stealing cash
-
ప్రియురాలు ఎంత పని చేసింది.. లవర్స్ ఇలా కూడా ఉంటారా!
యశవంతపుర: ప్రేమికులంటే తిరగటం కామన్, జల్సాలు చేయడానికి ప్రియుడి వద్ద డబ్బులు లేక పోవటంతో ప్రియురాలు చోరీలు చేయించిన ఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెంగళూరుకు చెందిన దీక్షితా, మధులు ప్రేమించుకున్నారు. అయితే, మెడిసిన్ చదువుతున్న మధు వద్ద డబ్బులు లేక పోవటంతో దీక్షిత ఒక ప్లాన్ చెప్పింది. బెంగళూరు ఉత్తర తాలూకా నెలగదిరినహళ్లి గ్రామంలోని తన పెద్దప్ప తిమ్మేగౌడ ఇంటిలో చోరీ చేయాలని చెప్పింది. అదే ఇంటిలో మధు అద్దెకు ఉంటున్నాడు. దీంతో మధు తిమ్మేగౌడ ఇంటిలో రూ. 90 వేల నగదు, 200 గ్రాముల బంగారు చోరీ చేశాడు. చోరీ విషయం గుర్తించిన తిమ్మేగౌడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి మధును విచారించగా అసలు విషయం వెల్లడించాడు. ప్రేమికురాలి పథకంతోనే చోరీ చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. చోరీ సొత్తును పోలీసులు స్వాదీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం.. -
రూ.3.5 లక్షలు చోరీ
మందస: మండలంలోని హరిపురం నుంచి బయల్దేరిన బొలేరో వాహనం నుంచి రూ.3.5 లక్షలు చోరీ జరిగినట్లు డ్రైవర్ రట్టి నవీన్ మందస పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. బాలాజీ కాజూ ఫ్యాక్టరీ యజమా ని కోరాడ సునీల్ జీడి పిక్కలు కొనుగోలు చేయడానికి డ్రైవర్ నవీన్‌కు రూ.3.5 లక్షలు ఇచ్చి పంపించారు. నవీన్ తన బొలేరో వాహనంలో హరిపురం నుంచి బయల్దేరి కమలాపురం సమీపంలోని పెట్రో ల్ బంకులో ఆయిల్ కొట్టించారు. అక్కడ ఎవరో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగితే ఇచ్చారు. అతను కొర్రాయిగేటు సమీపంలోనే దిగిపోయాడు. తర్వాత నవీన్ నరసన్నపేట వరకు వెళ్లిపోయారు. అక్కడ టిఫిన్ చేసి వా హనాన్ని పరిశీలిస్తే నగదు కనిపించలేదు. దీంతో కంగారు పడి.. తిరిగి మందస వచ్చి పోలీసులకు ఫిర్యా దు చేశారు. అయితే పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలి యని వ్యక్తి ఇదే బొలేరో వాహనంలో నుంచి ఏదో తీసుకుని వెళ్తున్నట్టు సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తోంది. దీనిపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నాలుగు సెక్షన్లతో పాలన) -
సిరిసిల్లలో ‘కిలేడీ’లు.. మాటలు కలిపి.. మనీ లాగేస్తూ..
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): మద్యం మత్తులో ఉన్నవారే వారి టార్గెట్. వారిని మాటల్లో దింపి మనీ తీసుకుని వెళ్లిపోవడంలో ఆరితేరిన ‘కిలేడీ’లు సిరిసిల్ల టౌన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిరిసిల్ల పాతమార్కెట్ ఏరియాలోని కల్లు కాంపౌండ్‌ను అడ్డాగా చేసుకుని ముగ్గురు మహిళలు, మరో వ్యక్తి మందుబాబుల జేబుల్లోంచి డబ్బులు కాజేస్తున్నట్లు తెలిసింది. దీనిపై వచ్చిన సమాచారంతో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలతో పాటు మరో వ్యక్తిపై నిఘావేశారు. ఎట్టకేలకు డబ్బులు కాజేస్తున్న విషయం నిజం అని తెలడంతో మహిళ ల ను విచారించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు వీరు మూడురోజుల క్రితం రూ.30వేలు దొంగతనం చేశారని, వారి చిరునామాలు, రోజువారి పనులు తెలుసుకునే పనిలో సిరిసిల్ల టౌన్ పోలీసులు నిమగ్నమై నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సిరిసిల్ల టౌన్ ఎస్సై అపూర్వరెడ్డిని వివరణ కోరగా మూడు రోజు ల క్రితం సమాచారం వచ్చిందని దీనిపై దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు. -
కోతి చేష్టలు.. కరెన్సీ వర్షం..!
లక్నో: కోతి అంటేనే చిలిపి చేష్టలకు పెట్టింది పేరు. ఇళ్లలో దూరి.. మనుషుల దగ్గర నుంచి వస్తువులు లాక్కేళ్లే అలవాటు బహుశా కోతికి మాత్రమే ఉందనుకుంటా. కోతి చేష్టలు చాలా సార్లు నవ్వు తెప్పించినా.. అప్పుడప్పుడు ప్రాణాల మీదకు కూడా తెస్తాయి. ఇదిగో ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ తుంటరి కోతి మనిషి చేతిలోంచి బ్యాగ్ లాక్కెళ్లింది. అంతటితో ఆగక దానిలో ఉన్నడబ్బు తీసి గాల్లోకి విసేరిసింది. దాంతో సదరు వ్యక్తి ప్రాణం పోయినంత పనైంది. ఎలాగోలా చివరకు కోతి చేతిలోంచి బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో చోటు చేసుకుంది. ఓ నడి వయసు వ్యక్తికి వికాస్ భవన్ రిజిస్ట్రీ ఆఫీస్ వద్దకు వచ్చాడు. అతడి చేతిలో ఓ బ్యాగ్ ఉంది. దానిలో నాలుగు లక్షల రూపాయల నగదు ఉంది. డబ్బు ఉండటంతో ఎంతో జాగ్రత్తగా వెళ్తున్న సదరు వ్యక్తిని కోతి గమనించింది. ఒక్క ఉదుటున అతడి దగ్గరకు వచ్చి చేతిలో బ్యాగ్ తీసుకుని తిరిగి చెట్టెక్కింది. (చదవండి: కోతులకూ కుటుంబ నియంత్రణ!) ఈ ఘటనతో పాపం పెద్దాయన పై ప్రాణాలు పైనే పోయాయి. కోతి డబ్బు బ్యాగ్ లాక్కెళ్లిందని కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. బ్యాగ్ లాక్కెళ్లిన కోతి అది చాలదన్నట్లు దాన్ని ఒపెన్ చేసి డబ్బులు బయటకు తీసి గాల్లోకి విసరడం ప్రారంభించింది. చుట్టు గుమికూడిన జనం ఆ డబ్బును ఏరుకునేందుకు ఎగబడ్డారు. మరి కొందరు మాత్రం బాధితుడికి సాయం చేయాలని భావించి కోతిని పట్టుకునేందుకు చెట్టు ఎక్కారు. అనేక ప్రయత్నాల తర్వాత చివరకు కోతి బ్యాగ్‌ను వదిలేసి వెళ్లింది. దాదాపు 12-14వేల రూపాయల డబ్బును వెదజల్లినట్లు తెలిసింది. దీని గురించి సమీప కొత్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
ఆన్లైన్ గేమ్స్ కోసం..విస్తుపోయే ఘటన
లక్నో : ఆన్లైన్ వీడియో గేమ్స్ కోసం ఓ బాలుడు ఏకంగా తండ్రి పేరిట పేటీఎం ఖాతాను క్రియేట్ చేసి రూ 35,000 తస్కరించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన నాలుగవ తరగతి చదివే బాలుడు తన తండ్రి మొబైల్ ఫోన్లో పేటీఎం ఖాతాను తెరిచి పెద్దమొత్తంలో డబ్బును విత్‌డ్రా చేశాడు. తన ఖాతాలో తనకు తెలీకుండా లావాదేవీలు జరగడంతో సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసిన బాధితుడికి తన కుమారుడే ఈ తతంగం నడిపించినట్టు తేలడంతో విస్తుపోయారు. దర్యాప్తు చేపట్టినప్పుడు పోలీసులతో పాటు తండ్రికి సైతం తమ చిన్నారిపై ఎలాంటి అనుమానం రాలేదు. లావాదేవీలపై ఎక్కడా ఆధారాలు లభించకపోవడంతో బాలుడిని ప్రశ్నించగా తాను చేసిన నిర్వాకం బయటపెట్టాడని పోలీసులు తెలిపారు. పలు ఆన్లైన్ వీడియో గేమ్‌లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో కొంతమొత్తం చెల్లించడం తప్పనిసరి కావడంతో తండ్రి మొబైల్ నుంచి పేటీఎం ఖాతాను క్రియేట్ చేసి దాన్ని ఆయన బ్యాంకు ఖాతాకు లింక్ చేశాడు. వీడియో గేమ్స్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో పేటీఎం వ్యాలెట్ ద్వారా డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ 35,000 వరకూ తండ్రి ఖాతా నుంచి ఆన్లైన్ గేమ్స్‌కు వెచ్చించాడు. అయితే తన ఖాతా నుంచి ఆయా మొత్తం తగ్గుతుండటంపై తండ్రికి అంతుపట్టకపోవడంతో బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరా తీయడంతో తానే ఇదంతా చేశానని చెప్పిన బాలుడు తన తండ్రి తనను శిక్షిస్తాడని భయపడ్డాడు. హజరత్‌గంజ్ పోలీసులు, సైబర్ సెల్ పోలీసులు బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ఇంటికి పంపారు. -
ఏటీఎమ్‌లో రూ. 30 లక్షలు దోచుకున్నారు
థానె: మహారాష్ట్రలోని థానె జిల్లా భివండిలో జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎమ్ నుంచి 29.70 లక్షల రూపాయలు దొంగలించిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎమ్‌లలో నగదు నింపే ఓ ప్రైవేట్ కంపెనీలో వీళ్లు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మార్చి 11వ తేది అర్ధరాత్రి దొంగతనం జరిగినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారు. ఏటీఎమ్ క్యాష్ బాక్స్ పాస్వర్డ్ తెలిసిన వారే దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. దీంతో ఏటీఎమ్‌లో నగదు నింపిన ఉద్యోగులను విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులు మార్చి 11న ఏటీఎమ్‌లో 36 లక్షల రూపాయల నగదును నింపారు. అదే రోజు అర్ధరాత్రి వచ్చి అందులోంచి నగదును కాజేశారు. నిందితులను వికాస్ ఎడె, సురేష్ కొకిట్కర్, వినోద్ వరాడె, నీలేష్ గోటిపముల్, మోహన్ జంజె, రాజేష్ పుల్పగారె, ఇర్ఫాన్ ఖయూం ఖాన్‌లుగా గుర్తించారు. -
విలాసాల కోసమే చోరీ
గుడివాడలో సీఎంఎస్ నగదు అపహరణ కేసును ఛేదించిన పోలీసులు నలుగురు నిందితుల అరెస్ట్ గుడివాడ అర్బన్ : పట్టణంలో గతనెలలో జరిగిన రూ.11 లక్షల నగదు అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులు మహ్మద్ ఉమర్ అలియాస్ ఉమర్ఖాన్(సీఎంఎస్ గార్డు, ఉయ్యూ రు), మహ్మద్ నయీం అలియాస్ చోటు బాబు(ఉయ్యూరు), కడారి శివవరప్రసాద్(భవానీపురం, విజయవాడ), షేక్ చాంద్‌బాషా(పాత రాజరాజేశ్వరిపేట, విజయవాడ)లను డీఎస్పీ జి.నాగన్న నేతృత్వంలో వన్‌టౌన్ ఎస్హెవో ఎ.బి.జె.తిలక్, ఎస్సై రాము, సీసీఎస్ ఏఎస్సై స్వామిదాసు ఆదివారం అరెస్ట్ చేశారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగన్న ఈ వివరాలు వెల్లడించారు. విలాసాల కోస మే ఈ నలుగురూ చోరీకి పాల్పడ్డారన్నారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. పట్టణంలో యాక్సిస్ బ్యాంకులో కస్టోడియన్ గా పనిచేస్తున్న లక్కరాజు రాంప్రసాద్ గతనెల 21న బ్యాంకు నుంచి రూ.17 లక్షల నగదును ఏటీఎంల లో డిపాజిట్ చేసేందుకు సీఎంఎస్ వాహనంలో తీసుకెళ్లాడు. బంటుమిల్లి రోడ్డులోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో రూ.6 లక్షలు డిపాజిట్ చేశాడు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా సీంఎఎస్ వాహనంతో రాజేంద్రనగర్‌లోని తన ఇంటికి నగదుతో చేరుకున్నాడు. మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో భోజనం చేసి టీవీ చూస్తున్నాడు. అదే సమయంలో సీఎంఎస్ వాహనం సెక్యురిటీ గార్డు మహ్మద్ ఉమర్‌కు బావమరిది అయిన మహ్మద్ నయీం వచ్చి, ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. బ్యాచిలర్స్‌కు ఇల్లు ఇవ్వమని రాంప్రసాద్ బదులిచ్చాడు. నయీం తనతో తెచ్చుకున్న కారం పొట్లాం తీసి రాంప్రసాద్ ముఖంపై చల్లి పక్కనే ఉన్న నగదు బ్యాగును పట్టుకుని పారిపోయాడు. అప్పటికే బయట బైక్‌పై సిద్ధంగా ఉన్న కడారి శివ వరప్రసాద్‌తో కలిసి గన్నవరం వైపు పరారయ్యాడు. మూడు నెలలుగా పథకం కస్టోడియన్ రాంప్రసాద్ మూడు నెలల నుంచి తన ఇంటికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు తీసుకెళ్తున్నాడు. ఈ విషయాన్ని సీఎంఎస్ వాహనం లో గార్డుగా పనిచేస్తున్న మహ్మద్ ఉమర్ కనిపెట్టా డు. తన బావమరిది మహ్మద్ నయీంకు ఈ విషయాన్ని వివరించాడు. నగదు అపహరిస్తే బాగా బతకవచ్చని నమ్మించాడు. దీంతో నయీం తన స్నేహితులైన కడారి శివవరప్రసాద్, చాన్బాషాలకు విష యం తెలిపి తనతో కలుపుకున్నాడు. ఈ ఘటనకు ముందు మూడు నెలల నుంచి మహ్మద్ నయీం పట్టణంలోని యాక్సిస్ బ్యాంకు వద్ద సైకిల్ షాపును నిర్వహిస్తూ రాంప్రసాద్ కదలికలను ఎప్పటికప్పు డు గమనిస్తున్నాడు. దొంగతనం ఘటనకు మూడు రోజుల ముందు నుంచి ఇల్లు అద్దెకు కావాలంటూ నయీం, శివవరప్రసాద్లు రాంప్రసాద్ ఇంటికి వ చ్చి వెళ్తున్నారు. గతనెల 21న మరోసారి వచ్చారు. నయీం అతడి ఇంట్లోకి వెళ్లి పరిస్థితి అనుకూలంగా ఉండటంతో కళ్లలో కారం చల్లి రూ.11 లక్షల నగదు దొంగిలించాడు. రెండు ద్విచక్ర వాహనాలతో సిద్ధంగా.. ముఠా సభ్యులు ముందుగా రూపొందించుకు న్న పథకం ప్రకారం రాంప్రసాద్ ఇంటివద్ద ద్విచక్రవాహనంతో శివవరప్రసాద్ సిద్ధంగా ఉన్నాడు. చాన్‌బాషా నెహ్రూ చౌక్ వైపు మరో ద్విచక్రవాహనంతో సిద్ధంగా ఉన్నాడు. నయీం నగదు బ్యాగ్‌ను దొంగిలించి బయటకు వచ్చి శివవరప్రసాద్ బైక్ ఎక్కాడు. ఇద్దరూ గన్నవరం వైపు పారిపోయారు. ప్రధాన నిందితుడు ఉమర్.. ఉయ్యూరుకు చెందిన మహ్మద్ ఉమర్ మూడు నెలల క్రితం సీఎంఎస్ వాహనానికి గార్డుగా ఉద్యోగంలో చేరాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. వేరే పనిచేయలేక తన బావమరిది నయీంను దొంగతనానికి ఉసిగొలిపాడు. రాంప్రసాద్ కదలికలను నయీంకు ఫోన్ ద్వారా ఉమర్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ దొంగతనం చేయడానికి సహకరించాడని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందన్నారు. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు జరిపి, నిందితులను పట్టుకున్నామని ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 10,46,800 రూపాయల నగదు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు, రిఫ్రిజేటర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సిబ్బందికి అభినందనలు ఈ కేసులో మొదటి నుండి చాకచక్యంగా ఉంటూ నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన వన్‌టౌన్ సీఐ తిలక్, ఎస్సై రాము, సీసీఎస్ ఏఎస్సై ఎస్.స్వామిదాసు, హెడ్ కానిస్టేబుళ్లు కె.బలరాం, వి.వెంకట్రావు, ఆకుల శ్రీను, రాంబాబు, కానిస్టేబుళ్లు కొ లు సు శ్రీనివాసరావు, బాబూరావు, జి.శ్రీనివాసరావులను డీఎస్పీ నాగన్న అభినందించారు. త్వరలో వీరికి రివార్డులు అందజేస్తామని పేర్కొన్నారు.