
హత్యకు గురైన అనూష్ (ఫైల్ ఫొటో), వివరాలు వెల్లడిస్తున్న పోలీసు అధికారి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హయత్ నగర్ శివారు ప్రాంతాల్లో జరిగిన యువతి అనూష హత్య కేసును పోలీసులు చేదించారు. అనూష తల్లిదండ్రులు అనుమానించినట్లుగానే ఆమె ప్రియుడు మోతీలాలే ఈ హత్యకు పాల్పడ్డాడు. గత తొమ్మిది నెలల కిందటే అనూషతో మోతీలాల్‌కు నిశ్చితార్థంకాగా ఆమెపై అనుమానం పెంచుకొని ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఐదు రోజుల తర్వాత ఈ కేసును పోలీసులు పరిష్కరించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కొండాభీమన్ పల్లి గ్రామానికి చెందిన అనూష బీటెక్ పూర్తి చేసింది. తండ్రి లేకపోయినా ఆమె తల్లే కష్టపడి చదివించింది.
ఈ క్రమంలోనే ఉన్నత చదువుతో ఉద్యోగం సంపాధించాలని అనూష హైదరాబాద్‌కు వచ్చింది. నగరంలోని ఆమె సోదరి ఇంట్లోనే ఉంటూ పై ఉద్యోగం కోసం చదువుతోంది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్‌కు చెందిన మోతిలాల్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే, ఇరు కుటుంబాలు అంగీకరించి వారికి నిశ్చితార్థం చేశారు. అయితే, తాను ఉద్యోగం సాధించాకే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే హయత్ నగర్‌లోని మిథాలి నగర్‌లో ఉన్న తన సోదరి ఇంటికి వచ్చి అక్కడే ఉంటుండగా దారుణ హత్యకు గురైంది. పక్కా పథకం ప్రకారం అనూషను మోతీలాల్ హత్య చేశాడు. ఓ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు రాత్రి ఉండాలని చెప్పి ఆమెను తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment