lover arrest
-
ప్రియురాలు ఎంత పని చేసింది.. లవర్స్ ఇలా కూడా ఉంటారా!
యశవంతపుర: ప్రేమికులంటే తిరగటం కామన్, జల్సాలు చేయడానికి ప్రియుడి వద్ద డబ్బులు లేక పోవటంతో ప్రియురాలు చోరీలు చేయించిన ఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెంగళూరుకు చెందిన దీక్షితా, మధులు ప్రేమించుకున్నారు. అయితే, మెడిసిన్ చదువుతున్న మధు వద్ద డబ్బులు లేక పోవటంతో దీక్షిత ఒక ప్లాన్ చెప్పింది. బెంగళూరు ఉత్తర తాలూకా నెలగదిరినహళ్లి గ్రామంలోని తన పెద్దప్ప తిమ్మేగౌడ ఇంటిలో చోరీ చేయాలని చెప్పింది. అదే ఇంటిలో మధు అద్దెకు ఉంటున్నాడు. దీంతో మధు తిమ్మేగౌడ ఇంటిలో రూ. 90 వేల నగదు, 200 గ్రాముల బంగారు చోరీ చేశాడు. చోరీ విషయం గుర్తించిన తిమ్మేగౌడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి మధును విచారించగా అసలు విషయం వెల్లడించాడు. ప్రేమికురాలి పథకంతోనే చోరీ చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. చోరీ సొత్తును పోలీసులు స్వాదీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం.. -
స్నేహను ప్రేమిస్తున్నానని చెప్పి.. తర్వాత మరో అమ్మాయితో పెళ్లన్నాడు.. చివరికి!
సాక్షి, కామారెడ్డి: ప్రేమ పేరుతో మోసం చేసి, యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై మధుసూదన్‌గౌడ్ తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డికి చెందిన మైనర్ బేతి స్నేహను పట్టణానికి చెందిన రఘుపతి గత యేడాది మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశారు. ఆమె తల్లిదండ్రులకు, స్నేహితులకు ప్రేమ విషయం తెలిసేట్లు చేశాడు. తర్వాత మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని స్నేహను మోసం చేశాడు. తాను ప్రేమ పేరుతో మోసపోయాయని భావించి మనో వేధనతో ఈనెల 1న ఇంట్లో ఉరివేసుకుని స్నేహ ఆత్మహత్య చేసుకుంది. దీంతో కేసు నమోదు చేసిన నిందితుడు రఘుపతిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ, దాంతో -
ప్రియుడే అనూషను హత్య చేశాడు
-
‘అనూషను హత్యచేసింది ఆమె ప్రియుడే’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హయత్ నగర్ శివారు ప్రాంతాల్లో జరిగిన యువతి అనూష హత్య కేసును పోలీసులు చేదించారు. అనూష తల్లిదండ్రులు అనుమానించినట్లుగానే ఆమె ప్రియుడు మోతీలాలే ఈ హత్యకు పాల్పడ్డాడు. గత తొమ్మిది నెలల కిందటే అనూషతో మోతీలాల్‌కు నిశ్చితార్థంకాగా ఆమెపై అనుమానం పెంచుకొని ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఐదు రోజుల తర్వాత ఈ కేసును పోలీసులు పరిష్కరించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కొండాభీమన్ పల్లి గ్రామానికి చెందిన అనూష బీటెక్ పూర్తి చేసింది. తండ్రి లేకపోయినా ఆమె తల్లే కష్టపడి చదివించింది. ఈ క్రమంలోనే ఉన్నత చదువుతో ఉద్యోగం సంపాధించాలని అనూష హైదరాబాద్‌కు వచ్చింది. నగరంలోని ఆమె సోదరి ఇంట్లోనే ఉంటూ పై ఉద్యోగం కోసం చదువుతోంది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్‌కు చెందిన మోతిలాల్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే, ఇరు కుటుంబాలు అంగీకరించి వారికి నిశ్చితార్థం చేశారు. అయితే, తాను ఉద్యోగం సాధించాకే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే హయత్ నగర్‌లోని మిథాలి నగర్లో ఉన్న తన సోదరి ఇంటికి వచ్చి అక్కడే ఉంటుండగా దారుణ హత్యకు గురైంది. పక్కా పథకం ప్రకారం అనూషను మోతీలాల్ హత్య చేశాడు. ఓ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు రాత్రి ఉండాలని చెప్పి ఆమెను తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. -
ప్రియురాలి మృతదేహంతో పోలీసులకు చిక్కిన ప్రియుడు
ఒంగోలు: ప్రియురాలని హతమార్చి ఆమె మృతదేహాన్ని రహస్యంగా తరలిస్తూ పోలీసులకు చిక్కాడో ప్రియుడు. దాంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడిని పోలీసులు తమదైనశైలిలో విచారిస్తున్నారు. ఆ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సింగరాయకొండలో పోలీసులు గత అర్థరాత్రి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మృతదేహంతో వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు అపి డ్రైవర్ స్థానంలో ఉన్న ప్రియుడ్ని ప్రశ్నించారు. దాంతో అతడు పోంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అతడితోపాటు ఆ వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు అతడ్ని విచారిస్తున్నారు. -
నేను నిన్ను ప్రేమించలేదు..
