ప్రియురాలిపై పెట్రోల్ పోసినిప్పు | man set fire to his lover family | Sakshi
Sakshi News home page

ప్రియురాలిపై పెట్రోల్ పోసినిప్పు

Published Sun, Mar 13 2016 1:42 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

ప్రియురాలిపై పెట్రోల్ పోసినిప్పు - Sakshi

ప్రియురాలిపై పెట్రోల్ పోసినిప్పు

* పెళ్లి చేసుకోదేమోనని ప్రియుడి ఘాతుకం
* మంటలంటుకుని ఆమె కుటుంబసభ్యులకూ తీవ్రగాయాలు

బెంగళూరు(బనశంకరి): పెళ్లి చేసుకోమం టే నిర్లక్ష్యం వహిస్తోందని ఓ ప్రేమికుడు ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటిం చాడు. ఈ ఘటనలో యువతితోపాటు ఆమెను కాపాడ్డానికి వెళ్లిన తల్లిదండ్రులు, చెల్లెలు మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులోని శ్రీరాంపు ర పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. శ్రీరాంపురలోని సాయిబాబానగర్‌కు చెందిన నటరాజ్, అనుపమ దంపతుల కుమార్తె మేఘన ఇంజనీరింగ్ చదువుతోంది.

వారి ఇంటి పక్కనే ఉండే దీపక్ ఓ మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పారిపోయి వివాహం చేసుకోవడానికి యత్నించగా.. ఇరు కుటుంబాల వారు వెనక్కి పిలిపించారు. చదువు పూర్తయిన తర్వాత వివాహం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో కొంతకాలంగా బండిరెడ్డిపాళ్యలో నివాసముంటున్న దీపక్  మేఘన ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అయితే.. తనతో వివాహానికి మేఘన అంగీకరించదేమోనని అనుమానం పెంచుకొని శుక్రవారం అర్ధరాత్రి దాటాక ప్రియురాలిఇంటికి వెళ్లాడు.

కిటికీలోంచి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న మేఘన కేకలు వేయడంతో మరో గదిలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, చెల్లెలు సంజన అక్కడికి వచ్చారు.  మంటలు వారికీ అంటుకున్నాయి. వీరి అరుపులు విని ఇరుగుపొరుగు వారు అక్కడకు వచ్చి నీళ్లు పోసి మంటలు ఆర్పివేశారు. పోలీసులు వచ్చి బాధితులను ఆస్పత్రికి తరలించారు. దీపక్‌ను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement