లక్నో: కోతి అంటేనే చిలిపి చేష్టలకు పెట్టింది పేరు. ఇళ్లలో దూరి.. మనుషుల దగ్గర నుంచి వస్తువులు లాక్కేళ్లే అలవాటు బహుశా కోతికి మాత్రమే ఉందనుకుంటా. కోతి చేష్టలు చాలా సార్లు నవ్వు తెప్పించినా.. అప్పుడప్పుడు ప్రాణాల మీదకు కూడా తెస్తాయి. ఇదిగో ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ తుంటరి కోతి మనిషి చేతిలోంచి బ్యాగ్ లాక్కెళ్లింది. అంతటితో ఆగక దానిలో ఉన్నడబ్బు తీసి గాల్లోకి విసేరిసింది. దాంతో సదరు వ్యక్తి ప్రాణం పోయినంత పనైంది. ఎలాగోలా చివరకు కోతి చేతిలోంచి బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో చోటు చేసుకుంది. ఓ నడి వయసు వ్యక్తికి వికాస్ భవన్ రిజిస్ట్రీ ఆఫీస్ వద్దకు వచ్చాడు. అతడి చేతిలో ఓ బ్యాగ్ ఉంది. దానిలో నాలుగు లక్షల రూపాయల నగదు ఉంది. డబ్బు ఉండటంతో ఎంతో జాగ్రత్తగా వెళ్తున్న సదరు వ్యక్తిని కోతి గమనించింది. ఒక్క ఉదుటున అతడి దగ్గరకు వచ్చి చేతిలో బ్యాగ్ తీసుకుని తిరిగి చెట్టెక్కింది. (చదవండి: కోతులకూ కుటుంబ నియంత్రణ!)
ఈ ఘటనతో పాపం పెద్దాయన పై ప్రాణాలు పైనే పోయాయి. కోతి డబ్బు బ్యాగ్ లాక్కెళ్లిందని కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. బ్యాగ్ లాక్కెళ్లిన కోతి అది చాలదన్నట్లు దాన్ని ఒపెన్ చేసి డబ్బులు బయటకు తీసి గాల్లోకి విసరడం ప్రారంభించింది. చుట్టు గుమికూడిన జనం ఆ డబ్బును ఏరుకునేందుకు ఎగబడ్డారు. మరి కొందరు మాత్రం బాధితుడికి సాయం చేయాలని భావించి కోతిని పట్టుకునేందుకు చెట్టు ఎక్కారు. అనేక ప్రయత్నాల తర్వాత చివరకు కోతి బ్యాగ్‌ను వదిలేసి వెళ్లింది. దాదాపు 12-14వేల రూపాయల డబ్బును వెదజల్లినట్లు తెలిసింది. దీని గురించి సమీప కొత్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment