Suresh Rana
-
దళితుడి ఇంట మంత్రి పార్శిల్ భోజనం
సాక్షి, అలీఘర్ : యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని యూపీ క్యాబినెట్లో మరో మంత్రి వివాదంలో కూరుకుపోయారు. దళితులను పార్టీకి చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా యూపీ మంత్రి దళితుని ఇంట భోజనం చేయాల్సి ఉండగా, క్యాటరర్ నుంచి తెప్పించిన భోజనం ఆరగించడంతో వివాదం నెలకొంది. యూపీ మంత్రి సురేష్ రాణా వివాదానికి కేంద్ర బిందువయ్యారు. అలీఘర్‌లోని లోహగఢ్‌లో సోమవారం రాత్రి మంత్రి రాణా ఓ దళిత సోదరుడి ఇంట వారి కుటుంబసభ్యులతో కలిసి విందు ఆరగించారు. అయితే ఆ తర్వాత విడుదలైన వీడియోల్లో మంత్రి ఆరగించిన విందు ముందుగా ఆర్డర్ ఇచ్చి తెప్పించినదని, దళిత కుటుంబం స్వయంగా వండివార్చింది కాదని వెల్లడైంది. ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారడంతో మంత్రి రాణా ఇబ్బందుల్లో పడ్డారు. అయితే మంత్రి తమ ఇంటికి విందుకు వస్తున్నారని తనకు చివరి నిమిషం వరకూ తెలియదని..ఆహారం..మంచినీరు..పాత్రలు అన్నీ బయటనుంచి తెప్పించారని మంత్రికి ఆతిథ్యం ఇచ్చిన దళితుడు రజనీష్‌కుమార్ చెప్పారు. మంత్రితో పాటు పలువురు ఇతర బీజేపీ నేతలు రెస్టారెంట్ నుంచి తెప్పించిన విందు ఆరగిస్తూ వీడియోలో కనిపించారు. పనీర్ ఐటెమ్స్, దాల్‌మఖానీ, పులావ్, తండూరీ రోటీ, మినరల్ వాటర్ బాటిల్స్ టేబుళ్లపై కనిపించాయి. మంత్రి బృందమే వాటన్నింటినీ ఆర్డర్ చేసి తెప్పించిందని గ్రామస్థులు చెప్పారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి రాణా తోసిపుచ్చారు. తన పర్యటన గురించి దళిత కుటుంబానికి సమాచారం ఉందన్నారు. -
ముజఫర్‌నగర్ అల్లర్ల కేసు : బీజేపీ నేతలకు వారెంట్లు
ముజఫర్‌నగర్ : ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ముజఫర్‌నగర్ అల్లర్ల కేసుల్లో అధికార బీజేపీకి చెందిన కీలక సభ్యులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. వారిలో ఉత్తరప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతోన్న సురేశ్ రాణా, కేంద్ర మాజీ మంత్రి సంజీవ్ బల్యాన్, ఎమ్మెల్యేలు సంగీత్ సోమ్, ఉమేశ్ మాలిక్ తదితరులున్నారు. 2013 ఆగస్టు-సెప్టెంబర్‌లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 60 మంది ప్రాణాలు కోల్పోగా, 40 వేల మంది నిరాశ్రయిలయ్యారు. రెచ్చగొట్టి.. ఉసిగొలిపారు : పైన పేర్కొన్న బీజేపీ నాయకులు.. ముజఫర్‌నగర్‌లో ఒక వర్గానికి చెందిన యువతను హింసకు పురిగొల్పేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించడమే కాక ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం కల్పించారని అల్లర్లపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆరోపించింది. సిట్ వాదనతో ఏకీభవించిన మెజిస్ట్రేట్ మధు గుప్తా.. నిందితులు జనవరి 19న కోర్టుకు హాజరుకావాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ప్రజా ప్రతినిధులు కావడంతో : ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుల్లో అత్యధికులు ప్రస్తుతం చట్టసభ్యులుగా కొనసాగుతున్న దరిమిలా వారిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసికావడంతో సీఎం యోగి అంగీకరించారు. ప్రభుత్వ అనుమతి లభించిన దరిమిలా సదరు నేతల విచారణ ప్రక్రియ ముమ్మరం కానుంది. నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన బీజేపీ ప్రముఖుల్లో కొందరు.. -
‘నేను గెలిస్తే కర్ఫ్యూ విధిస్తా’
షామ్లి: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతల ప్రకటనలు వివాదస్పదం అవుతున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ రాణా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తనను గెలిపిస్తే కైరానా, దియోబంద్, మొరదాబాద్ లలో కర్ఫ్యూ విధిస్తానని ఆయన ప్రకటించారు. షామ్లి జిల్లా థానా భవాన్ ప్రాంతంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘మరోసారి నేను ఎన్నికల్లో గెలిస్తే కైరానా, దియోబంద్, మొరదాబాద్ లలో కర్ఫ్యూ విధిస్తాను. మార్చి 11న షామ్లి నుంచి థానా భవాన్ వరకు విజయయాత్ర నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉండండి. భారత్ మాతా కి జై’ అని వీడియోలో ఉంది. అయితే తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని సురేశ్ రాణా చెప్పారు. తాను గెలిస్తే ఈ మూడు ప్రాంతాల నుంచి బలవంతపు వలసలకు కారణమవుతున్న రౌడీమూకలను అణచివేసేందుకు కర్ఫ్యూ విధిస్తానని అన్నట్టు వెల్లడించారు.