హైదరాబాద: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు తనను మోసం చేశాడంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం... వెంకటగిరి సమీపంలోని హైలం కాలనీలో నివసించే యువతి(24) బంజారాహిల్స్‌లోని ఓ న్యూస్ చానెల్లో స్క్రిప్ట్ రైటర్. 2011-12 మధ్య కాలంలో మరో చానెల్లో పని చేస్తున్నప్పుడు జె.సతీష్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, గత ఐదు నెలలుగా సతీష్ ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దీంతో సదరు యువతి దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రియుడి ఇంటికి వెళ్లగా...‘ నేను నిన్ను ప్రేమించలేదు.. పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ తండ్రితో పాటు దుర్భాషలాడి గెంటేశాడు. పెళ్లి పేరుతో తనను మోసగించిన సతీష్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సతీష్‌పై ఐపీసీ సెక్షన్ 417, 420 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం వద్దన్నాడని నిప్పు
* ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం * భర్త మరణవాగ్మూలంతో నిందితుల అరెస్టు హైదరాబాద్: ప్రియుడితో కలిసి భర్త ప్రాణం తీసిన మహిళతో పాటు ఆమె ప్రియుడిని కార్ఖానా పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధం వద్దన్నందుకు భార్య, ఆమె ప్రియుడు తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని భర్త ఇచ్చిన మరణవాగ్మూలం మేరకు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. సీఐ వై.నాగేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.... మెదక్ జిల్లా శివ్వంపేట గ్రామానికి చెందిన కృష్ణ (42), విజయ దంపతులు పొట్టకూటి కోసం ఏడేళ్ల క్రితం నగరానికి వచ్చి కార్ఖానాలోని విక్రంపురి కాలనీలో నివాసముంటున్నారు. భర్త అపార్ట్మెంట్ వద్ద వాచ్‌మన్‌గా పని చేస్తుండగా.. భార్య ఇళ్లలో పని చేసేది. అమర్నాథ్ అనే కారుడ్రైవర్‌తో కృష్ణకు స్నేహం ఏర్పడింది. అతను తరచూ కృష్ణ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో విజయతో విహేతరసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి కృష్ణ గతేడాది పంచాయితీ పెట్టగా పెద్దమనుషులు విజయ, అమర్నాథ్లను మందలించారు. అయినా వారు పద్ధతి మార్చుకోలేదు. దీంతో గతేడాది మార్చి 21న కృష్ణ భార్యను నిలదీయగా గొడవ జరిగింది. కృష్ణ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అతడిని గాంధీకి తరలించారు. తన భార్య విజయ, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అమర్నాథ్ కలిసి తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని బాధితుడు కృష్ణ పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. చికిత్సపొందుతూ రెండు రోజులకే అతను మృతి చెందాడు. మృతుడు కృష్ణ ఇచ్చిన వాగ్మూలం మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు నిందితులు విజయ, అమర్నాథ్ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.