Viral Video: Bride and Groom Set Themselves on Fire in Wedding Exit Stunt, Wow Wedding Guests - Sakshi
Sakshi News home page

Viral Fire Wedding Video: వెడ్డింగ్ రిసెప్షన్‌లో వధూవరుల 'ఫైర్ స్టంట్'.. షాకైన అతిథులు...

Published Fri, May 13 2022 1:50 PM | Last Updated on Fri, May 13 2022 2:50 PM

Viral video: Bride and groom set themselves on fire in wedding exit stunt, wow wedding guests - Sakshi

ఇటీవల కాలంలో పెళ్లి కార్యక్రమానలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు. పెళ్లి దుస్తుల్లోనే డ్యాన్స్‌ కార్యక్రమాలు, యోగా, వ్యాయామాలు చేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి జంట కూడా ఇలాగే బిన్నంగా చేసింది. రిసెప్షన్‌ అనంతరం ‘వెడ్డింగ్‌​ ఎగ్జిట్‌’ లో భాగంగా వధూవరులు ఫైర్ స్టంట్ చేశారు. 

గేబ్‌ జెస్సోప్‌-అంబీర్ అనే ఆ కొత్త జంట ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్ కావడంతో ఇలాంటి సాహస ప్రదర్శన చేశారు. స్టంట్‌ ప్రారంభించే ముందు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని నిలుచొని ఉండగా.. ఇంతలో ఓ వ్యక్తి అంబిర్ కుడి చేతిలో పట్టుకున్న ఫ్లవర్ బొకేకి నిప్పంటించాడు. క్షణాల్లో ఆ మంటలు వధూవరుల వీపు భాగంలోకి వ్యాపించాయి. అలానే కొంత దూరం ముందుకు నడిచి తర్వాత మెల్లగా పరిగెత్తారు. కొద్ది దూరం పరిగెత్తిన జంట ఒకచోట మోకాళ్లపై కూర్చున్నారు. అంనతం ఇద్దరు వ్యక్తులు వెంటనే మంటలార్పేశారు. 

కాగా ఈ కొత్త జంట చేసిన ఫైర్ స్టంట్‌కి వెడ్డింగ్ రిసెప్షన్‌కి వచ్చిన అతిథులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గేబ్, అంబిర్ ప్రస్తుతం హాలీవుడ్‌లో స్టంట్ మాస్టర్స్‌గా పనిచేస్తున్నారు. అందుకే ఇంత అలవోకగా.. ఆ స్టంట్ చేశారు.
NOTE: ఇలా స్టంట్‌ చేయడం ప్రమాదకరం. ఎలాంటి శిక్షణ, అనుభవం లేని వారు సరాదాగా వీటిని ప్రయత్నించరాదు.
చదవండి: వైరల్‌.. సంగీత్‌ ఫంక్షన్‌.. తోడు పెళ్లికూతురు సూపర్‌ డ్యాన్స్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement