సాక్షి, వరంగల్/వర్ధన్నపేట: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు..ఎప్పటిలా బుధవారం కూడా ఉపాధిని వెతుక్కుంటూ బయలుదేరారు. కానీ ఎప్పటిలా వారు క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. ఉదయాన్నే వారు ప్రయాణిస్తున్న ఆటోను మృత్యు శకటంలా దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టింది.
ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నా రు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 7.12 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఆటోను ఢీకొట్టిన లారీ 30 మీటర్లకు పైగా దానిని ఈడ్చుకెళ్లడంతో ఆటో డ్రైవర్ సహా ఆరుగురు దుర్మరణం చెందారు. శరీరాలు ఛిద్రం కావడంతో ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసి భీతావహంగా మారింది. అతి వేగం, లారీ డ్రైవర్ నిర్ల క్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించామని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు.
ఉపాధి కోసం వెళుతుండగా..
రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన సురేశ్ కురేరీ కుటుంబం పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి కర్మన్‌ఘాట్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకుంది. అక్కడ డెయిరీ పరిశ్రమల్లో కూలీలుగా పనిచేసే వీరు..కొంతకాలంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ తేనె తుట్టెల నుంచి తేనెను తీసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే నెలరోజుల క్రితం వరంగల్‌లోని ఎల్‌బీనగర్‌కు వచ్చిన సురేశ్ కురేరీ కుటుంబం అక్కడ డేరాలు వేసుకొని తేనె అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.
మంగళవారం వరంగల్ నుంచి తొ ర్రూర్ వరకు వెళ్లిన వీరు ఇల్లంద గ్రామానికి కొంతదూరంలో ఉన్న తేనె తుట్టెల నుంచి తేనెను సేకరించి ఆ హైవేపైనే అమ్మారు. బుధవారం కూడా వరంగల్ బస్టాండ్ వద్ద ఉదయం 6.30 ప్రాంతంలో ఆటో కిరాయికి మాట్లాడుకొని తొర్రూర్‌కు బ యలుదేరారు.
సురేశ్ కురేరి (43) వెంట అతని కుమారులు అమిత్ (23), నితిన్ (11), అమీర్‌లు, సురేశ్ సోదరి కుమారులు జలావత్ దామి అలియాస్ జాబీర్ (19, రూప్‌చంద్ దామి (33)లు ఉన్నారు. వరంగల్‌కు చెందిన బట్టు శ్రీనివాస్ (42) ఆటో నడుపుతున్నాడు.
మృత్యువులా ఎదురొచ్చి..
మధ్యప్రదేశ్ రాష్ట్రం నమీనా జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మదన్‌లాల్ నాయక్ వైజాగ్ షిప్‌యార్డులో ఉన్న సరుకును లోడ్ చేసుకుని వరంగల్‌లో అన్‌లోడ్ చేయడానికి బయలుదేరాడు. ఈ లారీకి మదన్‌లాల్ సహా ఇద్దరు డ్రైవర్లు ఉండగా, కో డ్రైవర్ రాకే‹Ùమీనా ఖమ్మం వరకు డ్రైవింగ్ చేశాడు. ఖమ్మం నుంచి మదన్‌లాల్ న డపడం ప్రారంభించాడు. లారీ ఇల్లంద సమీపిస్తుండగా అప్పటికే నిద్ర మత్తులో ఉన్న మదన్‌లాల్ లారీని అతి వేగంగా నడుపుతూ రాంగ్‌రూట్‌లో ఎదురొచ్చి ఆటోను ఢీకొట్టాడు.
లారీ సు మారు 30 మీటర్ల దూరం ఆటోను ఈడ్చుకుంటూ వెళ్లింది. ప్రమాద తీవ్రతకు ఆటోలో ఉన్న వారి శరీరాలు మాంసం ముద్దలుగా మారాయి. సురేశ్ కురేరి, అమిత్ కురేరి, బట్టు శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన నితిన్ కురేరి, అమీర్ కురేరి, రూప్‌చంద్, జాబీర్‌లను ఆస్పత్రికి తరలిస్తుండగా నితిన్ మార్గం మధ్యలోనే మృతి చెందాడు. రూప్‌చంద్, జాబీర్ వరంగల్ ఎంజీఎంలో మరణించారు. అమీర్ కురేరిని ఎంజీఎం నుంచి మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రై వేట్ ఆస్పత్రికి తరలించారు.
అత ని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు ఇల్లందలోని కిరాణ దు కాణం వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఫుటేజీలను పరిశీలించి ప్రమాదం ఉదయం 7 గంటల 12 నిమిషాలకు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఘటనాస్థలిని సందర్శించారు. సురేశ్ భా ర్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment