ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం కలికివాయి సమీపంలో తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా, 11మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించినట్టు సమాచారం. వీరంతా ఉలవపాడు మండలం చాగిచర్లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.