పంతం నీదా..నాదా..సై!
సింగరాయకొండ: ఏరా ఆంజనేయులూ మా లక్ష్మిని ఏదో కామెంట్ చేశావంటా! జాగ్రత్త తాట తీస్తా
ఏందిరా హనుమంతూ నాతోనే పెట్టుకుంటావా.. నీ కూతురు జోలికి నేను రాలా. ఆమె అబద్ధం చెబుతోంది. నేను కూడా మా అమ్మానాన్నను తీసుకొస్తా అంటూ వేగంగా వెళ్లిపోయాడు ఆంజనేయులు.
సీన్ కట్ చేస్తే..
ఆటువైపు 25 వానరాలు.. ఇటు వైపు పాతికవానరాలు సింగరాయకొండ రైల్వేస్టేషన్ రోడ్డులో గురువారం యుద్ధానికి సన్నద్ధం అయ్యాయి. ఒకవర్గంపై మరో వర్గం కాలు దువ్వాయి.. పళ్లు ఇకిలించాయి.. దుమ్ము లేపాయి..తొడకొట్టాయి!
రేయ్ కాంతారావూ నీ కొడిక్కి చెప్పు.. హద్దుల్లో ఉండకపోతే కొరికి పారేస్తా
వార్నింగు ఇచ్చాడు హనుమంతుని పేరుతో ఉన్న వానరం
కాంతారావు కూడా రెచ్చిపోయాడు తన సైన్యంతో అటువైపు దూకాడు.
ఇదంతా చూస్తున్న జనం నిశ్చేష్టులయ్యారు. ఎప్పుడు వాటిమధ్య భీకర యుద్ధం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. చివరకు వాటి మధ్య కాంప్రమైజ్ కుదిరింది. ఏ కోతి దారిన ఆ కోతి వెళ్లింది.
–సింగరాయకొండ