
ప్రియురాలి మృతదేహంతో పోలీసులకు చిక్కిన ప్రియుడు
ఒంగోలు: ప్రియురాలని హతమార్చి ఆమె మృతదేహాన్ని రహస్యంగా తరలిస్తూ పోలీసులకు చిక్కాడో ప్రియుడు. దాంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం అతడిని పోలీసులు తమదైనశైలిలో విచారిస్తున్నారు. ఆ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సింగరాయకొండలో పోలీసులు గత అర్థరాత్రి వాహనాలు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్బంగా మృతదేహంతో వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు అపి డ్రైవర్ స్థానంలో ఉన్న ప్రియుడ్ని ప్రశ్నించారు. దాంతో అతడు పోంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అతడితోపాటు ఆ వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసు అతడ్ని విచారిస్తున్నారు.