Shamli district
-
కోతుల గుంపు దాడి.. భయాందోళనతో బీజేపీ నాయకుడి భార్య మృతి
లక్నో: వానరాల దాడిలో బీజేపీ నాయకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొహల్ల అల్కాలలోని బీజేపీ నాయకుడు అనిల్ కుమార్ చౌహాన్, సుష్మాదేవి (50) భార్యాభర్తలు. భార్య సుష్మ జిల్లా పంచాయతీ సభ్యురాలు. ఆమె మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి మూడో అంతస్తులో నిలుచుని ఉంది. ఈ సమయంలో కోతుల మంద దాడి చేసింది. చదవండి: కర్ణాటక కీలక నిర్ణయం.. కేరళకు రాకపోకలు వద్దు ఈ హఠాత్పరిణామానికి భయాందోళన చెందిన ఆమె కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భవనం నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. మూడో అంతస్తు నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుష్మ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించేది. చదవండి: బట్టతల శాపం కాదు అదృష్టం! ఈ ఉత్సవం మీకోసమే.. -
దారుణం: భార్య ప్రాణం తీసిన సలాడ్..
లక్నో: భోజనంలో సలాడ్ అందించడం ఆలస్యమైందని భర్త తన భార్య దాడి చేసి హత్య చేయడమే కాకుండా కుమారుడిని తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. ఈ ఘటన షామ్లి జిల్లా గోగవన్ జలాల్పూర్లో చోటుచేసుకుంది. ఘటన జరిగిన అనంతరం నిందితుడు వెంటనే పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మురళి (45), సుదేశ్ భార్యాభర్తలు. రాత్రి భోజనంలో రోజు మాదిరిగా పండ్ల సలాడ్ అందిస్తుండేది. సోమవారం కూడా సలాడ్ పెట్టాలని భార్యను అడిగాడు. అయితే ఆమె వేరే పనిలో ఉండి సలాడ్ వడ్డించడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి లోనైన మురళి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన మురళి వెంటనే అక్కడ కొడవలి తీసుకుని భార్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. తేరుకున్న అనంతరం నిందితుడు మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. రక్తపు మడుగులో ఉన్న సుదేశ్, ఆమె కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందగా కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చదవండి: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ చదవండి: లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య -
టౌటే ఎఫెక్ట్: కుప్పకూలిన ఇల్లు.. నలుగురి ప్రాణాలు
లక్నో: టౌటే తుఫాను ప్రభావంతో ఎడతెరపి లేకుండ కురుస్తున్న వర్షంతో ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు భయాందోళనగా మారాయి. ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ వర్షం ప్రభావంతో ఓ ఇల్లు ఆ కుటుంబమంతా మృత్యువాత పడింది. అయితే ఆ కుటుంబంలోని ఇద్దరు బయటకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న తల్లి అఫ్సానా, ఆమె ఇద్దరు కుమార్తెలు, కుమారుడు దుర్మరణం చెందారు. ఇంటి పైకప్పు వారిపై పడడంతో శిథిలాల కింద వారు శవాలుగా తేలారు. సమాచారం అందుకున్న వెంటనే చేరుకున్న పోలీసులు వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఇంట్లోని తండ్రి, మరో కుమారుడు బయటకు వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్యాన్స్‌లు చేశారు.. సస్పెండ్ అయ్యారు
ముజఫర్‌నగర్ : విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక థానాభవన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కర్‌వీర్‌సింగ్ సబ్ ఇన్స్పెక్టర్గా, నితిన్ కుమార్, సోనూలు కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. కాగా శనివారం డ్యూటీలో ఉండగానే స్థానికంగా నిర్వహించిన ఓ ప్రైవేట్ వేడుకకు హాజరై బోజనం చేసి డ్యాన్స్‌లు చేయడం వివాదాస్పదమయింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఎస్పీ అజయ్‌కుమార్ ఆ ముగ్గురిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. -
కల్తీ మద్యం సేవించి ఐదుగురి మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని షమ్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి గడిచిన 48 గంటల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారని అధికారులు వెల్లడించారు. షమ్లీ, కర్నాల్ (హర్యానా) జిల్లాల్లో దాదాపు 15 మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు దేశీ మద్యం తాగారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటనపై షమ్లీ జిల్లా మేజిస్ర్టేట్ ఇంద్ర విక్రం సింగ్ విచారణకు ఆదేశించారు. గ్రామంలో నాటు సారా తాగి స్ధానికులు మరణించారన్న సమాచారంతో తాము గ్రామానికి చేరుకోగా బాధితులు కల్తీ మద్యంపై ఫిర్యాదు చేయలేదన్నారు. పోస్ట్‌మార్టం నివేదికతో వాస్తవాలు వెలుగుచూశాయని షమ్లీ ఎస్పీ వెల్లడించారు. పొరుగున ఉన్న హర్యానాలో తక్కువ ధరకు దేశీ మద్యం లభ్యం కావడంతో అక్కడి నుంచి కల్తీ మద్యం అక్రమంగా సరఫరా అవుతోందని పోలీసులు భావిస్తున్నారు. కల్తీ మద్యంపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత వినోద్ నిర్వాల్ డిమాండ్ చేశారు. -
వీడియో కాన్ఫెరెన్స్ పెళ్లి!
