Nagarjuna Serious On Media Over His Comments On Samantha Divorce With Naga Chaitanya - Sakshi
Sakshi News home page

Nagarjuna : 'నాన్సెన్స్... చై-సామ్‌ విడాకులపై నేను అలా మాట్లాడలేదు'

Published Thu, Jan 27 2022 6:51 PM | Last Updated on Thu, Jan 27 2022 8:48 PM

Nagarjuna Serious On Media Over His Comments On Samantha Divorce With Naga Chaitanya - Sakshi

Nagarjuna Breaks Silence About Samantha and Naga Chaitanya Split: సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌2న విడాకులు తీసుకుంటున్నట్లు వీరిద్దరూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

అప్పటి నుంచి వీరిద్దరి గురించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా చై-సామ్‌ విడాకులకు సంబంధించి నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.ముందుగా విడాకులు కావాలని సమంతే అడిగిందని, చై ఆమె నిర్ణయాన్ని గౌరవించి ఒప్పుకున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి.


తాజాగా దీనిపై నాగార్జున స్పందించారు. అవి పూర్తిగా తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. 'సమంత, నాగ చైతన్య విడాకులకు సంబంధించి నేను మాట్లాడినట్లు సోషల్‌ మీడియాలో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తి అబద్దం. దయచేసి పుకార్లను వార్తలుగా ప్రచారం చేయొద్దని మీడియా మిత్రులను కోరుతున్నాను' అంటూ ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement