breaking news
kaveri travels
-
కర్నూలు ఘటన: ‘ఈ దుఖం నాతోనే ఉండిపోవాలి’
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన బస్సులో కరిగి ముద్దగా మారిన మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఏమని చెప్పాలి.. వారికి ఈ శరీరాన్ని ఎలా చూపాలి.. చూపితే వారు తట్టుకోగలరా.. ఇంతటి దుఃఖం మాతోనే ముగిసిపోనీ.. కర్నూలులోనే కుమారునికి అంత్యక్రియలు చేస్తాం’ అని ఆ తండ్రి బోరున విలపిస్తూ భావోద్వేగంతో చెప్పిన మాటలు కంటతడి పెట్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు.వీరిలో తమిళనాడులోని ధర్మపురం జిల్లా పాలక్కాడ్ తాలూకా మాదగేరి గ్రామానికి చెందిన రాజన్ మారప్పన్ కుమారుడు ప్రశాంత్ (29) కూడా ఉన్నాడు. ఇతను హైదరాబాద్‌లో చిప్స్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. అతడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా.. ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. స్వస్థలానికి వెళ్లి భార్యాపిల్లలను చూసేందుకు గురువారం రాత్రి హైదరాబాద్‌లో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు కర్నూలు దాటగానే మంటల్లో కాలిపోయింది. ఇందులో ప్రశాంత్ సజీవదహనయ్యారు. సోమవారం తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహానికి కూడా కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. కర్నూలు నుంచి 800 కి.మీ. దూరంలో ఉన్న మాదగేరికి వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతుందని.. మరణించి ఇప్పటికే మూడు రోజుల సమయం దాటిందని, ఇప్పుడు స్వగ్రామానికి వెళ్లేలోపు ఐదు రోజులు పూర్తవుతుందని తండ్రి రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కాలిపోయిన మాంసం ముద్దగా మారిన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించి వారిని మరింత క్షోభకు గురిచేయలేమని, కేవలం అస్థికలు మాత్రమే తీసుకెళ్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సద్గురుదత్త కృపాలయం గ్యాస్ క్రిమేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి అస్థికల్ని అందజేశారు. వాటిని ప్రశాంత్ తండ్రి రాజన్ మారప్పన్తో పాటు సోదరుడు మణి, స్నేహితులు తీసుకెళ్లారు. -
డ్రైవర్, బస్సు యాజమాన్యంపై కేసు నమోదు
-
బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత రియాక్షన్
-
Bus Accident: ఆ క్షణం ఏం జరిగింది..! చిన్న తప్పే కొంప ముంచిందా?
-
Travels Management: రాత్రి 3:30కి ప్రమాదం జరిగినట్టు సమాచారం ఉంది
-
అయ్యో శివుడా!.. గుండెలవిసేలా రోదిస్తున్న యశోదమ్మ
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే.. బస్సు, బైక్ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం సందర్బంగా బైక్‌ను బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన బైకర్ శంకర్ చనిపోయాడు. శంకర్‌ను కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.కాగా, శివశంకర్ మరణంతో అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఇలా మృతి చెందడం పట్ల విలపిస్తోంది. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బస్సు ముందుభాగంలోకి బైక్ వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం కారణంగా బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉండగా.. వారిలో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్టు సమాచారం. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో నల్లగొండకు చెందిన అనూషా రెడ్డి మృతి..ఇదిలా ఉండగా.. ఘటనా స్థలానికి ఫొరెన్సిక్ బృందం చేరుకుంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు. అలాగే, ఘటన స్థలానికి రవాణా శాఖ అధికారులు చేరుకున్నారు. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. కావేరి ట్రావెల్స్ పేరిట ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న రిజిస్ట్రేషన్ చేశారు. తల్లీకూతుళ్లు మిస్సింగ్.. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయ్యింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెట్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి. అన్ని కోణాల్లో పూర్థి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
-
రోడ్డు ప్రమాదం: కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(Bus Accident) బుధవారం అర్థరాత్రి 12.30 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు కావేరి ట్రావెల్స్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఈ బస్సు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు– కొంతమూరు మధ్యలో అగ్రహారం వద్దకు వచ్చేసరికి బోల్తా పడింది(Road Accident). రోడ్డు పనులు జరుగుతుండటంతో డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చేవరకూ గమనించకపోవడం, ఒక్కసారిగా వేగంగా కుడివైపునకు బస్సు తిప్పడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి (20) అక్కడికక్కడే మృతి చెందింది. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ముగ్గుర్ని కాకినాడ ఆస్పత్రికి, ఇద్దర్ని రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో 13 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. -
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో బస్సు ప్రమాదం
-
కావేరి ట్రావెల్స్ బస్సులో స్వల్ప అగ్ని ప్రమాదం
-
ఒంగోలులో ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య ఘర్షణ
-
రోడ్డుప్రమాదంలో కావేరి ట్రావెల్స్ డ్రైవర్ మృతి
ఉలవపాడు : ప్రకాశం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతిచెందాడు. విశాఖపట్టణం నుంచి తిరుపతికి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామ శివార్లలో ముందు వెళుతున్న గ్రానైట్ లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాజు సీటులో ఇరుక్కుని గంటపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలాడు. బస్సులోని 31 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారం ద్వారా బయటికి దిగారు. ప్రయాణికులను మరో బస్సులో తిరుపతి పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ రాజును ప్రాణాలతో బయటికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మంటల్లో ‘కావేరి’ బస్సు
•నాలుగేళ్ల హైదరాబాద్ బాలుడి సజీవ దహనం •షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తుండగా దుర్ఘటన •ఐదుగురికి గాయాలు కర్ణాటక సరిహద్దులో ఘటన •డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం సాక్షి, జహీరాబాద్ టౌన్ /తణుకు : సాయినాథుని దర్శనం చేసుకున్న 36 మంది తెలుగు భక్తులు కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.. శుక్రవారం ఉదయం ఆరుగంటలవుతోంది. అందరూ ఆదమరిచి నిద్రిస్తున్నారు. బస్సు తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని ఉమ్నాబాద్ పట్టణం దాటి 2 కిలోమీటర్లు వచ్చింది. మరో మూడు గంటల్లో హైదరాబాద్ చేరుకోవాలి. అంతలోనే ఉపద్రవం..! బస్సు ఇంజన్‌లోనుంచి ఒక్కసారిగా పొగలు కమ్ముకొచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపి.. పక్కనే ఉన్న ధాబా, పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్లను పిలిచి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. మంటలు అంతకంతకు విస్తరించాయి. ప్రయాణికులు నిద్రలో ఉండగానే బస్సంతా పొగ నిండింది. బయట ఉన్నవారు ప్రయాణికులను అప్రమత్తం చేసి అద్దాలు పగలగొట్టారు.అరుపులు కేకలకు మేల్కొన్న వారు వీలున్న చోటినుంచి బయటకు దూకేశారు. కిటీకీలు బద్దలుకొట్టి బయటపడ్డారు. నాలుగేళ్లకే నూరేళ్లు.. బస్సులో వెనకసీట్లో నిద్రపోతున్న అచ్చుత రామ ప్రసాద్, వెంకటేశ్వరి దంపతులూ ప్రాణాలతో బయటపడేందుకు పరిగెత్తారు. వీరికి ఇద్దరు పిల్లలు.. పెద్ద కుమారుడు విహాల్ (4), మరో రెండేళ్ల బాబు. నిద్రమత్తో, మరేమోగాని ఆందోళనలో రెండేళ్ల బాబును తీసుకుని ప్రసాద్ కిందికి దిగగా.. భార్య వెంకటేశ్వరి కూడా కిందకు దిగారు. భార్య పెద్ద కుమారుడిని తీసుకొస్తుందని ప్రసాద్ అనుకున్నారు. చూస్తుండగానే బస్సు మొత్తం కాలిపోతోంది. అంతలోనే విహాన్ కనిపించటం లేదని కంగారు పడ్డ భార్యాభర్తలకు.. పక్కసీట్లో పడుకున్న విహాల్‌ను తీసుకురాలేదని అర్థమైంది. దీంతో విహాల్‌ను తీసుకొచ్చేందుకు ఇద్దరూ దగ్ధమవుతున్న బస్సులోకి ఎక్కారు. వెంటనే పక్కనున్న వారు వీళ్లను కిందకు లాక్కొచ్చారు. ఎగసిపడుతున్న అగ్నికీలలతో వీరికీ గాయాలయ్యాయి. వెనకసీట్లో నిద్రిస్తున్న విహాల్ మంటల్లో కాలి బూడిదయ్యాడు. వీరితోపాటు రాణి (50), వరుణ్ కుమార్(35), నాగలక్ష్మి(22) గాయపడ్డారు. ఉమ్నాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ప్రభాకర్‌రెడ్డి అనే ప్రయాణికుడికి చెందిన రూ.45 వేలు, మరో ప్రయాణికుడి ల్యాప్‌టాప్ కాలిపోయాయి. అతివేగం వల్లే.. ‘డ్రైవర్ మితిమీరిన వేగంతో నడిపాడు. మెల్లగా వెళ్లాలని చెప్పినా వినలేదు. డ్రైవర్ దగ్గర్నుంచే మంటలొచ్చాయి’ అని ప్రభాకర్ రెడ్డి అనే ప్రయాణికుడొకరు చెప్పారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స తర్వాత హైదరాబాద్ తరలించారు. తణుకులో విషాదం.. విహాన్ (4) తల్లిదండ్రులది పశ్చిమగోదావరి జిల్లా తణుకు. రామప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుధవారం సాయంత్రం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి షిర్డీ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దుర్ఘటన జరిగింది. విహాన్ మృతితో తణుకులో, గచ్చిబౌలిలో వీరుంటున్న కాలనీలోనూ విషాదం నెలకొంది. జూలైలో నాలుగో పుట్టినరోజు జరుపుకున్న విహాన్.. ఈ ఏడాది నుంచే ప్లే స్కూలుకెళ్తున్నాడు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన కావేరి ట్రావెల్స్ బస్సు
నల్గొండ జిల్లా: మునగాల మండలంలోని ముకుందాపుం గ్రామంలో శనివారం రాత్రి పశ్చిమ గోదవారి జిల్లా అత్తిలి నుంచి హైదరాబాదుకు వస్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు రోడ్డుపై ఉన్న గుడిసెను ఢీకొని ఆ పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంటి గోడను ఢీకొనడంతో గోడ ధ్వంసమైంది. ఆ ఇంటికి చెందిన కుటుంబ సభ్యులు రెండో గదిలో నిద్రించడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనలో గుడిసెలోని ఒకరికి, బస్సు డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి -
పునాదిపాడు వద్ద కావేరి ట్రావెల్ బస్సు బోల్తా
-
టవేరాను ఢీకొన్న కావేరీ ట్రావెట్స్ బస్సు, ఒకరు మృతి
ఖమ్మం : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతాండ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కావేరి ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు వేగంగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ఫ్రెండ్‌కు ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. హైదరాబాద్‌కు హుషారుగా బయల్దేరిన మిత్రబృందం అనూహ్యరీతిలో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు, ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న టవేరాలు అనూహ్యరీతిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి కుమ్మరికుంట్ల సాయి మృతిచెందగా ... షరీఫ్, సాయికృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్టీఏ విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండడంతో సరైన డాక్యుమెంట్లు లేకపోవటంతో కావేరీ ట్రావెల్స్ బస్సు విజయవాడ మీదుగా వెళ్లాల్సింది... ఖమ్మం మీదుగా పయనమైంది. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
టమేరా-కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీ
-
కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా, మహిళ మృతి
సింగరాయకొండ : వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా .. ప్రైవేటు బస్సుల స్పీడ్‌కు అధికారులు బ్రేక్ వేయలేకపోతున్నారు. ఫలితంగా ప్రకాశం జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగానికి ఒక మహిళ మృతిచెందగా, పదిమంది వరకూ గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు జెట్ స్పీడ్‌తో వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు సింగరాయకొండ దాటి వెళ్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.


