డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం | degree student suicide attempt in prakasam district | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Published Thu, Dec 31 2015 6:49 PM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

degree student suicide attempt in prakasam district

సింగరాయకొండ : కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యువకుడు కళాశాల సమీపంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే గేట్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఎమ్. ప్రదీప్ (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి బయలుదేరాడు. ఆ క్రమంలో కళాశాల సమీపంలోని రైల్వే గేట్‌ వద్ద వంటిపై కిరోసిన్ పోసుకొని ప్రదీప్ నిప్పంటించుకున్నాడు.

ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108లో ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రేమ విఫలం కావడంతో ప్రదీప్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement