
నేను నిన్ను ప్రేమించలేదు..
హైదరాబాద: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు తనను మోసం చేశాడంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం...
వెంకటగిరి సమీపంలోని హైలం కాలనీలో నివసించే యువతి(24) బంజారాహిల్స్‌లోని ఓ న్యూస్ చానెల్‌లో స్క్రిప్ట్ రైటర్. 2011-12 మధ్య కాలంలో మరో చానెల్‌లో పని చేస్తున్నప్పుడు జె.సతీష్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, గత ఐదు నెలలుగా సతీష్ ఆమెను పట్టించుకోవడం మానేశాడు.
దీంతో సదరు యువతి దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రియుడి ఇంటికి వెళ్లగా...‘ నేను నిన్ను ప్రేమించలేదు.. పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ తండ్రితో పాటు దుర్భాషలాడి గెంటేశాడు. పెళ్లి పేరుతో తనను మోసగించిన సతీష్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సతీష్‌పై ఐపీసీ సెక్షన్ 417, 420 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.