
అనూష హత్య కేసులో నిందితుడు మోతీలాల్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : అనూష తాను 2013 నుంచి ప్రేమించుకున్నాం అని ఆమెను హత్య చేసిన ప్రియుడు మోతీలాల్ చెప్పాడు. తమ ప్రేమ వ్యహారంపై తమ ఇంట్లో ఒప్పకోక పోయినా అనూష ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నామని తెలిపాడు. అనూష చదువుకు అయ్యే ఖర్చు కూడా తానే భరించానని, కానీ, ఆమె ప్రవర్తనలో గత కొద్ది రోజుల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పాడు. అనూష ఫోన్ పరిశీలిస్తే చాలామందితో చాటింగ్ చేసినట్లు గుర్తించానని, తన స్నేహితుడు కూడా అనూషతో చాటింగ్ చేయడంతో తనకు అనుమానం ఎక్కువైందన్నాడు.
ఈ వ్యవహారంపై అనూషను నిలదీయడంతోనే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, తాగిన మైకంలో క్షణికావేశంతో అనూషను బండ రాయితో మోది హత్య చేశానని అంగీకరించాడు. కాగా, ఎల్బీ నగర్ డీసీపీ కార్యాలయం ముందు అనూష బందువులు ఆందోళనకు దిగారు. తమ కూతురిని హత్య చేసింది మోతిలాల్ ఒక్కడే కాదని, వారి ముగ్గురు అన్నదమ్ములు ప్రమేయం ఉందని వారు ఆరోపిస్తున్నారు. మలక్‌పేటలో పని చేసే ఎస్ఐ రామ్ లాల్‌కు ఈ హత్య కేసులో ప్రమేయం ఉందని, ఆయనతోపాటు చిన్నా, శంకర్ ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనూష గర్భవతి అనే అంశంపై మరోసారి పోస్ట్‌మార్టం చేస్తే నిజానిజాలు బయటకొస్తాయని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment