సింగరాయకొండ : వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా .. ప్రైవేటు బస్సుల స్పీడ్‌కు అధికారులు బ్రేక్ వేయలేకపోతున్నారు. ఫలితంగా ప్రకాశం జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగానికి ఒక మహిళ మృతిచెందగా, పదిమంది వరకూ గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు జెట్ స్పీడ్‌తో వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు సింగరాయకొండ దాటి వెళ్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.