ముజాఫర్‌నగర్: సాంకేతిక పరిజ్ఞానంతో చాలా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోతోంది. టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడమే కాదు ఏకం చేస్తోంది కూడా. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో జరిగిన పెళ్లి క్రతువే ఇందుకు నిదర్శనం. ముస్లిం యువతికి సౌదీ అరేబియాలోని వరుడితో వీడియో కాన్ఫెరెన్స్‌లో ఈ తతంగం జరిపించారు. వరుడు సమయానికి ఇక్కడి చేరుకునే పరిస్థితులు లేకపోవడంతో సాంకేతికత సహాయంలో మత పెద్దలు పెళ్లి క్రతువు నిర్వహించారు. ముందుగా నిశ్చయించిన ముహుర్తం ప్రకారం మే 5న పెళ్లి జరగాల్సివుంది. అయితే పెళ్లికొడుకు సమయానికి చేరుకునే పరిస్థితులు లేకపోవడంతో టెక్నాలజీని ఆశ్రయించినట్టు వధువు తండ్రి రెహాన్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం వివాహ క్రతువు జరిపినట్టు వెల్లడించారు. వధూవరుల బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి తంతు జరిపించడం విశేషం. -
‘నేను గెలిస్తే కర్ఫ్యూ విధిస్తా’
షామ్లి: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతల ప్రకటనలు వివాదస్పదం అవుతున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ రాణా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తనను గెలిపిస్తే కైరానా, దియోబంద్, మొరదాబాద్ లలో కర్ఫ్యూ విధిస్తానని ఆయన ప్రకటించారు. షామ్లి జిల్లా థానా భవాన్ ప్రాంతంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘మరోసారి నేను ఎన్నికల్లో గెలిస్తే కైరానా, దియోబంద్, మొరదాబాద్ లలో కర్ఫ్యూ విధిస్తాను. మార్చి 11న షామ్లి నుంచి థానా భవాన్ వరకు విజయయాత్ర నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉండండి. భారత్ మాతా కి జై’ అని వీడియోలో ఉంది. అయితే తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని సురేశ్ రాణా చెప్పారు. తాను గెలిస్తే ఈ మూడు ప్రాంతాల నుంచి బలవంతపు వలసలకు కారణమవుతున్న రౌడీమూకలను అణచివేసేందుకు కర్ఫ్యూ విధిస్తానని అన్నట్టు వెల్లడించారు. -
'అలాంటివి కుదరవు.. కాదంటే జైలుకే'
ముజఫర్ నగర్: ఇకపై ఎలాంటి వేడుకల్లోనైనా గాల్లోకి కాల్పులు జరపడం ఆపేయాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లా పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి కాల్పుల కారణంగా గత నెలలో ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలుకోల్పోయిన నేపథ్యంలో మున్ముందు అలాంటివాటికి తావు లేకుండా చేసేందుకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి వేడుక జరిగిన సామూహికంగా సంబరాలు చేసుకుంటూ గాల్లోకి కాల్పులు జరపడం అక్కడి వారు చేసే సర్వసాధరణమైన పని. అయితే, ఇప్పటి వరకు పోలీసులు పెద్దగా పట్టించుకోకుండా ఉన్నప్పటికీ మొన్న బాలుడు చనిపోవడంతో ఆ విషయం కాస్త దేశ వ్యాప్తంగా ప్రచారమై శాంతిభద్రతలను పలువురు ప్రశ్నించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా సీరియస్ గా స్పందించారు. దీంతో ఛీవాట్లు తిన్న పోలీసు ఉన్నతాధికారులు ఘటన చోటుచేసుకున్న షామ్లీ జిల్లాలో తుపాకులను ఎలా పడితే అలా ముఖ్యంగా గాల్లోకి కాల్పులు జరపడాన్ని రద్దు చేస్తూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. -
తల్లిని కట్టేసి ... కుమార్తెని అపహరించి ...
ముజఫర్‌నగర్: పొలంలో తల్లికి చేదోడుగా పని చేస్తున్న 20 ఏళ్ల యువతిని అపహరించేందుకు ముగ్గురు యువకులు యత్నించారు. ఆ క్రమంలో తల్లి అడ్డుపడింది. దాంతో ఆగ్రహించి సదరు యువకులు... ఆమెను చెట్టుకు కట్టేశారు. అనంతరం ఆమె కుమార్తెను ఎత్తుకుపోయి... ఆపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ షామిల్ జిల్లాలోని సకోటి గ్రామంలో ఈ నెల 25వ తేదీన చోటు చేసుకుంది. బాధితురాలిని గురువారం గ్రామస్థులు రక్షించారు. అనంతరం వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులలో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు రజనీష్, సచిన్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా... ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయిందని చెప్పారు. -
92 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం, పదేళ్ల జైలు
ముజఫర్ నగర్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఉన్మాది 92ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి చివరకు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని షిమ్లీ జిల్లా కిండ్లా పట్టణంలో 26ఏళ్ల మంతూ అనే యువకుడు నాలుగేళ్ల పొరుగున నివసిస్తున్న ఓ వృద్ధురాలిపై ఆమె నివాసంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారించిన అడిషనల్ డిస్ట్రిక్ సెషన్ జడ్జి శ్యామ్ కుమార్ .... నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.55వేల జరిమానా కూడా విధించారు. కాగా బాధితురాలు చనిపోయినా ఆమె వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. 2011 ఆగస్ట్ 10న ఈ సంఘటన చోటుచేసుకుంది. -
8 నెలల క్రితం గ్యాంగ్‌రేప్... ఇప్పుడు వెలుగులోకి...
వికలాంగురాలైన మహిళ (25)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అయితే విషయం దాదాపు ఎనిమిది నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. అది సదరు మహిళ గర్భవతి కావడంతో అసలు విషయం బయటపడింది. దాంతో వికలాంగురాలిని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ సంఘటన ఉత్తరప్రదేశ్ షామిల్ జిల్లా కైరానా పట్టణంలో చోటు చేసుకుంది. నిందితులు మహబూబ్, మొబిన్, మున్నావర్, నూర్ మహ్మద్‌లుగా గుర్తించినట్లు... వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో వికలాంగురాలిపై పైన పేర్కొన్న సదరు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విషయాన్ని బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. దాంతో ఆమె మిన్నుకుండిపోయింది. ఆ క్రమంలో ఇటీవల ఆ వికలాంగురాలైన మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె గర్బవతి అని వైద్యులు తల్లిదండ్రులకు వెల్లడించారు. దాంతో వారు వికలాంగురాలిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
మైనర్‌పై అత్యాచారం:నిందితుని 10 ఏళ్ల జైలు శిక్ష
మైనర్ బాలిక కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు (26)కు 10 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ అడిషినల్ జిల్లా సెషన్స్ జడ్జి చంద్ర భూషణ్ సింగ్ తీర్పు వెలువరించారు. దానితోపాటు నిందితుడికి రూ. 45 వేల జరిమాన విధించారు. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని షామిల్ జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో మైనర్ బాలిక ఆచూకీ తెలియకుండా పోయింది. దాంతో తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ మైనర్ బాలిక తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మూడు నెలల అనంతరం ఆ మైనర్ బాలికను పోలీసుల కనుగొన్నారు. ఆ బాలిక పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించింది. దాంతో నిందితుని పోలీసుల కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో నిందితుడు రాజుకు శిక్షను ఖరారు చేస్తు జడ్జి తీర్పు వెలువరించారు.