
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. సంతమాగులూరులోని బాలాజీ హైస్కూల్ వద్ద ఘటన జరిగింది. వినుకొండ నుంచి నరసరావుపేట వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతులను నరసరావుపేటకి చెందినవారిగా గుర్తించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చదవండి: స్కూటీపై వెళ్తుండగా ముఖానికి చున్ని అడ్డువచ్చి ..
Comments
Please login to add a commentAdd a comment