సాక్షి, ప్రతినిధి, గుంటూరు :రెండు కుటుంబాల మ ధ్య చెలరేగిన ఘర్షణను రాజకీయం చేసి.. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ నేతలు చేసిన శవ రాజకీయాలు బెడిసికొట్టాయి. అడుగ డుగునా అడ్డంకులు సృష్టించి లేనిపోని ఆరోపణలు చేద్దామనుకున్న టీడీపీ నేతల ఆటలు సాగలేదు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారి పాలెంకు చెందిన యువకుడు ఉప్పాల అమర్‌నాథ్ ను కొందరు వ్యక్తులు కుటుంబ వివాదాల నేపథ్యంలో పెట్రోల్ పోసి తగులబెట్టి హత్యచేసిన విషయం తెలిసిందే.
టీడీపీ నేతలు ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. అమర్‌నాథ్ మృతదేహంతో చెరుకుపల్లి సెంటర్‌లో ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతిని తమకు అనుకూలంగా మార్చుకుని అలజడి సృష్టించేందుకు యత్నించారు. కానీ, నిందితులను గంటల వ్యవధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎంపీ మోపిదేవి అడ్డగింత..
అమర్‌నాథ్ మృతదేహాన్ని చూసి అతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావును అడ్డుకున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాలను గమ నించిన ఎంపీ మోపిదేవి ప్రతి ఒక్కరూ సంయ మనంతో వ్యవహరించాలని కోరారు. మృతుడి కుటుంబానికి ఎంపీ వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక
సాయం చేస్తున్నా.. వారికి వద్దంటూ టీడీపీ నేతలే అడ్డుకోవటం గమనార్హం. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీ చెప్పారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తామని చెప్పారు.
అది రెండు కుటుంబాల మధ్య ఘర్షణే : ఎస్పీ
రెండు కుటుంబాల మధ్య ఘర్షణే ఈ హత్యకు దారి తీసిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే హత్య జరిగిన గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో ఎటువంటి రాజకీయ కోణంలేదని ఆయన తేల్చిచెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటీకీ టీడీపీ నేతలు వారిని అరెస్టుచేయలేదని వ్యాఖ్యలు చేయటం వివాదా స్పదమయ్యాయి. మరో నిందితుడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
సీఎం జగన్ రూ.10 లక్షల సాయం
ఇక మృతుడు అమర్‌నాథ్ కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడేలా రూ.10 లక్షల చెక్కును పంపారు. ప్రభు త్వం అన్ని విధాలుగా బాధిత కుటుంబానికి సాయం అందిస్తుందని స్పష్టంచేశారు. చెక్కును ఆదివారం అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment