singarayakonda
-
సిగ్గు విడిచి.. చిలవలు పలవలు
సింగరాయకొండ/ఒంగోలు టౌన్: ఎక్కడ చిన్న గొడవ జరిగినా అది వైఎస్సార్సీపీకి అంటగట్టడం ఎల్లో బ్యాచ్‌కు అలవాటుగా మారింది. జరిగిన ఘటనపై టీడీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. వెనువెంటనే వారి అనుకూల ఛానల్స్‌లో అసత్య కథనాలు మొదలైపోతాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జరిగిన కారు దహనం ఘటన దానికి నిదర్శనంగా నిలిచింది. మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్‌లో టీడీపీ నేత చిగురుపాటి శేషగిరిరావు నివాసముంటున్నాడు.శుక్రవారం అర్ధరాత్రి అతని ఇంటి ఆవరణలోని కారుపై కొందరు పెట్రోలు పోసి తగలబెట్టారు. అయితే ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిందని, రాజకీయాలకు సంబంధంలేదని బాధితుడితోపాటు పోలీసులు చెబుతున్నా పచ్చ నేతలు దానికి రాజకీయ రంగు పులిమి శిలవలు పలవలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఒంగోలులో ఏఎస్పీ (క్రైం) శ్రీధర్‌రావు మీడియాకు వివరించారు. వ్యక్తిగత విద్వేషాలతోనే శేషగిరిరావును భయభ్రాంతులకు గురిచేసేందుకు కారు దహనానికి పాల్పడ్డారని, ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. అసలు జరిగింది ఇదీ.. సింగరాయకొండ లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శేషగిరిరావుకు అదే గ్రామానికి చెందిన లాడ్జి యజమాని కనసాని ఈశ్వర్‌రెడ్డికి మధ్య భూ వివాదం ఉంది. ఈశ్వర్‌రెడ్డికి, అశోక్ అనే వ్యక్తికి మధ్య ఒక భూ వివాదానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన శేషగిరిరావు అందుకు సంబంధించిన సెటిల్మెంట్ పత్రాలను తన వద్దనే ఉంచుకొన్నాడు. అయితే ఆ పత్రాలను తనకు ఇవ్వవలసిందిగా ఈశ్వర్‌రెడ్డి కొద్ది రోజులుగా అడుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా ఈశ్వర్ రెడ్డి మీద శేషగిరిరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు.దీంతో కక్ష పెంచుకున్న ఈశ్వర్ రెడ్డి తన వద్ద పనిచేసే పాలేటి అభిõÙక్ అతడి మిత్రుడైన ఒక మైనర్ సహాయంతో శేషగిరిరావు ఇంటివద్ద ఉన్న కారుపై పెట్రోలు పోసి తగలబెట్టించాడు. శేషగిరిరావు ఫిర్యాదు చేసిన వెంటనే ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పందించారు. ఈ కేసును ఛేదించేందుకు అడిషనల్ ఎస్పీ (క్రైం) శ్రీధర్ రావు, ఒంగోలు డీఎస్పీ కిశోర్ కుమార్ల ఆధ్వర్యంలో 6 టీంలను రంగంలోకి దించారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం సింగరాయకొండ బైపాస్ వద్ద ఈశ్వర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీపై నింద వేసేందుకు ఒత్తిడి ఇందులో వ్యక్తిగత కక్షలు తప్ప రాజకీయ నేపథ్యం లేదు. అయితే ఈ ఘటనకు వైఎస్సార్సీపీయే కారణం అని ఫిర్యాదు చేయాలంటూ శేషగిరిరావుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి ఈశ్వరరెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడు కాదు. ఆయనకు టీడీపీ నాయకులతో సంబంధాలున్నాయి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వివాదంగా చిత్రీకరించాలని చూడడంపై స్థానికులు విస్మయం చెందారు. -
హ్యాట్సాఫ్.. ఏపీ పోలీసులు
సింగరాయకొండ : ఏపీ–తమిళనాడు సరిహద్దులోని ఆ ఊరు నేర సామ్రాజ్యానికి అడ్డా.. అది పోలీసులు కూడా ఛేదించలేకపోయిన ఘరానా దొంగల గడ్డ.. అలాంటి చోటుకు మన ఏపీ పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో ప్రాణాలకు తెగించి వెళ్లారు. వెళ్లడమే కాదు.. పద్మవ్యూహంలాంటి ఆ చోర సామ్రాజ్యం నుంచి కరడుగట్టిన ముగ్గురు దొంగల్ని పట్టుకున్నారు. ఇది పసిగట్టిన అక్కడి దొంగల ముఠా సభ్యులు పోలీసులను వెంబడించారు. ఈ ఛేజింగ్‌లో మన పోలీసుల చాకచక్యంతో పైచేయి సాధించి ముగ్గురు నేరస్తుల్ని పట్టుకొచ్చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌ని తలపించిన ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలు, సింగరాయకొండలో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు ఘరానా దొంగలను తమిళనాడులోని మింజూరులో ప్రకాశం జిల్లా పోలీసులు వలపన్ని సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెల 11న ప్రకాశం జిల్లా ఒంగోలు టీచర్స్ కాలనీకి చెందిన పోతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంట్లో 60 సవర్ల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ నెల 12వ తేదీన సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడులో ముమ్మడిశెట్టి చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఎస్పీ మల్లికాగర్గ్ ఆదేశాల మేరకు డీఎస్పీ నారాయణస్వామి పర్యవేక్షణలో సింగరాయకొండ సీఐ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజీలు ఆధారంగా ఒంగోలు టీచర్స్ కాలనీ, సింగరాయకొండలో చోరీలకు పాల్పడిన ముఠా ఒకటేనని నిర్థారణకు వచ్చారు. ఇదే ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ గతంలో దోపిడీలకు పాల్పడినట్టు గుర్తించారు. నేర సామ్రాజ్యంలోకి వెళ్లి మరీ అరెస్ట్? ఈ ముఠా తమిళనాడులోని మింజూరు ప్రాంతానికి చెందినదని గుర్తించిన పోలీసు బృందాలు నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు పథకం పన్నారు. మింజూరు ప్రాంతం నేర సామ్రాజ్యానికి అడ్డా కావడం.. గతంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు పోలీసులపై విరుచుకుపడటం వంటి పరిస్థితులు తలెత్తాయి. గతంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించి తమవల్ల కాక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలోని పోలీస్ టీమ్ దొంగలను అదుపులోకి తీసుకునేందుకు రెండు కార్లలో పక్కా ప్రణాళికతో వెళ్లారు. మింజూరు స్టేషన్ మహిళా ఎస్సై సహకారంతో దొంగల కోసం రోజంతా అక్కడ మాటు వేశారు. చివరకు శనివారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపైనే దాడికి యత్నం చోరీ సొత్తును రికవరీ చేసే క్రమంలో ఆంధ్రా నుంచి పోలీసులు వచ్చారని తెలుసుకున్న దొంగల ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులపై మూకుమ్మడి దాడికి యత్నించినట్టు సమాచారం. అప్పటికే కొంత సొత్తును రికవరీ చేసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని వెంటనే తాము వచ్చిన వాహనాల్లోనే తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు మరో రెండు కార్లులో పోలీసుల్ని వెంబడించినట్టు తెలిసింది. ఆ తరువాత పోలీసుల వాహనాలు హైవేపైకి రావడంతో ముఠా తరఫు వ్యక్తులు వెనుదిరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అలల సాగరంపై బతుకు విన్యాసం.. కడలి పుత్రుల జీవనం విలక్షణం
కడలే వారికి అమ్మ ఒడి. అలల సవ్వడులు వారికి జోలపాట. సాగరంలో వేటే జీవనంగా సాగుతున్న మత్స్యకారుల జీవనశైలి అంతా విభిన్నం. ఇల్లు వదిలి సముద్రంలోకి వెళ్లి.. తిరిగొచ్చే వరకు అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ నిత్యం ఆటుపోటుల మధ్య సాగే వీరి జీవనం ఓ సమరం. గంగమ్మ చెంత మత్స్యకారుల దిన చర్య అర్ధరాత్రి నుంచే ఆరంభమవుతుంది. నడి సంద్రం సాక్షిగా వీరు సాగించే జీవన తెరను ఒక్కసారి తెరిస్తే ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తాయి. వీరు వినియోగించే వల దగ్గర నుంచి సాగరంలో సాగించే వేట వరకూ అన్నీ విభిన్నం..విలక్షణమే.. ఇంకెందుకాలస్యం సముద్ర తీరానికి పోదాంపదండి... సింగరాయకొండ మండలం పాకల సముద్రతీరం. ఇక్కడ చిన్నా..పెద్దా, ఆడ..మగా అనే తేడా లేకుండా అందరూ వేట పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంత మంది తెల్లవారుజామునే వేటకు వెళితే.. మరికొంత మంది రేపటి కోసం వలలను సిద్ధం చేస్తూ కనిపించారు. మరికొందరు పడవలను శుభ్రం చేస్తున్నారు. వేటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగొచ్చిన విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు భోజనాలతో తీరానికి వస్తారు. అక్కడే అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ఇక్కడ జీవనం సాగిస్తున్న గంగపుత్రులను పలకరిస్తే వారి బతుకుల్లో విలక్షణత కనిపించింది. కడలిలో వందల కిలోమీటర్లు రోజుల తరబడి వీరు చేస్తున్న సాహసం తెలుస్తుంది. చేపల వేటే జీవనంగా మార్చుకున్న గంగపుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి కడలిని సునాయాసంగా ఈదే మత్స్యకారుల బతుకు ప్రకృతి విపత్తుల మధ్య పెనుసవాలే.. అంతా విలక్షణం... అందరిదీ ఒక్కటే మాట..బాట. ఒక్క మాటలో చెప్పాలంటే.. పెద్దకాపు తీసుకున్న నిర్ణయమే శాసనం. తప్పొప్పులు జరిగితే.. పరిష్కరించేందుకు వీరు పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కేది ఉండదు. కట్టుబాటును ఎవరూ ధిక్కరించరు. పెద్ద కాపు, నడింకాపు, చిన్నకాపు.. ఇలా ఊరిలో ముగ్గురిని గ్రామ పెద్దలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. వీరు చెప్పిందే ఆ ఊరందరికీ వేదం. చేసిన తప్పులకు వీరు వేసే శిక్ష వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ఊరంతా అనుసరించాల్సిందే. వల..వలకూ ప్రత్యేకమే... మత్స్య సంపదను వేటాడటానికి రకరకాల వలలు వినియోగిస్తారు. చేపలు, రొయ్యలు, పీతలు ఒక్కొక్కదానికి ఒక్కో వలను వేటకు వాడతారు. ఏ వల కొనుగోలు చేయాలన్నా రూ.లక్షల్లోనే మరి. వేట సరిగ్గా సాగితే అది పెద్దలెక్కలోదేమీ కాదు. సంప్రదాయ మత్స్యకారులు వాడే వలలు పులసల వల, నరంవల, బాడీవల, సన్నకన్నుల వల, ఐలావల, రింగుల వల, కొనాము వల. వీటిల్లో అత్యంత ఖరీదైంది ‘ఐలా వల’. దీని ఖరీదు దాదాపు రూ.రెండు లక్షలు ఉంటుంది. అంటే ఒక్కో వల అతి తక్కువ పొడవు అంటే ఒక కిలో మీటరు. ఇక పొడవు పెరిగే కొద్దీ ధర పెరుగుతూ ఉంటుంది. దీనితో సముద్రం ఒడ్డున ఉండి మరీ వేట సాగిస్తారు. ఈ వలను సముద్రంలో రెండుమూడు పడవల్లో వేసుకుని ఎంత పొడవు ఉంటే అంత దూరంలో సముద్రంలో వదులుకుంటూ వెళ్తారు. ఒడ్డున ఉండి మత్స్యకారులు ఒక చివర పట్టుకుని ఉంటే.. రెండో చివర మరో పక్కన ఒడ్డునే ఉండి మరికొంతమంది మత్స్యకారులు పట్టుకుంటారు. సముద్రంలో వదిలిన వలను రెండు అంచులు పట్టుకుని లాగుతారు. ఐలా, రింగుల, కొనాము వలను లాగడానికి దాదాపు 50 మందికిపైగా మత్స్యకారులు కావాలి. కాకినాడ నుంచి ప్రత్యేకంగా మత్స్యకారులను తీసుకొచ్చి వేటకు వెళ్తారు. సుదూర ప్రాంతం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ వలల యజమానికి అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. మత్స్య సంపద పడితే ఊపిరి పీల్చుకుంటాడు. లేకుంటే మళ్లీ రెండో ప్రయత్నమే మరి. పీతలు, చిన్నచేపలు, రొయ్యల కోసం ముందు రోజు లంగరు వేసి తర్వాత రోజు ఉదయాన్నే సముద్రంలోకి వెళ్లి మత్స్యసంపద తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన మత్స్య సంపదను ఊర్లో ఉన్న వ్యాపారులకు ఇస్తారు. వారు సరుకును బట్టి ప్రత్యేక వాహనాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఒడిస్సా పంపిస్తుంటారు. పడవలోనే వంటా వార్పూ... సుదూర ప్రాంతాలకు వేట కోసం వెళ్లేవారు ముందుగానే పడవలో వంట సరుకులు తీసుకువెళ్తారు. అందులోనే వంటా వార్పూ. తమ వెంట తీసుకెళ్లిన పప్పులు, కూరగాయలతోనే కాకుండా సముద్రంలో లభించే చేపలు, రొయ్యలను సైతం వండుకుని తింటారు. అంతేకాదు వీరికి ప్రత్యేక భాష ఉంటుంది. తమిళం కలిపి వీరు మాట్లాడుతుంటారు. ఎంతో మార్పు... రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మత్స్యకారుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. వేట విరామ సమయంలో గత ప్రభుత్వాలు అరకొరగా.. అదీ ఏడాదికి రూ.4 వేలు ఆర్థిక సాయం, 20 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేవి. ప్రస్తుతం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వేట బోట్లకు డీజిల్ సబ్సిడీని గణనీయంగా పెంచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షల పరిహారం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా రూ.3.30 లక్షల విలువైన బోటు, మోటార్లు, వలలు రాయితీపై అందిస్తోంది. మెకనైజ్డ్ బోట్ల పంపిణీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న అమ్మఒడితో పిల్లలు చదువుకు వెళ్తున్నారు. విరామ సమయంలో... వేట విరామ సమయంలో కూడా మత్స్యకారులు అందుబాటులో ఉన్న ఆక్వా కల్చర్‌కు, వ్యవసాయ, ఉపాధి పనుల్లో కూలీలుగా వెళ్తారు. మరికొందరు రొయ్యల చెరువుల్లో రొయ్యలు పట్టడం, ప్యాకింగ్ చేయడం, ఇతరత్రా పనులకు వెళ్తారు. ఆయా పనులు దొరకని పక్షంలో ఆటలతో కాలక్షేపం చేస్తుంటారు. చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ ఉదయం ఆరు గంటలకు చేపల వేటకు బోటులో ఇద్దరం వెళ్లాం. ప్రస్తుతం పీతలు మాత్రమే పడ్డాయి. పీతలు పెద్దసైజు అయితే కేజీ రూ.150 ఉండగా, చిన్న సైజు కేజీ రూ.60 మాత్రమే. పీతలు పడితే చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ. – అల్లారి లక్ష్మణ్, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల శాపంగా తమిళనాడు బోట్లు... చేపల వేట ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. సముద్రంలో చాలా దూరం వెళ్లి వలలు వేస్తేనే చేపలు లభిస్తున్నాయి. ఈలోగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కడలూరు జాలర్లు సోనా బోట్లతో నిబంధనలు అతిక్రమించి తీరానికి సమీపంలో చేపల వేట చేయడంతో లక్షలాది రూపాయల విలువ గల వలలు ధ్వంసమై తీవ్రంగా నష్టపోతున్నాం. చెన్నై బోట్లు తీరంలో వేటాడకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి. – ప్రళయ కావేరి రోశయ్య, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల రోజూ రూ.200 సంపాదన ఇంటింటికి తిరిగి చేపలు అమ్ముకుంటూ జీవిస్తాను. చేపల వేట సాగించి తీరానికి వచ్చిన బోట్ల మత్స్యకారులకు బఠానీలు వంటి తినుబండారాలు ఇచ్చి వారి వద్ద నుంచి చేపలు తీసుకెళ్లి అమ్ముకుంటాను. రోజుకు 150 నుంచి 200 రూపాయలు సంపాదిస్తాను. నాకు వృద్ధాప్య పింఛన్ రూ.2,750 వస్తుంది. – వాటిపల్లి పోలేరమ్మ, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల చదవండి: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు.. -
త్వరలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు పూర్తి
సింగరాయకొండ: వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ల నిర్మాణాలను త్వరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ వద్ద, బాపట్ల జిల్లాలోని కొరిశపాడు–రేణంగివరం మధ్యలో ఏర్పాటు చేసిన విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్లను జాతీయ రహదారి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. సింగరాయకొండ వద్ద పరిశీలన సందర్భంగా మాగుంట మాట్లాడుతూ విమానాల ల్యాండింగ్ ప్రాజెక్టులు దేశంలో 13 మంజూరు కాగా, వాటిలో ప్రకాశం జిల్లా పరిధిలో ఒకటి, బాపట్ల జిల్లా పరిధిలో మరొకటి ఉన్నాయని, ప్రస్తుతం ఈ రెండూ చివరి దశలో ఉన్నాయన్నారు. సింగరాయకొండ వద్ద గల ప్రాజెక్టుకు అదనంగా 8.50 ఎకరాల స్థల సేకరణ చేయాల్సి ఉందని, అదనంగా సిమెంటు రోడ్లు నిర్మించాల్సి ఉందని ఎంపీ మాగుంట తెలిపారు. అందుకు రూ.40 కోట్ల అదనపు బడ్జెట్ అవసరమన్నారు. నిధుల మంజూరుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్టు చెప్పారు. ప్రధాని కార్యాలయం నుంచి అందిన ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టేందుకు ఎయిర్‌ఫోర్స్, జాతీయ రహదారి అధికారులు, పైలెట్లు వచ్చినట్టు తెలిపారు. సింగరాయకొండ ప్రాజెక్టు నిర్మాణంలో మలుపులుండటంతో ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, అయితే ఈ ప్రాజెక్టు వెనక్కి పోకుండా పూర్తి చేసేందుకు జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ కొన్ని సూచనలు చేశారని, అందుకు ఎయిర్‌ఫోర్స్ అథారిటీ అధికారులు కూడా ఆమోదం తెలిపారని మాగుంట వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ అథారిటీకి చెందిన వీఎం రెడ్డి, అశోక్‌బాబు, ఆర్ఎస్ చౌదరి, వినోద్‌వాన్యా, ఆదిత్యదేశ్, జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ గోవర్దన్, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
భువనగిరిలో కిడ్నాప్.. సింగరాయకొండలో పట్టివేత
సింగరాయకొండ: తెలంగాణలోని భువనగిరిలో కిడ్నాప్ అయిన బాలుడు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పొనుగోటివారిపాలేనికి చెందిన గద్దాల మహేష్ తెలంగాణలోని జనగాం మండలం భువనగిరి పట్టణానికి బేల్దారి పని కోసం వెళ్లాడు. 10 రోజుల క్రితం మహేష్ స్వగ్రామానికి వచ్చేప్పుడు మూడేళ్ల బాలుడిని వెంట తీసుకొచ్చాడు. బుధవారం మహేష్ బాలుడిని తన తమ్ముడు రమేష్ వద్ద వదిలి ఊరికి వెళ్లటానికి ప్రయత్నించగా.. అందుకు రమేష్ నిరాకరించడంతో వీరిద్దరి మధ్య వాదులాట జరిగింది. దీంతో అసలు విషయం బయటపడింది. మహేష్ తను పనిచేస్తున్న చోట బాలుడిని కిడ్నాప్ చేసి కొద్ది రోజుల తరువాత స్వగ్రామానికి తీసుకుని వచ్చాడని పోలీసులు తెలిపారు. -
రూ.1,513 కోట్లతో ఎన్‌హెచ్ 167బి
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌లో మరో ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. వైఎస్సార్ జిల్లాను చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ ‘ఎన్‌హెచ్–167బి’ ని రెండు లేన్లు + పావ్డ్ సోల్డర్స్ (12 అడుగుల వెడల్పు)గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం మైదుకూరు నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు సమర్పించిన నివేదికలో ఈ రహదారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. 189 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు ప్యాకేజీల కింద మొత్తం రూ.1,513.31 కోట్లతో నిర్మించేందుకు ఆమోదించారు. దీన్లో మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు 46 కిలోమీటర్ల రహదారికి రూ.369.81 కోట్లతో పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. మిగిలిన రూ.1,143.5 కోట్ల పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ పూర్తికావచ్చింది. -
రహదారిపై ఎయిర్ స్ట్రిప్‌లు
సింగరాయకొండ/అద్దంకి: ఎయిర్ పోర్టులు లేనిచోట్ల విమానాల ల్యాండింగ్ కోసం జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో రన్‌వే (ఎయిర్ స్ట్రిప్)లను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా 13 చోట్ల వీటిని నిర్మించనుండగా.. మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో రెండుచోట్ల నిర్మిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు–రేణింగవరం వద్ద ఒకటి, సింగరాయకొండలోని కలికివాయ–సింగరాయకొండ అండర్ పాస్ వరకు మరొకటి ఏర్పాటవుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా.. ► జాతీయ రహదారిలో ఈ రన్‌వేలపై విమానాలు దిగే సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేపడతారు. సిమెంట్‌తో నిర్మించే రన్‌వేకు రెండు వైపులా రెండు గేట్లు ఉంటాయి. ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ► కొరిశపాడు–రేణింగవరం వరకు రూ.23.77 కోట్లతో 5 కి.మీ. పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒకేసారి 4 విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తున్నారు. ► కలికివాయ–సింగరాయకొండ మధ్య విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రూ.52 కోట్లతో 3.60 కిలోమీటర్ల మేర ఎయిర్ స్ట్రిప్ నిర్మించనున్నారు. 33 మీటర్ల వెడల్పున కాంక్రీట్‌తో రన్‌వే, రెండువైపులా 12.50 మీటర్ల వెడల్పున గ్రావెల్ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా మీటరు వెడల్పున డ్రైనేజీ నిర్మాణం చేపడతారు. రన్‌వేకు 150 మీటర్ల దూరంలో ఏటీసీ భవనం నిర్మిస్తారు. ప్రస్తుతం రన్‌వేకు సంబంధించి కాంక్రీట్ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఇరువైపులా డ్రైనేజీ, గ్రావెల్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. ► కందుకూరు ఫ్లైఓవర్ వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తి కాగా, కలికవాయ ఫ్లైఓవర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ దశలో ఉంది. -
ఇద్దరి ప్రాణాలు తీసిన సరదా..
సింగరాయకొండ: సముద్రస్నానం సరదా ఇద్దరి ఉసురు తీసింది. ఈ ఘటనతో వినాయకచవితి పండుగ రోజు ఓ పెళ్లింట విషాదం నిండింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో శుక్రవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపూడి మండలం చిమట గ్రామంలో గురువారం మోయిడి మాధవ కూతురు వివాహం జరిగింది. ఆ వివాహానికి చీమకుర్తి మండలం చిన్నరాగిపాడు గ్రామానికి చెందిన అబ్బాయి తరఫు వారు హాజరయ్యారు. పెళ్లి తర్వాత రోజు వినాయక చవితి పండుగ కావడంతో పూజ ముగించుకుని సరదాగా సమీపంలోని పాకల బీచ్‌కు బైకులపై ఆరుగురు కలిసి వెళ్లారు. మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన పెళ్లికుమార్తె అన్న మోయిడి శాంతిరాజు (20), మోయిడి కోటేష్, కొమ్ము లాజర్, కొమ్ము పాల్, చీమకుర్తి మండలం చిన్నరాగిపాడు గ్రామానికి చెందిన జెన్నిపోగు తేజ (18), జెన్నిపోగు యాప్రాయం సముద్రంలోకి దిగారు. అలల తాకిడి తక్కువగా ఉండడంతో కాస్త లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో శాంతిరాజు, తేజ, యాప్రాయం సముద్రంలో గల్లంతయ్యారు. గమనించిన మిగతా యువకులు పెద్దగా కేకలు వేయడంతో ఒడ్డున ఉన్న మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేశారు. శాంతిరాజు, యాప్రాయంను ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స చేశారు. చికిత్స చేస్తుండగానే శాంతిరాజు ప్రాణాలొదిలాడు. యాప్రాయం మాత్రం స్పృహలోకి వచ్చి తేరుకున్నాడు. తేజ మృతదేహం కొద్దిసేపటికి అలలపై తేలుతూ కనిపించడంతో ఒడ్డుకు చేర్చారు. మృతుల్లో శాంతిరాజు పెళ్లికూతురు అన్న. అప్పటివరకు సరదాగా ఉన్న పెళ్లి ఇంట రోదనలు మిన్నంటాయి. సింగరాయకొండ సీఐ మర్రి లక్ష్మణ్ పాకల బీచ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ ఎల్.సంపత్‌కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి బొమ్మ ధ్వంసం అవాస్తవం
ఒంగోలు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారంపై ఉన్న స్వామి, అమ్మవారి బొమ్మలు ధ్వంసం చేశారనేది అవాస్తవమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు మీడియా ప్రతినిధులు సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ బి.రవిచంద్ర బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ బొమ్మలను ఎవరో ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కుట్ర పూరితంగా ప్రచారం జరిగింది. కొన్ని టీవీ చానళ్లలో కూడా ఈ మేరకు వార్త ప్రసారమైంది. అయితే వాస్తవం ఇందుకు విరుద్దంగా ఉంది. 20 ఏళ్ల క్రితం నిర్మించిన సిమెంట్ ఆర్చిపై లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారి బొమ్మలను సిమెంట్‌తో ఏర్పాటు చేశారు. అవి పాతబడటంతో అప్పుడప్పుడు పెచ్చులూడిపోతుండేవి. ఏటా మరమ్మతులు చేసి రంగులు వేసేవారు. రెండేళ్లుగా ఈ ఆర్చి మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో అమ్మవారి బొమ్మ కుడి చేయి విరిగిపోయింది. స్వామి వారి బొమ్మకు పెచ్చులూడాయి. నవంబర్ 10న టీవీ9లో ప్రసారమైన డాక్యుమెంటరీలో సిమెంట్‌తో చేసిన దేవుని విగ్రహాలకు పెచ్చులు ఊడి ఉన్నాయని ప్రసారమైంది. అయితే ఈ విషయం ఇతర మీడియా ప్రతినిధులందరికీ తెలిసి కూడా తప్పుడు ప్రసారం చేసి, తప్పుడు వార్తలు రాసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని పోలీసులు నిగ్గు తేల్చారు. ఆలయ ఈవో భైరాగి కూడా తన ఫిర్యాదులో ఇదే విషయం చెప్పారు. నిందితుల అరెస్ట్ ► అంబటి శివకుమార్ (బహుజన మీడియా), సాగి శ్రీనివాసరావు (ధర్మవ్యూహం న్యూస్ పేపర్), పోకూరి కిరణ్ (ఏబీఎన్ ఆంధ్రజ్యోతి), షేక్ భాషా (ఎన్టీవి రిపోర్టర్), కాట్రగడ్డ రామమోహన్ (హెచ్ఎం టీవీ రిపోర్టర్), మద్దసాని మౌలాలి (లారీ డ్రైవర్)లను అరెస్ట్ చేశారు. ► ఏబీఎన్, టీవీ 5, ఈటీవీ ప్రతినిధులు, యూట్యూబ్ చానల్స్‌కు సంబంధించిన మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. వీరందరిపై 120బి (కుట్రపూరితంగా నేరానికి పాల్పడడం), 153ఎ (రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం), 295ఎ (మత విద్వేషాలను రెచ్చ గొట్టేల వ్యవహరించడం), 504 (ప్రజాశాంతికి భంగం కలిగించడం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
ఎంత ఎదిగినా.. ఒదిగే ఉంటారు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామంలో ఓ ఆచారం కొనసాగుతోంది. గతంలో ఉన్న పూరి గుడిసెల స్థానంలో ఊరంతా పక్కా ఇళ్లు వెలిసినా.. ఏ ఒక్కరూ మొదటి అంతస్తు (ఫస్ట్ ఫ్లోర్) నిర్మించరు. దేవుడి పాదాల కంటే తమ ఇళ్లు తక్కువ ఎత్తులో ఉంటే శుభకరమని అక్కడి వారి విశ్వాసం. ఆ గ్రామంలో చారిత్రక శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఏటా నిర్వహించే తిరునాళ్లలో గ్రామస్తులే మోత కాపులుగా ఉంటూ.. స్వామి వారి సేవల్లో పాల్గొంటారు. తమ కుల దైవమైన వరాహ లక్ష్మీనరసింహస్వామిపై భక్తితో ఎన్నో సంవత్సరాలుగా అంతా పాటిస్తున్నారు. గతంలో అన్నీ పూరి గుడిసెలే.. ఈ గ్రామంలో సుమారు 30 సంవత్సరాల క్రితం బ్రాహ్మణ కాలనీలో పక్కా భవనాలు ఉండగా.. మిగిలిన అన్నిచోట్లా పూరి గుడిసెలే ఉండేవి. క్రమంగా గ్రామస్తులంతా ఆర్థికంగా బలపడ్డారు. పూరి గుడిసెలన్నీ పక్కా గృహాలుగా మారాయి. ఎటు చూసినా పక్కా ఇళ్లే. వాస్తవానికి ఇక్కడి వారందరికీ 2, 3 అంతస్తుల భవనాలు నిర్మించుకునే స్తోమత ఉన్నా.. ఒక్కరు కూడా ఆలయంలోని స్వామి పాదాల కన్నా తక్కువ ఎత్తులోనే భవనాలు నిర్మించుకునే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. గ్రామంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మొదటి అంతస్తు గల భవనం పాఠశాల ఒక్కటే.. గ్రామంలో మొదటి అంతస్తు గల భవనం పాఠశాల ఒక్కటే. పాఠశాల భవనంపై మొదటి అంతస్తు నిర్మించగా.. ఆ కాంట్రాక్టర్ ఇంట్లో ఒకరు మరణించారని గ్రామస్తులు చెబుతుంటారు. ఇటీవల సచివాలయ భవనం మంజూరైనప్పటికీ ప్రధాన గ్రామంలో కాకుండా శివారు గ్రామమైన అయ్యప్ప నగర్లో నిర్మాణం చేపట్టారు. రెండు తరాలుగా ఇదే ఆచారం వరాహ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ సమీపంలో ఉన్న ప్రధాన గ్రామంలో రెండు తరాలుగా ఒకే అంతస్తు నిర్మిస్తున్నారు. స్వామి వారి పాదాల కన్నా ఇళ్లు ఎత్తు ఉండకూడదన్నదే ఇందుకు కారణం. – చిమట శ్రీను, పాత సింగరాయకొండ నమ్మకం ప్రకారమే నడుచుకుంటారు ఆలయంలో వంశపారంపర్య అర్చకుడిగా పని చేస్తున్నాను. ఇక్కడి వారంతా స్వామి పాదాల కింద ఉంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. వారి నమ్మకం ప్రకారం అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందారు. – ఉదయగిరి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు అది మా నమ్మకం.. ఆచారం స్వామి పాదాలకు దిగువన ఉంటే మేలు జరుగుతుందన్న నమ్మకంతో ఆ ఆచారాన్నే కొనసాగిస్తున్నాం. మా నమ్మకం వమ్ము కాలేదు. – లక్ష్మీనరసింహం, గ్రామస్తుడు -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
-
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
సాక్షి, ప్రకాశం : జిల్లాలోని సింగరాయకొండ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీవీఆర్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు బెంగుళూరు నుంచి గుంటూరు జిల్లా పొన్నూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘ఖైదీ’ సినిమా తరహా చోరీ
సాక్షి, గుడ్లూరు: జాతీయ రహదారిపై సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను దుండగులు హైజాక్ చేశారు. కంటైనర్‌కు వాహనాలు అడ్డు పెట్టి వాటిల్లో ఉన్న దుండగలు కంటైనర్ డ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆయన కాళ్లు, చేతులు కట్టేసి చెడ్లలో పడేసి కంటైనర్‌తో వెళ్లిపోయారు. సినీ పక్కీలో సంచలనం రేపిన ఈ సంఘటన ప్రకాశం జిల్లా 16వ నంబర్ జాతీయ రహదారిపై తెట్టు–శాంతినగర్ గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి విజయవాడకు సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ శాంతినగర్–తెట్టు గ్రామాల మధ్యలోకి వచ్చే సరికి కారులో వచ్చిన దొంగలు కంటైనర్‌కు తమ కారును అడ్డు పెట్టారు. డ్రైవర్ రవి కంటైనర్‌ను ఆపేశాడు. కంటైనర్‌లోకి ఎక్కిన దుండగులు డ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచి బట్టలు విప్పదీసి కాళ్లు, చేతులు గుడ్డ పేలికలతో కట్టేసి కళ్లకు గంతలు చుట్టారు. అనంతరం అతడిని రహదారి పక్కన ఉన్న చెట్లల్లో పడేసి కంటైనర్‌ను అపహరించుకెళ్లారు. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో డ్రైవర్ పెద్దగా కేకలు వేస్తుండటంతో శాంతినగర్ గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి చెట్ల కింద పడి ఉన్న డ్రైవర్ రవిని చూసి హైవే పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న హైవే సిబ్బంది డ్రైవర్‌కు కట్టిన కట్లు విప్పదీసి 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సమచారం అందుకున్న కందుకూరు డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్వంలో గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు ఎస్ఐలు కంటైనర్ చోరీకి గురైన సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. చికిత్స పొందిన అనంతరం డ్రైవర్‌ను తెట్టు తీసుకొచ్చి విచారించారు. తెట్టు జంక్షన్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీని పక్కనే ఉన్న మార్కెట్ కార్యాలయం కంప్యూటర్లో పరిశీలించారు. కంటైనర్ సింగరాయకొండ వద్ద ఉన్న ఫెరల్ డిస్టిలరీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉందని సమాచారం రావడంతో విచారణ కోసం అక్కడికి వెళ్లారు. కంటైనర్‌ను హైజాక్ చేయడంలో సుమారు 20 మంది దుండగులు పాల్గొని ఉంటారని సమాచారం. బీహార్ గ్యాంగ్ పనేనా? బీహార్ రాష్ట్రానికి చెందిన పారంగి ముఠా సభ్యులు ఈ కేసులో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీ జరిగిన విధానం ఆధారంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. వీరు క్రూరులని, చోరీ సమయంలో డ్రైవర్‌ను కచ్చితంగా చంపుతారని, ఇక్కడ ఉన్న నిందితుల్లో డ్రైవర్‌ను ఒకరు చంపుదామంటే మరొకరు చంపొద్దని వారించారని, చివరకు డ్రైవర్‌ను కట్టేసి కళ్లకు గంతలు చుట్టి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ కేసుకు పారంగి ముఠాతో సంబంధం ఉందా..లేదా అన్నది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా తరహా చోరీ కంటైనర్ చోరీ తీరు ఇటీవల తమిళ నటుడు కార్తీ నటించిన ఖైదీ సినిమా తరహాలో ఉందని పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి చోరీకి గురైన కంటైనర్‌ను మాత్రం పోలీసులు గుర్తించగలిగారు. అందులోని సిగరెట్ బాక్స్‌లను మాత్రం ప్రస్తుతానికి గుర్తించలేకపోయారు. ఐటీసీ కంపెనీకి చెందిన సిగిరెట్ల కంటైనర్ బెంగళూరు నుంచి ఈ నెల 23వ తేదీ రాత్రి పది గంటలకు విజయవాడలోని గూడవల్లి గోల్డెన్ రాయల్ వేర్ హౌసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బయల్దేరింది. కంటైనర్ తెట్టు సమీపంలోని శాంతినగర్ వద్దకు రాగానే సుమారు 10 మంది దుండగులు కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న మూడు లారీల్లో వచ్చి కంటైనర్ వెళ్లేందుకు వీల్లేకుండా ముందు, వెనుక లారీలు ఆపారు. ఆ తర్వాత కంటైనర్ డ్రైవర్ బి.రవిపై దాడి చేసి గాయపరిచి కంటైనర్‌తో పరారయ్యారు. సింగరాయకొండ ఎస్ఐ మేడా శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో శనివారం వేకువ జామున 2.30 గంటల సమయంలో పెరల్ డిస్టిలరీ కంపెనీ వద్ద కంటైనర్‌ను హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఆ సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. అయితే అప్పటికే కంటైనర్‌లో 531 సిగిరెట్ పెట్టెలు ఉండాల్సి ఉండగా కేవలం 125 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. చోరీ సొత్తు విలువ సుమారు 3.50 కోట్ల రూపాయలుగా పోలీసులు పేర్కొంటున్నారు. మిస్టరీగా కంటైనర్ చోరీ ఘటన.. కంటైనర్ చోరీ ఘటన మిస్టరీగా మారింది. చోరీ జరిగిన తీరు గమనిస్తుంటే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కంటైనర్‌కు జీపీఆర్ఎస్ సిస్టం ఉంది. దీని ప్రకారం కంటైనర్ ఎక్కడ ఉందో వెంటనే గుర్తించవచ్చు. కంటైనర్‌ను దుండగులు సింగరాయకొండ పట్టణం నుంచి పాకల రోడ్డు వరకు తీసుకొచ్చి మళ్లీ కావలి వైపు బయల్దేరి చివరకు పెరల్ డిస్టిలరీ కంపెనీ వద్ద వదిలి వెళ్లిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జీపీఆర్ఎస్ విధానం ద్వారా కంటైనర్‌ను గుర్తించి వెళ్లేలోపు దుండగులు కంటైనర్‌ను ఫ్యాక్టరీ వద్ద వదిలి వేరే వాహనంలో కావలి వైపు పరారయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కంటైనర్ చోరీకి గురైన సమాచారం రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుబంధ సంస్థ స్టెల్లార్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధికి సుమారు రాత్రి 11 గంటలకు అందింది. అంతేగాక కంటైనర్ సింగరాయకొండ వద్దే చోరీకి గురైందని వారికి పక్కా సమాచారం అందింది. -
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యయత్నం
-
పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని..
సాక్షి, ప్రకాశం: పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని తన్నీరు నాగరాజుగా గుర్తించారు. ఓ కేసు విషయంలో ఏఎస్ఐ మురళీ కృష్ణ తనను వేధిస్తుండటంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు నాగరాజు వెల్లడించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 14వ తేదిన నాగరాజుకు, అతని బాబాయికి మధ్య గొడవ జరిగింది. 16న పోలీసులు వీరిద్దరి మీద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగానే.. బాబాయి తనపై జాలమ్మ గుడి వద్ద హత్యాయత్నం చేసినట్లు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఏఎస్ఐ మురళీ కృష్ణ తన ఫిర్యాదును పట్టించుకోకుండా.. తననే వేధింపులకు గురి చేస్తున్నాడని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు కూడా డిమాండ్ చేయటంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించాడు. -
ఉపాధినిచ్చే వల ఊపిరి తీసింది
కడలి కెరటాలతో సయ్యాటలాడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఒడుపుగా వల విసరడంలో అతడు నేర్పరి. నిత్యం అలవోకగా చేసే పనే అయినా.. విధి వక్రీకరించింది.. తనకు ఉపాధి చూపే వలే మృత్యువులా చుట్టుకొని జల సమాధి చేసింది. చేపల వేటే జీవనాధారంగా కుటుంబాన్ని పోషిస్తున్న ఆ మత్స్యకారుడిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): చేపల వేటకు వల విసురుతున్న మత్స్యకారుడు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన మంగళవారం సింగరాయకొండ మండలం పాకల పంచాయతీలో పోతయ్యగారి పట్టపుపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పోతయ్య గారి పట్టపుపాలేనికి చెందిన వాయిల పోలయ్య(47) మంగళవారం సముద్రంలో చేపలు వేటాడేందుకు వల తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్లాడు. వలను వేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అలల తాకిడికి పోలయ్య వలతో పాటు సముద్రంలో తిరగబడ్డాడు. వల అతనిని చుట్టుకోవటంతో తనను తాను రక్షించుకోలేక నీట మునిగాడు. ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. మృతుడికి ఇతనికి భార్య, నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. పేదరికంలో ఉన్న పోలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని మత్యకార నాయకులు కొందరు వైఎస్సార్సీపీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్యను వేడుకున్నారు. పోలయ్య కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం వచ్చేందుకు కృషి చేస్తానని వెంకయ్య వారికి హామీ ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పులి రాజేష్ తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
‘దమ్మున్న మగాడు వైఎస్ జగన్’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన దరిద్రం పోవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలోభాగంగా సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకులా చూస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మగౌరవం పెరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీసీలను చదువుకునేలా చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే.. అదే బీసీలను తలెత్తుకోనేలా చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్ దమ్మున్న మగాడు మాట ఇస్తే తప్పడు అని ప్రశంసించారు. ‘ఆంధ్రకి దరిద్రం చంద్రబాబు. ఈ దరిద్రం పారిపోవాలి అంటే సీలింగ్ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి. బీసీల మద్దతు వైఎస్సార్సీపీకే. చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించాల’ని కృష్ణయ్య పిలుపునిచ్చారు. చేపలు కూడా తిట్టుకుంటాయి చంద్రబాబు కరువును తోడు తెచ్చుకొంటారని, ఆయన వస్తే వానలు రావని ఎద్దేవా చేశారు. చెరువులో చేపలు కూడా చంద్రబాబును తిట్టుకుంటాయని వ్యంగ్యంగా అన్నారు. ‘బీసీలను అణగతొక్కడమే చంద్రబాబు పని. బీసీల సమావేశానికి కూడా ఎమ్మెల్యేలను వెళ్ళొద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారు. బీసీ జడ్జిలను హైకోర్టు న్యాయమూర్తిలు కాకుండా అడ్డుకున్నారు. నన్ను బలవంతంగా రాజకీయాల్లోకి లాక్కొచ్చి మోసంచేసారు. చంద్రబాబు పచ్చి బీసీల వ్యతిరేకి’ అని త్రీవస్థాయిలో కృష్ణయ్య మండిపడ్డారు. -
సమస్యలు ఫుల్.. సౌకర్యాలు నిల్
సాక్షి, సింగరాయకొండ(ప్రకాశం): అభివృద్ధి అనేది ఆ కాలనీలో బూతద్దం వేసి వెతికినా కనిపించదు. నాలుగు తాటాకులతో వేసిన చిన్న చిన్న పూరి గుడిసెలు, ఏళ్ల తరబడి పూడుపోయిన మురుగు కాలువలు, మంచినీటి కోసం కిలోమీటర్ దూరం ప్రయాణం..ఇదీ ఊళ్లపాలెం ఎస్టీ కాలనీ దుస్థితి. ఏళ్ల తరబడి కనీస వసతులు కరువై కాలనీవాసులు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. మౌలిక వసతులు మృగ్యం.. ఎస్టీ కాలనీలో సుమారు 100 వరకు పక్కా గృహాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా ఎస్టీలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. వీరికి చదువు లేకపోవడంతో పాటు ప్రజాసాధికారిక సర్వేలో నమోదు కాక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరడం లేదు. వీరు కూలినాలి చేసుకుని జీవిస్తుంటారు. తాగునీటికి తిప్పలు కాలనీవాసులు తీవ్ర తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాగునీటికి సుమారు అరకిలోమీటర్ దూరంలోని కొత్తపాలెం ఎన్టీఆర్ సుజల వాటర్‌ప్లాంట్ నుంచి 20 లీటర్ల క్యాన్ రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాడుకనీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నాలుగురోజులకు ఒకసారి మాత్రమే కుళాయిల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. పంచాయతీల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా కాలనీకి మాత్రం ట్యాంకర్లు సక్రమంగా రావడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీలోని మురుగుకాలువలను ఏళ్ల తరబడి పూడిక తీయలేదు. దీంతో మురుగునీరు పారే అవకాశం లేకుండా పోయింది. పూరి గుడిసెలే శరణ్యం.. బేస్మెంట్ దశలో నిలిచిపోయిన పక్కా గృహం కాలనీవాసులకు గతంలో సునామీ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పక్కా గృహాలు నిర్మించారు. ఇంకా చాలా మంది నేటికి పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇటీవల సుమారు 30 మందికి ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద పక్కా గృహాలు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.2.25 లక్షల ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే వీరికి ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరికి ఇళ్లు కట్టిస్తానని ముందుకు వచ్చి కొంతమందికి పునాదుల కోసం గుంటలు తవ్వి వదిలేయగా, మరి కొంతమందికి బేస్మెంటు వేసి వదిలేశారు. అదేమంటే ఇటుకరాయి కావాలి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అంతమొత్తం ఇచ్చుకునే స్థోమత లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని కాలనీవాసులు వాపోయారు. మరి కొంతమంది అయితే నివాసముంటున్న పూరి గుడిసె పూర్తిగా దెబ్బతినడంతో గత్యంతరం లేక స్వచ్ఛభారత్ కింద నిర్మించిన మరుగుదొడ్లలో నివాసం ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోనూ సమస్యలే కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాల విద్యార్థులు వాడుకనీటి కోసం నాలుగురోజులకు ఒకసారి వచ్చే రక్షితమంచినీటి పథకం కుళాయిలపైనే ఆధారపడుతున్నారు. పాఠశాలలో బోరు మరమ్మతులకు గురైనా పట్టించుకునే వారే కరువయ్యారు. మరుగుదొడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటే మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇబ్బందులు తీర్చి కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
రైల్లో రెచ్చిపోయిన పోకిరీలు
♦ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై అసభ్య ప్రవర్తన ♦ భరించలేక నడుస్తున్న ట్రైన్ నుంచి దూకేసిన యువతి ♦ ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్లో ఘటన ఒంగోలు క్రైం/రైల్వేస్టేషన్ (విజయవాడ): పట్టపగలు.. పదుల సంఖ్యలో జనం చూస్తుం డగానే రైలులో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్ల కొందరు పోకిరీలు అఘాయిత్యం చేయబోయారు. సూటిపోటి మాటలు.. వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించే సరికి ఆ యువతి తట్టుకోలేకపోయింది. పెళ్లి చూపుల కోసం వెళ్తుండగా ఊహించని రీతిలో ఇలా వేధింపులు ఎదురయ్యేసరికి షాక్‌కు గురైంది. వారి చేతిలో అవమానం పాలయ్యే కంటే చావడం నయం అనుకుని నడుస్తున్న రైలు లోంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో గాయపడ్డ యువతిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటన రైళ్లలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలు.. విజయవాడ పెజ్జోనిపేటలో నివాసం ఉంటున్న షేక్ నజ్బుల్లా (21)తో పాటు విజయవాడకే చెందిన సీహెచ్ వాసవీ, మంగళగిరికి చెందిన ఎస్కె ఆరీఫాలు చెన్నైలోని రెడ్డింగ్ టన్ సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజినీ ర్లుగా పనిచేస్తున్నారు. నజ్బుల్లాకు గురువారం విజయవాడలో పెళ్లి చూపులున్నాయి. దానికి తోడు 2వ తేదీన బక్రీద్ పర్వదినం కావడంతో సెలవుపై విజయవాడకు బయల్దేరింది. ఆమెతోపాటు వాసవీ, ఆరీఫాలు కూడా బయల్దేరారు. వాస్తవానికి విజయవాడ వెళ్ళేం దుకు బుధవారం సాయంత్రమే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు ముగ్గురు రిజర్వేషన్ చేయించుకు న్నారు. కానీ, చెన్నై సెంట్రల్‌కు వచ్చేసరికి రైలు వెళ్లిపోవడంతో తిరిగి గురువారం ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్లో మిలీనియం ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలు ప్రయాణించిన గంట తర్వాత అదే బోగీలో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు అసభ్య పదజాలంతో వేధింపులు ప్రారం భించారు. తోటి ప్రయాణికులు ఎన్నిసార్లు వారించినా వారు ఆగకపోవడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. దీంతో బోగీలోని చైన్ లాగేందుకు నజ్బుల్లా చేసిన ప్రయత్నాలనూ ముష్కరులు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా ఆ బోగీలోకి టికెట్ కలెక్టర్‌గానీ, పోలీసులుగానీ రాలేదు. మధ్యాహ్నం 2.10గంటలకు సింగరాయకొండ స్టేషన్లో రైలు నెమ్మదించడంతో బాధితురాలు ఒక్కసారిగా తలుపు తీసుకుని దూకేసింది. వెంటనే ఆమె స్నేహితులు చైన్ లాగి రైలును ఆపారు. ఈ సంఘటనలో నజ్బుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్టేషన్ మాస్టర్ 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఆమెను ఒంగోలు రిమ్స్‌కు పంపిం చారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పా రు. సమాచారం తెలుసుకున్న ఒంగోలు రైల్వే జీఆర్పీ ఎస్సై టి.రమణయ్య నజ్బుల్లాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మద్యం తాగుతూ వికృతచేష్టలు.. ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు నజ్బుల్లా వెంట ఉన్న యువతులు రాత్రి 11 గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. ఆకతాయిలు దాదాపు పది మంది ఉన్నారని, మద్యం తాగుతూ గుట్కాలు నములుతూ అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు. నజ్బుల్లాపై చేయి కూడా చేసుకున్నారని, వారి వికృత చేష్టలకు భయపడి ఎవరూ వారించే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీసీ కూడా తమ కంపార్ట్‌మెంట్‌కు రాలేదని చెప్పారు. ఇలావుండగా సంఘటన నేపథ్యంలో టీసీని రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం అందింది. విజయవాడలో నిందితులు అదుపులోకి ముగ్గురు నిందితులను విజయవాడ రైల్వే జీఆర్పీ పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించారు. వీరంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామిలీ జిల్లాకు చెందిన కుర్బ మహ్మద్ (22), సదాకత్ఖాన్ (40), హరికేష్ యాదవ్ (25)లుగా గుర్తిం చారు. షామిలీ జిల్లా నేరస్తులకు అడ్డా కావడం గమనార్హం. -
పెళ్లి చూపులకొచ్చి రైలు నుంచి దూకేసింది..
-
పంతం నీదా..నాదా..సై!
సింగరాయకొండ: ఏరా ఆంజనేయులూ మా లక్ష్మిని ఏదో కామెంట్ చేశావంటా! జాగ్రత్త తాట తీస్తా ఏందిరా హనుమంతూ నాతోనే పెట్టుకుంటావా.. నీ కూతురు జోలికి నేను రాలా. ఆమె అబద్ధం చెబుతోంది. నేను కూడా మా అమ్మానాన్నను తీసుకొస్తా అంటూ వేగంగా వెళ్లిపోయాడు ఆంజనేయులు. సీన్ కట్ చేస్తే.. ఆటువైపు 25 వానరాలు.. ఇటు వైపు పాతికవానరాలు సింగరాయకొండ రైల్వేస్టేషన్ రోడ్డులో గురువారం యుద్ధానికి సన్నద్ధం అయ్యాయి. ఒకవర్గంపై మరో వర్గం కాలు దువ్వాయి.. పళ్లు ఇకిలించాయి.. దుమ్ము లేపాయి..తొడకొట్టాయి! రేయ్ కాంతారావూ నీ కొడిక్కి చెప్పు.. హద్దుల్లో ఉండకపోతే కొరికి పారేస్తా వార్నింగు ఇచ్చాడు హనుమంతుని పేరుతో ఉన్న వానరం కాంతారావు కూడా రెచ్చిపోయాడు తన సైన్యంతో అటువైపు దూకాడు. ఇదంతా చూస్తున్న జనం నిశ్చేష్టులయ్యారు. ఎప్పుడు వాటిమధ్య భీకర యుద్ధం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. చివరకు వాటి మధ్య కాంప్రమైజ్ కుదిరింది. ఏ కోతి దారిన ఆ కోతి వెళ్లింది. –సింగరాయకొండ -
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: 11 మందికి గాయాలు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బాలిరెడ్డినగర్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. జాతీయ రహదారిపై వెళుతున్న ఆటో ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడ్డవారిలో ఆరుగురికి కాళ్లూచేతులు విరగ్గా, మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడగలిగారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ఉలవపాడు మండలం రామాయపట్నం వాసులు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సింగరాయకొండ : కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యువకుడు కళాశాల సమీపంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే గేట్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఎమ్. ప్రదీప్ (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి బయలుదేరాడు. ఆ క్రమంలో కళాశాల సమీపంలోని రైల్వే గేట్ వద్ద వంటిపై కిరోసిన్ పోసుకొని ప్రదీప్ నిప్పంటించుకున్నాడు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108లో ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రేమ విఫలం కావడంతో ప్రదీప్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మనస్థాపంతో యువతి ఆత్మహత్య
సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పల్లిపాళెంలో కమల(18) అనే యువతి సోమవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు... పొరుగింటి యువకుడు, కమల ప్రేమించుకుంటున్నారు. కాగా ఆర్నెల్ల క్రితం ఆ యువకుడు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అయితే సోమవారం మధ్యాహ్నం సదరు యువకుని కుటుంబీకులు కమలను పిలిపించి.. వాళ్ల అబ్బాయిని మర్చిపోవాలని చెప్పి, నానా రకాలుగా తిట్టి అవమానించారు. వారి మాటలకు మనస్థాపం చెందిన కమల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కమల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సింగరాయకొండ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
100 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
సింగరాయకొండ (ప్రకాశం) : ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వంద బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీ సమీపంలో శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా ఆగి ఉన్న లారీని పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. దీంతో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వెలుగుచూసింది. లారీని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారని అధికారులు తెలిపారు.