సింగరాయకొండ (ప్రకాశం) : ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వంద బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీ సమీపంలో శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా ఆగి ఉన్న లారీని పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు.
దీంతో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వెలుగుచూసింది. లారీని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారని అధికారులు తెలిపారు.
100 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
Published Sat, Aug 15 2015 3:09 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM
Advertisement
Advertisement