సింగరాయకొండ (ప్రకాశం) : ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 10 గొర్రెలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే... సింగరాయకొండ సమీపంలోని కోల్‌కతా-చెన్నై ఐదవ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్థరాత్రి గొర్రెల లారీ, గ్రానైట్తో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, పది గొర్రెలు చనిపోయాయి.
ఆ రెండు వాహనాలు అలా ఆగి ఉండగానే గ్రానైట్ లారీ వెనుక ఆగిన బస్సును మరో లారీ గుద్దుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. కాగా ఆ లారీని మరో టిప్పర్ ఢీకొట్టింది. దానిని వేగంగా వచ్చిన కంటెయినర్ ఢీకొంది. ఈ ఘటనలో కంటెయినర్ ఇంజిన్ ధ్వంసం కాగా డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. గంట వ్యవధిలోనే ఈ ప్రమాదాలు సంభవించటంతో పోలీసులు అక్కడికి చేరుకుని, ప్రమాదాలకు గురైన వాహనాలను పక్కకు తీసి, రాకపోకలను క్రమబద్ధీకరించారు.
అర్ధరాత్రి ఆరు వాహనాలు ఢీ
Published Sat, Aug 15 2015 3:04 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement