Motilal
-
అనూషలో మార్పు భరించలేక చంపేశా..
సాక్షి, హైదరాబాద్ : అనూష తాను 2013 నుంచి ప్రేమించుకున్నాం అని ఆమెను హత్య చేసిన ప్రియుడు మోతీలాల్ చెప్పాడు. తమ ప్రేమ వ్యహారంపై తమ ఇంట్లో ఒప్పకోక పోయినా అనూష ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నామని తెలిపాడు. అనూష చదువుకు అయ్యే ఖర్చు కూడా తానే భరించానని, కానీ, ఆమె ప్రవర్తనలో గత కొద్ది రోజుల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పాడు. అనూష ఫోన్ పరిశీలిస్తే చాలామందితో చాటింగ్ చేసినట్లు గుర్తించానని, తన స్నేహితుడు కూడా అనూషతో చాటింగ్ చేయడంతో తనకు అనుమానం ఎక్కువైందన్నాడు. ఈ వ్యవహారంపై అనూషను నిలదీయడంతోనే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, తాగిన మైకంలో క్షణికావేశంతో అనూషను బండ రాయితో మోది హత్య చేశానని అంగీకరించాడు. కాగా, ఎల్బీ నగర్ డీసీపీ కార్యాలయం ముందు అనూష బందువులు ఆందోళనకు దిగారు. తమ కూతురిని హత్య చేసింది మోతిలాల్ ఒక్కడే కాదని, వారి ముగ్గురు అన్నదమ్ములు ప్రమేయం ఉందని వారు ఆరోపిస్తున్నారు. మలక్‌పేటలో పని చేసే ఎస్ఐ రామ్ లాల్‌కు ఈ హత్య కేసులో ప్రమేయం ఉందని, ఆయనతోపాటు చిన్నా, శంకర్ ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనూష గర్భవతి అనే అంశంపై మరోసారి పోస్ట్‌మార్టం చేస్తే నిజానిజాలు బయటకొస్తాయని వారు కోరుతున్నారు. -
‘అనూషను హత్యచేసింది ఆమె ప్రియుడే’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హయత్ నగర్ శివారు ప్రాంతాల్లో జరిగిన యువతి అనూష హత్య కేసును పోలీసులు చేదించారు. అనూష తల్లిదండ్రులు అనుమానించినట్లుగానే ఆమె ప్రియుడు మోతీలాలే ఈ హత్యకు పాల్పడ్డాడు. గత తొమ్మిది నెలల కిందటే అనూషతో మోతీలాల్‌కు నిశ్చితార్థంకాగా ఆమెపై అనుమానం పెంచుకొని ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఐదు రోజుల తర్వాత ఈ కేసును పోలీసులు పరిష్కరించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కొండాభీమన్ పల్లి గ్రామానికి చెందిన అనూష బీటెక్ పూర్తి చేసింది. తండ్రి లేకపోయినా ఆమె తల్లే కష్టపడి చదివించింది. ఈ క్రమంలోనే ఉన్నత చదువుతో ఉద్యోగం సంపాధించాలని అనూష హైదరాబాద్‌కు వచ్చింది. నగరంలోని ఆమె సోదరి ఇంట్లోనే ఉంటూ పై ఉద్యోగం కోసం చదువుతోంది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్‌కు చెందిన మోతిలాల్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే, ఇరు కుటుంబాలు అంగీకరించి వారికి నిశ్చితార్థం చేశారు. అయితే, తాను ఉద్యోగం సాధించాకే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే హయత్ నగర్‌లోని మిథాలి నగర్లో ఉన్న తన సోదరి ఇంటికి వచ్చి అక్కడే ఉంటుండగా దారుణ హత్యకు గురైంది. పక్కా పథకం ప్రకారం అనూషను మోతీలాల్ హత్య చేశాడు. ఓ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు రాత్రి ఉండాలని చెప్పి ఆమెను తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. -
తెలుగులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తి
మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరు న్యాయస్థానంలో తెలుగు భాషలో తీర్పును వెలువరించారు. వివరాలిలా..చౌడేపల్లె మండలం కొలింపల్లెకు చెందిన పి.వెంకట్రమణ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఐదు మందిపై అప్పు తిరిగి చెల్లించలేదని గతేడాది కేసు దాఖలు చేశారు. ఈ కేసును న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణలో ఇరువర్గాల వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం సోమవారం తీర్పును వెలువరించింది. కేసులో ఆరోపణలు రుజువుకాకపోవడంతో కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి మోతిలాల్ తీర్పును వెలువరించారు. తీర్పును తెలుగుభాషలో వెలువరించడం విశేషం. -
కబీ కభీ మేరే దిల్ మే...
సందర్భం: నేడు ముఖేష్ కుమార్ జయంతి సంవత్సరం సరిగ్గా గుర్తు లేదుగానీ, నా మిత్రుడు మోతీలాల్, ముఖేష్‌ను నాకు పరిచయం చేస్తూ ‘‘ఈ కుర్రాడిని నీకు అప్పగిస్తున్నాను. మంచి పాటగాడు. నువ్వు తీర్చిదిద్దితే వృద్ధిలోకి వస్తాడు’’ అని చెప్పాడు. సంగీతంలో తర్ఫీదు పొందని గొంతు అతనిది. అయినప్పటికీ చక్కగా ఉంది. కొన్ని నెలల తరువాత ఒక సినిమాలో ‘భాయి బంజారే’ అనే పాట పాడడానికి అవకాశం ఇచ్చాను. శాస్త్రీయత, బెంగాలీ శైలి మిళితమైన నా పాటలు ముఖేష్‌కు పూర్తిగా కొత్త. ఈ కారణం వల్లే పాడడానికి ఇబ్బంది పడి ఉంటాడు. మరో వైపు నిర్మాత మెహబూబ్ ఖాన్ ‘‘పాట త్వరగా పూర్తి చేయండి’’ అని ఒత్తిడి తెస్తున్నాడు. అతని కోసం ఆ పాటను నేను పాడక తప్పలేదు. పాట రికార్డింగ్ తరువాత ముఖేష్ అన్నాడు ‘‘దాదా!...ఈ పాట మీరు తప్ప ఎవరూ పాడలేరు. మీ పాట పాడే అదృష్టం నాకు ఉందో లేదో’’ అని. ఆ క్షణంలో అతడిని చూస్తే.... అకస్మాత్తుగా తన చేతుల్లో నుంచి ఆడుకుంటున్న బొమ్మను కోల్పోయి దీనంగా చూస్తున్న పసిపిల్లాడు గుర్తుకు వచ్చాడు. బాధగా అనిపించింది. ప్రతిభ ఎన్ని రోజులని దాగుతుంది? కాలక్రమంలో నా పాటలే కాదు...ఎందరో సంగీత దర్శకుల దగ్గర పాడాడు. ‘రాజ్‌కపూర్‌కు ముఖేష్ గొంతు అయితేనే సరిపోతుంది’ అనిపించుకున్నాడు. సైగల్ స్థాయిలో భావోద్వేగాలు ప్రతిఫలించే పాటలెన్నో పాడాడు. తాను నడిచొచ్చిన దారిలో సహాయపడిన వ్యక్తులను గుర్తు పెట్టుకోవడం... ముఖేష్‌లో ఉన్న గొప్ప లక్షణం. ‘‘ఈయన లేకపోతే ముఖేష్ అనే వాడు లేడు’’ అని ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఒక పెద్దమనిషికి నన్ను పరిచయం చేసినా, మోతీలాల్ అనారోగ్యం కారణంగా ఆగిపోయిన అతని సొంత చిత్రం ‘ఛోటీ ఛోటీ బాతే’కు సంబంధించిన నిర్మాణ బాధ్యతల్ని తలకెత్తుకున్నా... తాను అభిమానించే వ్యక్తుల కోసం తపించే నైజం ఆయనకే సొంతం. 1923 జూలై 22వ తేదీన ఢిల్లీలో పుట్టిన ముకేష్ కుమార్.. అమెరికాలోని డెట్రాయిట్లో ఉండగా 1976 ఆగస్టు 27న మరణించారు. చనిపోయే వరకు ఆయన గళం సుస్వరాలను పలికిస్తూనే ఉంది. - ప్రముఖ సంగీత దర్శకుడు అనిల్ బిస్వాస్ జ్ఞాపకాలలో నుంచి...