మంటలార్పుతున్న సిబ్బంది
బెర్లిన్ : ‘పిట్ట కొంచెం కూత ఘనం’ సామెత వినే ఉంటాము. జర్మనిలో ఓ చిన్న పిట్టను చూసిన వారు కూడా ఇదే మాట అంటున్నారు. జాలీ కూడా పడుతున్నారు. కారణం కరెంట్ షాక్ తగిలిన ఆ చిన్న పిట్ట తను కాలిపోవడమే కాక దాదాపు 17 ఏకరాల విస్తీర్ణంలో కార్చిచ్చు రగిల్చింది. ఈ సంఘటన జర్మన్ తీర ప్రాంతం రోస్టాక్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. ఒక చిన్న పక్షి అనుకోకుండా కరెంటు తీగలకు తాకడంతో మంటలు అలముకున్నాయి. దాంతో ఆ పక్షి అక్కడే ఉన్న పొలాల్లో పడిపోయింది. అసలే అవన్ని ఎండు గడ్డి పోలాలు. ఇంకేముంది దాంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి.
అగ్నికి ఆజ్యం పోసినట్లు.. సరిగ్గా ఇదే సమయానికి ఈదురు గాలులు కూడా తోడవడంతో ఆ మంటలు కాస్తా అలా అలా దాదాపు 17 ఎకరాల మేర వ్యాపించాయి. అయితే సమయానికి చుట్టు పక్కల జనాలు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందంటున్నారు అధికారులు. మంటలు గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటాన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇలాంటి సంఘటనే ఒకటి ఈ ఏడాది మార్చిలో జరిగింది. కొందరు అమెరికన్ విద్యార్ధులు పాస్తాలో నీళ్లు పోయకుండా వండుదామని ప్రయత్నించారు. ఆ ప్రయోగం కాస్తా ఫెయిల్ అయ్యి అపార్ట్‌మెంట్ మొత్తం మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment