
యశవంతపుర: ప్రేమికులంటే తిరగటం కామన్, జల్సాలు చేయడానికి ప్రియుడి వద్ద డబ్బులు లేక పోవటంతో ప్రియురాలు చోరీలు చేయించిన ఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెంగళూరుకు చెందిన దీక్షితా, మధులు ప్రేమించుకున్నారు. అయితే, మెడిసిన్ చదువుతున్న మధు వద్ద డబ్బులు లేక పోవటంతో దీక్షిత ఒక ప్లాన్ చెప్పింది.
బెంగళూరు ఉత్తర తాలూకా నెలగదిరినహళ్లి గ్రామంలోని తన పెద్దప్ప తిమ్మేగౌడ ఇంటిలో చోరీ చేయాలని చెప్పింది. అదే ఇంటిలో మధు అద్దెకు ఉంటున్నాడు. దీంతో మధు తిమ్మేగౌడ ఇంటిలో రూ. 90 వేల నగదు, 200 గ్రాముల బంగారు చోరీ చేశాడు. చోరీ విషయం గుర్తించిన తిమ్మేగౌడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి మధును విచారించగా అసలు విషయం వెల్లడించాడు. ప్రేమికురాలి పథకంతోనే చోరీ చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. చోరీ సొత్తును పోలీసులు స్వాదీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం..
Comments
Please login to add a commentAdd a comment