి. అప్పుడైతే అవార్డు పలానా సినిమాకు ఎందుకిచ్చారో అర్థమవుతుందని, లేని పక్షంలో ఇండస్ట్రీతో పాటు ప్రజల్లోనూ అవార్డులపై నమ్మకం పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవం చెప్పాలంటే.. ఎవడే సుబ్రమణ్యం సూపర్ మూవీ. కానీ సామాజిక అంశాలున్న ఆ మూవీకి ఏ అవార్డు ఇచ్చారో చూడండి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు లాంటి కీలక అవార్డులు రావాల్సిన మూవీకి ద్వితీయ ఉత్తమ చిత్రం, తొలి చిత్ర దర్శకుడు అంటూ ఏదో ఇవ్వాలంటూ నామమాత్రంగా అవార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. లెజెండ్ మూవీకి తొమ్మిది అవార్డులిచ్చారు. అన్ని అవార్డులు ఎందుకిచ్చారో ఏపీ ప్రభుత్వం విశ్లేషించుకోవాలి. ఉత్తమ చిత్రం అవార్డు రావాల్సిన 'మనం' మూవీకి ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డుతో సరిపెట్టారు. అవార్డులు ఇస్తున్నామంటే ఎన్నో ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అవార్డ్ జ్యూరీ సభ్యులు, ప్రభుత్వం, ఇతరత్రా యంత్రాంగం గుర్తించాలి. ఇక్కడ అవార్డులు వచ్చిన ఏ మూవీకి జాతీయ, ఇతర సినీ అవార్డుల్లో అవార్డులు రావడం లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మూడేళ్లకోసారి అవార్డులు ఇవ్వడం కంటే ప్రతి ఏడాది సంబంధిత అవార్డులు ఇస్తే ప్రేక్షకులకు ఓ అవగాహన వస్తుందన్నారు. -
నంది అవార్డ్సా.. నందమూరి అవార్డ్సా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నంది అవార్డులు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. 2014, 15, 16 సంవత్సరాలకుగాను ఉత్తమ చిత్రాలకు ఏపీ సర్కారు మంగళవారం సాయంత్రం నంది అవార్డులు ప్రకటించింది. ఈ మూడు సంవత్సరాలకు లెజెండ్, బాహుబలి, పెళ్లి చూపులు ఉత్తమ సినిమాలుగా, బాలకృష్ణ, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుల విషయంలో ఇటు టాలీవుడ్‌లోనూ, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సర్కారు రాజకీయంగా తమవారికే నందులు పంచిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మెగా కుటుంబానికి అవమానం..! ముఖ్యంగా నంది అవార్డుల విషయంలో మెగా హీరోలకు అన్యాయం జరిగిందనే వాదన వినిపిస్తోంది. నంది అవార్డుల్లో మెగా హీరోలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. అదీకాక రుద్రమదేవి సినిమాలో 'గోనగన్నారెడ్డి' పాత్ర పోషించిన అల్లు అర్జున్‌కి 'బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్' నటుడిగా నంది అవార్డు ప్రకటించడం పుండు మీద కారం చల్లినట్టు అయింది. ఒక స్టార్ హీరోగా రాణిస్తున్న యువ నటుడిని 'క్యారెక్టర్ ఆర్టిస్ట్'కు పరిమితం చేసి అవార్డు ఇవ్వడం ఏమిటి? అన్న వాదన వినిపిస్తోంది. అల్లు అర్జున్‌కు 'బెస్ట్ సోపోర్టింగ్ యాక్టర్' అవార్డు ఇస్తే న్యాయం జరిగి ఉండేదని, కానీ అందుకు భిన్నంగా అవార్డు ప్రకటించి అవమానించారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. బన్నీ వాసు ఫైర్..! మెగా కుటుంబ అభిమాని.. గీతా ఆర్ట్స్ కో ప్రొడ్యూసర్ మేనేజర్ బన్నీ వాసు నంది అవార్డులపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. "టీడీపీ ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలి. నంది అవార్డులు రావాలంటే.. తక్షణం చంద్రబాబు సర్కారు వద్ద శిక్షణ పొందాలి. నంది అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి తీవ్ర అన్యాయం జరిగింది. అల్లు అర్జున్‌కి ఉత్తమ క్యారెక్టర్ నటుడు అవార్డు ఇచ్చి అవమానించారు' అని బన్నీవాసు కామెంట్ చేశారు. మెగా అభిమానుల్లో ఉన్న ఆగ్రహాన్ని ఈ వ్యాఖ్యలు చాటుతున్నాయి. 'లెజెండ్' సినిమాకు 9 నందులా? బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'లెజెండ్' సినిమాకు నంది అవార్డుల్లో పెద్దపీట దక్కింది. ఈ సినిమాకు ఏకంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్ ఇలా తొమ్మిది నంది అవార్డులు దక్కాయి. అయితే, మాస్ మసాల కమర్షియల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇన్ని నంది అవార్డులు రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నంది అవార్డుల జ్యూరీలో బాలకృష్ణ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఇలా అవార్డులు రావడం విమర్శలకు తావిస్తోంది. ఏపీ సర్కారు ప్రకటించింది నంది అవార్డులా? నందమూరి అవార్డులా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ 'నరసింహానాయుడు', 'శ్రీరామరాజ్యం' సినిమాలకుగాను బాలకృష్ణకు నంది అవార్డులు వచ్చినప్పుడు ఇదేవిధంగా విమర్శలు వచ్చాయి. 'మనం'కు అన్యాయం..! తెలుగు సినీ దిగ్గజం, లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా 'మనం'. ఈ సినిమాలో మూడు తరాల అక్కినేని నటులు నటించారు. చక్కని కుటుంబ కథా చిత్రంగా, వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ సినిమాను కాదని తెరపై రక్తపాతం పారించిన 'లెజెండ్' సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు ప్రకటించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు తీవ్రమైన వ్యాఖ్యలతో ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏఎన్నార్ నటించిన చివరి సినిమాకు ఇదా ఏపీ సర్కారు ఇచ్చే గౌరవం అని విమర్శిస్తున్నారు. ఈ సినిమాకు ఉత్తమ ద్వితీయ చిత్రంగా అవార్డు ఇచ్చి సరిపుచ్చడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇందుకు నిరసనగా 'మనం' సినిమాకుగాను తనకు దక్కిన 'ఉత్తమ సహాయ నటుడు' అవార్డును బహిష్కరించాలని, ఈ అవార్డును నాగచైతన్య తీసుకోవద్దని అభిమానులు సూచిస్తున్నారు. 'రుద్రమదేవి'ని పట్టించుకోలేదు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. ఎంతో శ్రమించి తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన 'రుద్రమదేవి' సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పిందని ఆ మధ్య గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో 'రుద్రమదేవి' సినిమా నంది అవార్డుల్లో విస్మరణకు గురికావడం గమనార్హం అని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక, ఊపిరి, భలేభలే మగాడివోయ్ వంటి సినిమాలను అస్సలు గుర్తించకపోవడం, వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్ మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌ను విస్మరించడం కూడా విమర్శలకు తావిస్తోంది. నంది అవార్డులు ప్రకటించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను రాజకీయ కోణంలో ఏపీ సర్కారు పంపిణీ చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. "మేఘసందేశం" లాంటి క్లాసిక్ కు 9 నంది అవార్డులు, "లెజెండ్" లాంటి మాస్ ఎంటర్టైనర్ కు 9 నంది అవార్డులు. హతవిధీ!!! pic.twitter.com/jrHeGXojiF — GNR (@rao_goka) 15 November 2017 -
అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు
చెన్నై: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. 'రేసుగురం'లో ఉత్తమ నటనకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 'రేసుగుర్రం'లో నటించిన శృతి హాసన్ ఉత్తమ కథానాయిక అవార్డు అందుకుంది. 62వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల ప్రదానోత్సవం శనివారం చెన్నైలో జరిగింది. రేసుగుర్రం 3 పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన 'మనం'కు 5 అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం: మనం ఉత్తమ దర్శకుడు: విక్రమ్ కే కుమార్(మనం) ఉత్తమ సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్(మనం) ఉత్తమ గేయరచయిత: చంద్రబోస్(మనం) ఉత్తమ ఛాయగ్రాహకుడు: పిఎస్ వినోద్(మనం ఉత్తమ నటుడు: అల్లు అర్జున్(రేసుగుర్రం) ఉత్తమ నటి: శృతి హాసన్(రేసుగుర్రం) ఉత్తమ నేపథ్య గాయకుడు: సింహా(రేసుగుర్రం) ఉత్తమ సహాయ నటుడు: జగపతిబాబు(లెజెండ్) ఉత్తమ సహాయనటి: మంచు లక్ష్మి(చందమామ కథలు) ఉత్తమ నేపథ్య గాయనీ: సునీత(ఊహలు గుసగుసలాడే) -
మనం 100రోజుల వేడుక
-
సకుటుంబంగా... ‘మనం’ అర్ధ శతదినోత్సవం
‘సినిమాల పరంగా, పాత్రల పరంగా గతంలో నేను చేసిన తప్పులన్నిటినీ తుడిచేసింది ‘మనం’. మూడేళ్ల క్రితం దర్శకుడు విక్రమ్‌కుమార్ రూపంలో అదృష్టం మా ఇంటి తలుపు తట్టింది. అచ్చతెలుగు కథని మా ద్వారా ప్రేక్షకులకు అందించిన విక్రమ్‌కుమార్ రుణం తీర్చుకోలేనిది. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు ఆయన వేరే లోకంలో ఉండేవారు’’ అని హీరో నాగార్జున అన్నారు. విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘మనం’. అక్కినేని ఫ్యామిలీ నిర్మించిన ఈ సినిమా అర్ధ శతదినోత్సవం పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో నాగ్ తన మనో భావాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేశారు. ఈ చిత్రం 85 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఓవర్సీస్లో అయితే బ్లాక్‌బస్టర్. ఈ సినిమా విజయం సాధించాలని నాన్న ఎన్నో కలలు కనేవారు. ఆరోగ్యం బాగుండకపోయినా కష్టపడి పనిచేశారు. నాన్న తపన చూశాక ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అని భయం వెంటాడేది. ఇప్పుడు హిట్ అయ్యాక నాన్న లేరే అని బాధేస్తోంది’’అన్నారు. వెంకట్ అక్కినేని మాట్లాడుతూ ‘‘ఆస్ట్రేలియాలో ఈ సినిమా చూశాను. 10 నిమిషాలు చూశాను. అంతే... కంటినిండా నీరే. సినిమా కనిపించలేదు. మళ్లీ చూడాలి’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నాన్నతో, తాతయ్యతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవం’’ అన్నారు. నాగ్, కె. రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్‌రెడ్డి చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు జ్ఞాపికల ప్రదానం జరిగింది. -
అమితాబ్‌ని అకట్టుకున్న మనం మూవీ
-
అది ఏఎన్నార్ మ్యాజిక్: నాగార్జున
హైదరాబాద్: 'మనం' సినిమాలో బోర్ కొట్టించే సన్నివేశాలు లేవని అక్కినేని నాగార్జున తెలిపారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఇప్పటి ట్రెండ్‌కు తగినట్టుగా ఈ సినిమా తీశామని ఆయన వెల్లడించారు. తన మొదటి సినిమా విడుదలైన మే 23నే మనం కూడా విడుదలకానుండడం యాధృచ్చికమని చెప్పారు. ఎన్నికలు ముగిసిన వారం తర్వాత విడుదల చేయాలన్న ఉద్దేశంతో 23వ తేదీని ఎంచుకున్నామని వివరించారు. ఇదే రోజు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పుట్టినరోజు కూడా అని చెప్పారు. అలాగే మనం పదాన్ని ఇంగ్లీషులో ఎటువైపు నుంచి చదివినా ఒకేలా ఉంటుందన్నారు. ఇవన్ని అనుకుని చేసివని కాదన్నారు. అది ఏఎన్నార్ మ్యాజిక్ అని నాగార్జున అన్నారు. చివరి క్షణం వరకూ నటునిగానే కొనసాగాలన్న నాన్నగారి ఆశకు ప్రతిరూపమే ‘మనం’ సినిమా అని నాగార్జున అంతకుముందు చెప్పారు. నాన్నగారి చివరి సినిమా ‘మనం’ జన హృదయాల్లో కలకాలం గుర్తుండిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
'మనం' విడుదల తర్వాతే అఖిల్ ఆరంగేట్రం: నాగార్జున
తన తండ్రితోను, కొడుకుతోను కలిసి నటించిన 'మనం' చిత్రం విడుదలైన తర్వాతే.. అఖిల్ సినీరంగ ప్రవేశం ఉంటుందని అక్కినేని నాగార్జున తెలిపారు. తన తండ్రి నాగేశ్వరరావుతోను, కొడుకు నాగచైతన్యతోను కలిసి 'మనం' చిత్రంలో నటించడం చాలా అద్భుతమైన అనుభవమని ఆయన అన్నారు. ఇటీవలే కన్నుమూసిన అక్కినేని నాగేశ్వరరావుకు 'మనం' చిట్టచివరి చిత్రం అన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా వినోదభరితమైన చిత్రమని, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నాగ్ అన్నారు. తన నటజీవితంలోనే ఇలాంటి సాహసోపేతమైన పయనం ఎప్పుడూ చేయలేదని, ఒకేసారి ఒకే సినిమాలో తన తండ్రితోను.. తన కొడుకుతోను కలిసి తాను నటించిన ఏకైక చిత్రం ఇదేనని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 31వ తేదీన ఉగాది సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ఇంకా సమంత, నీతూ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. మనం విడుదలైన తర్వాత మాత్రమే అఖిల్ సినీరంగ ఆరంగేట్రం చేస్తాడని కూడా నాగార్జున చెప్పారు. -
శ్రీయకు డబుల్ ధమాకా!
ఒకేసారి రెండు విలక్షణ పాత్రలు చేసే అవకాశం వస్తే, ఏ ఆర్టిస్ట్‌కైనా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ ఆ ఆనందంలోనే ఉన్నారు. విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు శ్రీయ. శశికుమార్, శ్రీయ జంటగా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఇందులో కథానాయికది డాన్స్ బేస్డ్ కేరక్టర్ కావడంతో శ్రీయను తీసుకున్నారని సమాచారం. ఈ ముద్దుగుమ్మకు క్లాసికల్ డాన్స్ తెలియడం ఈ విధంగా ప్లస్ అయ్యింది. ఇక, మరో అవకాశం విషయానికొస్తే.. విద్య అనేది దాచుకోవడానికి కాదు.. సమాజ శ్రేయస్సు కోసం పది మందికి పంచేదంటూ, కుల, మతరహితంగా అందరికీ జ్ఞానాన్ని బోధించిన ఆధ్యాత్మిక గురువు రామానుజాచార్యుల జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో రామానుజాచార్యుల భార్య బీబీ నాంచారి పాత్రను శ్రీయ పోషించనున్నారు. ఇక, శ్రీయ కెరీర్ అయిపోయిందని కొంతమంది ఫిక్స్ అవుతున్న తరుణంలో ఇలా డబుల్ ధమాకా తగలడం శ్రీయకు స్వీట్ షాక్ తిన్నట్లు అనిపించిందట. ఇటీవలే తెలుగులో ఆమె ‘మనం’ చిత్రంలో నటించారు. ఆ సినిమా వచ్చే నెలాఖరున విడుదల కానుంది.