![UP Man sets Mercedes Car On Fire Over Non-Payment Of Dues Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/15/fire1.jpg.webp?itok=ZGRzk0dT)
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి తనకు కూలీ డబ్బులు ఇవ్వలేదని యజమాని కారు తగలబెట్టి పగ తీర్చుకున్నాడు. సుమారు రూ.2 లక్షల కూలీ పైసలివ్వలేదని యజమానికి చెందిన రూ.కోటి విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును తగలబెట్టేశాడు. ఈ దృశ్యాలు ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని గుర్తించిన యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. హెల్మెట్ పెట్టుకొని వచ్చి వీధిలో ఎవరూ లేని సమయం చూసి పెట్రోల్ పోసి కారును తగులబెట్టడం అందులో స్పష్టంగా కన్పించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో ఇంట్లో టైల్స్ వేసిన పనికి సంబంధించి రూ.2 లక్షల కూలీ ఇవ్వకుండా సతాయిస్తున్నాడని అతను ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు.
Man sets #MercedesBenz on fire in #Noida because the car owner did not pay him money due for tiles installation. #UttarPradesh #ViralVideo pic.twitter.com/4OriOvp1M4
— The Viral Finder (@TheViralFinder) September 14, 2022
ఇదీ చదవండి: Video Viral: మనసుకు నచ్చినోడు.. తాళి కట్టేవేళ పెళ్లికూతురు పట్టరాని సంతోషంతో..
Comments
Please login to add a commentAdd a comment