![Bride Sends Flying Kisses To Bride As He Arrives at Wedding Venue - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/22/marriage.jpg.webp?itok=oF91Nt4I)
పెళ్లి.. ఈ రెండక్షరాల పదం రెండు వ్యక్తుల జీవితాలను ఎల్లకాలం ముడిపెడుతుంది. రెండు కుంటుంబాలను ఒక్కటి చేసుంది. ముఖ్యంగా అమ్మాయిల జీవితంలో పెళ్లి అనేది కొత్త సవాళ్లకు నాంది పలుకుతుంది.. అత్తారిల్లు అనే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో బంధాలు, బాధ్యతలను నేర్పుతోంది. అలాంటి పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోవాలనే అందరూ కోరుకుంటారు.
చదవండి: వైరల్: ‘వార్నీ ఎంత అన్యాయం.. చేతులతో ఎత్తి పైకి పంపిస్తే.. చేయిచ్చారు’
ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హడావిడీ చేస్తోంది. అసలిందులో ఏముందంటే.. పెళ్లి కోసం అందంగా ముస్తాబైన వధువు తనకు కాబోయే వాడికోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటుంది. అంతలోనే మగపెళ్లి వారంతా వధువు ఇంటి వద్దకు చేరుకుంటారు. ఊరేగింపుతో వరుడు వస్తుండగా బాల్కనీలో నుంచి చూస్తూ పెళ్లి కూతురు తెగ సంబరపడిపోతుంటుంది.
చదవండి: వైరల్: మనోడి లక్ బాగుంది.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి..!
అయితే ఆమెను వరుడు చూడకపోవడంతో అక్కడున్న వేరే వారికి సైగలు చేసి చివరికి అతను చూసేలా చేస్తుంది. ఇంకేముంది వరుడు చూడటంతో సంతోషం పట్టలేక గాల్లో అతనికి ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ తన ప్రేమను తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వెడ్డింగ్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘హార్ట్ ఎమోజీని జతచేస్తూ, వారిద్దరు ఎంతో అదృష్టవంతులు’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment