రూ.3.5 లక్షలు చోరీ | Driver Complaint Rs 3 Lakh Stolen From Bolero Vehicle | Sakshi
Sakshi News home page

రూ.3.5 లక్షలు చోరీ

Apr 26 2022 12:50 PM | Updated on Apr 26 2022 1:18 PM

Driver Complaint Rs 3 Lakh Stolen From Bolero Vehicle - Sakshi

బొలేరో వాహనం వద్ద గుర్తు తెలియని వ్యక్తి

మందస: మండలంలోని హరిపురం నుంచి బయల్దేరిన బొలేరో వాహనం నుంచి రూ.3.5 లక్షలు చోరీ జరిగినట్లు డ్రైవర్‌ రట్టి నవీన్‌ మందస పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. బాలాజీ కాజూ ఫ్యాక్టరీ యజమా ని కోరాడ సునీల్‌ జీడి పిక్కలు కొనుగోలు చేయడానికి డ్రైవర్‌ నవీన్‌కు రూ.3.5 లక్షలు ఇచ్చి పంపించారు. నవీన్‌ తన బొలేరో వాహనంలో హరిపురం నుంచి బయల్దేరి కమలాపురం సమీపంలోని పెట్రో ల్‌ బంకులో ఆయిల్‌ కొట్టించారు.

అక్కడ ఎవరో ఓ వ్యక్తి లిఫ్ట్‌ అడిగితే ఇచ్చారు. అతను కొర్రాయిగేటు సమీపంలోనే దిగిపోయాడు. తర్వాత నవీన్‌ నరసన్నపేట వరకు వెళ్లిపోయారు. అక్కడ టిఫిన్‌ చేసి వా హనాన్ని పరిశీలిస్తే నగదు కనిపించలేదు. దీంతో కంగారు పడి.. తిరిగి మందస వచ్చి పోలీసులకు ఫిర్యా దు చేశారు. అయితే పెట్రోల్‌ బంక్‌ వద్ద గుర్తు తెలి యని వ్యక్తి ఇదే బొలేరో వాహనంలో నుంచి ఏదో తీసుకుని వెళ్తున్నట్టు సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తోంది. దీనిపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

(చదవండి: నాలుగు సెక్షన్లతో పాలన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement