ఆగివున్న టూరిస్టు బస్సును ఢీకొట్టిన లారీ | Two killed 18 injured in road accident at prakasam district | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 8 2013 8:36 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

రాష్ట్రంలో రోజురోజుకీ రోడ్డుప్రమాదాల ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రైవేటు బస్సులలో ప్రయాణించాలంటేనే జనానికి భయం వేస్తోంది. మెన్న జరిగిన వోల్వో బస్సు ఘటన, రైల్వే ఘటనలు మరవకముందే మరో బస్సు దుర్ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని మన్నేరు బ్రిడ్జి వద్ద శుక్రవారం సంభవించింది. ఈ రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 18మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఆగివున్న టూరిస్టు బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ టూరిస్టు బస్సు పశ్చిమబెంగాల్‌కు చెందినట్టు పోలీసులు గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement