‘నేను గెలిస్తే కర్ఫ్యూ విధిస్తా’ | Will impose curfew in Kairana, Deoband, Moradabad if I win, says BJP MLA Suresh Rana | Sakshi
Sakshi News home page

‘నేను గెలిస్తే కర్ఫ్యూ విధిస్తా’

Published Mon, Jan 30 2017 9:36 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

‘నేను గెలిస్తే కర్ఫ్యూ విధిస్తా’

‘నేను గెలిస్తే కర్ఫ్యూ విధిస్తా’

షామ్లి: ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతల ప్రకటనలు వివాదస్పదం అవుతున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సురేశ్‌ రాణా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తనను గెలిపిస్తే కైరానా, దియోబంద్, మొరదాబాద్ లలో కర్ఫ్యూ విధిస్తానని ఆయన ప్రకటించారు. షామ్లి జిల్లా థానా భవాన్ ప్రాంతంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘మరోసారి నేను ఎన్నికల్లో గెలిస్తే కైరానా, దియోబంద్, మొరదాబాద్ లలో కర్ఫ్యూ విధిస్తాను. మార్చి 11న షామ్లి నుంచి థానా భవాన్ వరకు విజయయాత్ర నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉండండి. భారత్ మాతా కి జై’ అని వీడియోలో ఉంది. అయితే తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని సురేశ్‌ రాణా చెప్పారు. తాను గెలిస్తే ఈ మూడు ప్రాంతాల నుంచి బలవంతపు వలసలకు కారణమవుతున్న రౌడీమూకలను అణచివేసేందుకు కర్ఫ్యూ విధిస్తానని అన్నట్టు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement