‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌! | Rahul Ravindran gives Clarity on Manam Sequel | Sakshi
Sakshi News home page

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

Published Sat, Jul 27 2019 12:29 PM | Last Updated on Sat, Jul 27 2019 12:29 PM

Rahul Ravindran gives Clarity on Manam Sequel - Sakshi

అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా మనం. ఈ సినిమా లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కూడా కావటంతో ఈ సినిమా ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. అయితే చాలా రోజులు మనం సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. మరోసారి అక్కినేని కుటుంబ కథానాయకులంతా కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారన్న టాక్‌ గట్టిగా వినిపించింది.

ప్రస్తుతం మన్మథుడు 2 సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మనం సీక్వెల్‌ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాహుల్ స్పందించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తాను మన్మథుడు 2 పనుల్లో బిజీగా ఉన్నట్టుగా చెప్పిన రాహుల్ ఆ సినిమా రిలీజ్‌ అయిన తరువాత తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని చెప్పారు. అంటే ప్రస్తుతానికి మనం సీక్వెల్‌కు సంబంధించి ఎలాంటి ఆలోచన లేనట్టే అని తెలుస్తోంది.

నాగార్జున సరసన రకుల్ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటించిన మన్మథుడు 2 ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, రావూ రమేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement