కోతుల గుంపు దాడి.. భయాందోళనతో బీజేపీ నాయకుడి భార్య మృతి | Terror Of Monkeys BJP Leader Wife Fell From The Roof In UP | Sakshi
Sakshi News home page

కోతుల గుంపు దాడి.. భయాందోళనతో బీజేపీ నాయకుడి భార్య మృతి

Published Tue, Sep 7 2021 9:07 PM | Last Updated on Tue, Sep 7 2021 9:37 PM

Terror Of Monkeys BJP Leader Wife Fell From The Roof In UP - Sakshi

లక్నో: వానరాల దాడిలో బీజేపీ నాయకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొహల్ల అల్కాలలోని బీజేపీ నాయకుడు అనిల్‌ కుమార్‌ చౌహాన్‌, సుష్మాదేవి (50) భార్యాభర్తలు. భార్య సుష్మ జిల్లా పంచాయతీ సభ్యురాలు. ఆమె మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి మూడో అంతస్తులో నిలుచుని ఉంది. ఈ సమయంలో కోతుల మంద దాడి చేసింది. 
చదవండి: కర్ణాటక కీలక నిర్ణయం.. కేరళకు రాకపోకలు వద్దు

ఈ హఠాత్పరిణామానికి భయాందోళన చెందిన ఆమె కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భవనం నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. మూడో అంతస్తు నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుష్మ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించేది. 
చదవండి: బట్టతల శాపం కాదు అదృష్టం! ఈ ఉత్సవం మీకోసమే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement