Viral Video: Girls Dance On Main Sharabi Song With Drinks In Hand For Wedding Baraat - Sakshi
Sakshi News home page

Girls Baraat Dance: పెళ్లిలో జోష్‌ పెంచిన యువతల డ్యాన్స్‌.. అదిరేటి స్టెప్పులతో..

Dec 12 2021 3:36 PM | Updated on Dec 12 2021 4:41 PM

Viral Video: Girls Dance On Main Sharabi With Drinks In Hand During Baraat - Sakshi

పెళ్లి అంటేనే సందడి.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల హడావిడీ.. డీజే పాటలు, డ్యాన్‌ స్టెప్పుల ఉత్సాహం.. మొత్తంగా ఒక పండగ వాతావరణం తలపిస్తుంది. పాత కాలంలో జరిగే పెళ్లిళ్లకు.. ఇప్పుడు జరిగే వివాహాలకు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కాలంలో పెళ్లి వేడుకను జీవితాంతం గుర్తిండిపోయేలా వైభవంగా నిర్వహించుకుంటున్నారు. సంగీత్‌లు, మెహందీ ఫంక్షన్‌లు, డీజేలు ఏర్పాటు చేసి ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. పెళ్లిలో వరుడు, వధువు డ్యాన్స్‌ చేయడం కామన్‌ అయిపోయాయి. కానీ కేవలం అమ్మాయిలే గ్రూప్‌లా ఏర్పడి డప్పుచప్పుళ్లకు స్టెప్పులు వేస్తే ఆ కిక్కే వేరు.

ముఖ్యంగా పంజాబ్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో వివాహాలు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇలాంటి డ్యాన్స్‌లు, ఎంజాయ్‌మెంట్‌తో నిండి ఉంటుంది. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పెళ్లి కొడుకు బారాత్‌ తో పెళ్లి వేదిక వద్దకు చేరుకోగా.. అక్కడున్న యువతులందరు డ్యాన్స్‌ చేయడం ప్రారంభించారు. కాక్‌టెయిల్‌ సినిమాలోని యో యో హనీసింగ్‌ పాపులర్‌ పాట మెయిన్‌ షరాబీ పాటకు చిందులేశారు. బ్యాండ్‌ వాళ్ల దగ్గరికి వెళ్లి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.
చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్‌!

ఇందులో ఓ యువతి చేతిలో డ్రింక్‌బాటిల్‌ పట్టుకొని జోరుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించడం అందరిని ఆకట్టుకుంటోంది. యువతల డ్యాన్స్‌ అందరిలోను జోష్ పెంచేసింది. ఇంకా ఇంకా జోరుగా కొట్టాలని కోరారు. దాంతో బ్యాండ్ బాజా టీమ్ మరింతగా బీచ్ పెంచింది. వారి హంగామాతో... పెళ్లి వేడుకలో ఒక్కసారిగా సందడి పెరిగింది. దీనిని ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్‌ షేర్ చేశారు. ఇప్పటి వరకు లక్షల వ్యూవ్స్‌. 10 వేల లైకులు వచ్చాయి.  చాలా మంది కామెంట్లలో ఫన్నీ, హార్ట్ సింబల్ ఇమోజీలను పోస్ట్ చేస్తున్నారు.
చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఉదయం కొన్నాడు.. సాయంత్రానికి జాక్‌పాట్‌ కొట్టాడు!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement