Jindal
-
ఎన్టీపీసీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట
జిందాల్ ఐటీఎఫ్ లిమిటెడ్‌కు రూ.1,891 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)ను ఆదేశించిన 2019 మధ్యవర్తిత్వ తీర్పును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ‘పేటెంట్ చట్టవిరుద్ధం’, ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడమని కోర్టు గుర్తించింది.వివాదం నేపథ్యంఎన్టీపీసీ, జిందాల్ ఐటీఎఫ్ లిమిటెడ్, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) మధ్య 2011లో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం కారణంగా ఈ వివాదం తలెత్తింది. పశ్చిమ బెంగాల్‌లోని ఎన్టీపీసీకి చెందిన ఫరక్కా థర్మల్ పవర్ ప్లాంట్‌కు జాతీయ జలమార్గం ద్వారా బొగ్గు రవాణా చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. బొగ్గు రవాణాకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి జిందాల్ ఐటీఎఫ్ బాధ్యత వహించింది. మౌలిక సదుపాయాల నిర్మాణ సమయంలో జాప్యం జరిగింది. ఫేజ్ 1 పనులు.. 400 రోజులు, ఫేజ్ 2 పనులు.. 674 రోజులు ఆలస్యం అయ్యాయి. 2017లో జిందాల్ ఐటీఎఫ్ మధ్యవర్తిత్వ చర్యలను ప్రారంభించింది. జాప్యం వల్ల జరిగిన ఆదాయ నష్టానికి ఎన్టీపీసీ పరిహారం కోరింది. తర్వాత జిందాల్ ఐటీఎఫ్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.ఇదీ చదవండి: మనిషిలా తెలివి మీరుతున్న ఏఐఎన్టీపీసీ ఒప్పందాన్ని రద్దు చేసినందుకు 2019 జనవరిలో మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ జిందాల్ ఐటీఎఫ్‌కు మద్దతుగా రూ.1,891 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కాంట్రాక్ట్ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం, ‘నో డ్యామేజీ’ క్లాజ్ ఉండటం సహా పలు కారణాలను చూపుతూ ఎన్టీపీసీ ఢిల్లీ హైకోర్టులో ఈ తీర్పును సవాలు చేసింది. ట్రిబ్యునల్ నష్టపరిహారాలను సరైన రీతిలో లెక్కించలేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడమని కోర్టు గుర్తించింది. తగిన శ్రద్ధ, నైపుణ్యంతో ప్రొసీడింగ్స్ నిర్వహించడం మధ్యవర్తి బాధ్యతని కోర్టు నొక్కి చెప్పింది. ఈ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయాలని జిందాల్ ఐటీఎఫ్ యోచిస్తోంది. -
ట్యుటికోరిన్ కోల్ బిడ్డింగ్‌పై జిందాల్ పవర్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ట్యుటికోరిన్ కోల్ టెర్మినల్ (టీసీటీ) బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ జిందాల్ పవర్ (జేపీఎల్) చేసిన విజ్ఞప్తిని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తిరస్కరించింది. నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను సమర్పించేందుకు జేపీఎల్‌కు అర్హత లేదంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఇచి్చన ఉత్తర్వులను సమర్ధించింది. కంపెనీకి గరిష్ట విలువను రాబట్టడమే దివాలా కోడ్ (ఐబీసీ) లక్ష్యం అయినప్పటికీ .. దరఖాస్తుదారుల తుది జాబితాలో లేని కంపెనీలకు మధ్యలో ప్రవేశం కలి్పంచడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొంది. తుది జాబితాలోని సీపోల్ సమర్పించిన బిడ్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ పరిష్కార నిపుణుడు (ఆర్పీ), రుణదాతల కమిటీ (సీవోసీ)కి ఎన్సీఎల్ఏటీ సూచించింది. రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా టీసీటీని కొనుగోలు చేసేందుకు సీపోల్ గతేడాది ఫిబ్రవరి 18న ప్రణాళిక సమరి్పంచింది. దాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) పరిశీలిస్తుండగానే దాదాపు అదే సమయంలో బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు తమకు కూడా అవకాశం కలి్పంచాలంటూ జూలై 12న జేపీఎల్ కోరింది. అయితే, బిడ్డింగ్‌కు అనుమతిస్తూనే.. సీఐఆర్‌పీ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటాయంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తెలిపింది. దీనిపై సందిగ్ధత నెలకొనడంతో స్పష్టతనివ్వాలంటూ ఆర్పీ కోరారు. దీంతో జేపీఎల్‌కు అర్హత ఉండదంటూ ఎన్సీఎల్టీ స్పష్టతనిచ్చింది. ఈ ఉత్తర్వులనే సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని జేపీఎల్ ఆశ్రయించింది. -
Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత
పదిహేడు సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చాలా తక్కువమందికి ఆసక్తి ఉంటుంది. జిందాల్ మాత్రం అలా కాదు. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన పదిహేడు సంవత్సరాల కశ్వీ జిందాల్‌కు ఆర్థిక విషయాలు అంటే బోలెడు ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను ఆర్థికరంగానికి సంబంధించిన అనేకానేక విషయాల గురించి తెలుసుకునేలా, ‘ఇన్వెస్ట్ ది చేంజ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. ఈ స్వచ్ఛందసంస్థ ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలలో డిజిటల్ అక్షరాస్యత పెరిగేలా కృషి చేస్తోంది. రకరకాల ప్రభుత్వ పథకాల గురించి తన బృందంతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది కశ్వీ జిందాల్... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సకీనా బతుకుదెరువు కోసం దిల్లీకి వచ్చిన కశ్వీ జిందాల్ ఇంట్లో చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడిందామె. ఇక అప్పటి నుంచి ఆమెకు భయం పట్టుకుంది. ‘ఒకవేళ నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి?’ ఆ భయంలో ఆమెకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాంటి రోజుల్లో ఒకరోజు ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరైంది. ఆ సమావేశంలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైనా, చనిపోయినా రక్షణగా నిలిచే పథకం ఇది. సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకున్న సకీనా ‘ఇప్పుడు నిశ్చింతగా ఉంది’ అంటుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకోవడానికి ముందు సకీనాకు బ్యాంకు ఎకౌంట్ లేదు. దీంతో కశ్వీ బృందం సకీనాకు బ్యాంక్ ఎకౌంట్ రిజిస్టర్ చేయించింది. తండ్రి ఫైనాన్షియల్ రంగంలో పనిచేస్తుండడంతో జిందాల్‌కు ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించిన విషయాలు ఆసక్తిగా తెలుసుకునేది. తండ్రి విసుక్కోకుండా ఓపిగ్గా చెప్పేవాడు. దీంతో జిందాల్‌కు ఎకనామిక్స్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. ఫైనాన్స్ రంగంలోనే తన కెరీర్ ఏర్పాటు చేసుకోవాలనే భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ అపార్ట్మెంట్లో హౌస్‌కీపింగ్ పనిచేసే వ్యక్తి మరణించాడు. అతడి వయసు 31 సంవత్సరాలు మాత్రమే. అతడి మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్లో పనిచేసే ఇతర వర్కర్లతో మాట్లాడుతున్నప్పుడు వారికి ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అయింది. ఈ నేపథ్యంలో జిందాల్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన...మొదలైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత స్వచ్ఛంద సంస్థ ‘ఇన్వెస్ట్ ది ఛేంజ్’ ప్రారంభించింది. తొలిరోజు నుంచి ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ నిర్వహించిన అవగాహన సదస్సులకు అద్భుత స్పందన లభించింది. ఆ సదస్సుల తరువాత ‘ఫలానా స్కీమ్‌లో చేరుతాము’ అంటూ ఫోన్లు వెల్లువెత్తేవి. వారు స్కీమ్‌లో చేరేలా ఆన్లైన్ అప్లయింగ్, ఫామ్–ఫిల్లింగ్ వరకు జిందాల్ బృందం ప్రతి పని దగ్గరుండి చూసుకునేది. ఏదైనా అప్లికేషన్ ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేది. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’లో పదిహేనుమంది వాలంటీర్లు ఉన్నారు. ‘రోటరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ భాగస్వామ్యంతో ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఎన్నో ప్రాంతాలలో ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది జిందాల్. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ఎంతోమందిని ప్రభావితం చేసింది. మార్పు తీసుకు వచ్చింది. ఆఫీస్ బాయ్‌గా పనిచేసే ప్రకా‹ష్ మండల్... కోవిడ్ కల్లోలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. అతడికి ఉపయోగపడే గవర్నమెంట్ పాలసీల గురించి తెలియజేసి సహాయపడింది జిందాల్ బృందం. ‘ఎన్నో స్కీమ్‌లు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నాకు నచ్చాయి. దీనికి కారణం సంవత్సరానికి చాలా తక్కువ మొత్తం కడితే సరిపోతుంది. స్కీమ్‌లో చేరాలనుకున్నప్పుడు ఫామ్స్ నింపడం, ఇతరత్రా విషయాలలో ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయంలో జిందాల్ బృందం నాకు సహకరించింది’ అంటున్నాడు ప్రకాష్. భవిష్యత్‌లో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలనుకుంటుంది జిందాల్. ‘ఆర్థిక అక్షరాస్యత అనేది మనల్ని స్వతంత్రులను చేస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు పొదుపు మార్గాల గురించి కూడా తెలియజేస్తున్నాం’ అంటుది కశ్వీ జిందాల్. వారి నమ్మకమే మన బలం గొప్ప లక్ష్యాలతో ముందుకు వచ్చినప్పటికీ ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం అనేది అతి పెద్ద సవాలు. వారి నమ్మకాన్ని గెలుచుకుంటే సగం విజయాన్ని సాధించినట్లే. వ్యక్తిగత విషయాలు కూడా మనతో పంచుకుంటారు. నా వయసు అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది... అంటూ నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే నా ఉపన్యాసాల ద్వారా వారిని ఆకట్టుకొని వారికి నా పట్ల నమ్మకం కుదిరేలా చేసేదాన్ని. – కశ్వీ జిందాల్, ఇన్వెస్ట్ ది చేంజ్–ఫౌండర్ -
ఈ ఏడాది ఈమే టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..
సంపన్నుల జాబితా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ కదా.. అయితే వారి సంపాదన ఎక్కువగా ఉండడం వల్ల వారు సంపన్నుల జాబితాలో చోటుసంపాదిస్తుంటారు. ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్(73) అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదించింది. ఆమె మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లు. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. దాంతో ఈ ఏడాది అధికంగా సంపదించిన జాబితాలో ఆమె అందరి కంటే ముందు నిలిచారని నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా మాత్రం రూ.7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఏడాది ఆయన సంపద రూ.43 వేలకోట్లు పెరిగినట్లు తెలిసింది. రూ.7 లక్షల కోట్ల సంపదతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్అదానీ రెండో స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. దేశంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2 లక్షల కోట్లు)ను సావిత్రి దాటేశారు. ఇదీ చదవండి: తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే.. ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ రూ.66 వేలకోట్లతో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ సంపద రూ.59వేలకోట్లు పెరగడంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ రూ.52 వేలకోట్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది రూ.43 వేలకోట్లు పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
‘70 గంటల పని’ వివాదంపై జిందాల్ ఏమన్నారంటే..
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. భారత యువత వారంలో కనీసం 70 గంటలు పనిచేయాలని ఆయన అనడంతో ఐటీ ఉద్యోగులతో సహా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. అయితే ఆయన మాటలను సమర్థిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్పర్సన్ సజ్జన్ జిందాల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. యువత విశ్రాంతి కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఐదు రోజులపాటే పని చేయాలనే సంస్కృతి అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోజూ 14-16 గంటలకు పైగా పని చేస్తారని, తానూ రోజూ 10-12 గంటలు విధుల్లో ఉంటానని తెలిపారు. A 5 day week culture is not what a rapidly developing nation of our size needs. Our PM @narendramodi ji works over 14-16 hours everyday. My father used to work 12-14 hours, 7 days a week. I work 10-12 hours everyday. We have to find passion in our work and in Nation Building. — Sajjan Jindal (@sajjanjindal) October 27, 2023 -
అమర్నాథ్ హత్యపై టీడీపీ శవరాజకీయం
సాక్షి, ప్రతినిధి, గుంటూరు :రెండు కుటుంబాల మ ధ్య చెలరేగిన ఘర్షణను రాజకీయం చేసి.. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ నేతలు చేసిన శవ రాజకీయాలు బెడిసికొట్టాయి. అడుగ డుగునా అడ్డంకులు సృష్టించి లేనిపోని ఆరోపణలు చేద్దామనుకున్న టీడీపీ నేతల ఆటలు సాగలేదు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారి పాలెంకు చెందిన యువకుడు ఉప్పాల అమర్నాథ్ ను కొందరు వ్యక్తులు కుటుంబ వివాదాల నేపథ్యంలో పెట్రోల్ పోసి తగులబెట్టి హత్యచేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. అమర్నాథ్ మృతదేహంతో చెరుకుపల్లి సెంటర్లో ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతిని తమకు అనుకూలంగా మార్చుకుని అలజడి సృష్టించేందుకు యత్నించారు. కానీ, నిందితులను గంటల వ్యవధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ మోపిదేవి అడ్డగింత.. అమర్నాథ్ మృతదేహాన్ని చూసి అతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావును అడ్డుకున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాలను గమ నించిన ఎంపీ మోపిదేవి ప్రతి ఒక్కరూ సంయ మనంతో వ్యవహరించాలని కోరారు. మృతుడి కుటుంబానికి ఎంపీ వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నా.. వారికి వద్దంటూ టీడీపీ నేతలే అడ్డుకోవటం గమనార్హం. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీ చెప్పారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. అది రెండు కుటుంబాల మధ్య ఘర్షణే : ఎస్పీ రెండు కుటుంబాల మధ్య ఘర్షణే ఈ హత్యకు దారి తీసిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే హత్య జరిగిన గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో ఎటువంటి రాజకీయ కోణంలేదని ఆయన తేల్చిచెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటీకీ టీడీపీ నేతలు వారిని అరెస్టుచేయలేదని వ్యాఖ్యలు చేయటం వివాదా స్పదమయ్యాయి. మరో నిందితుడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. సీఎం జగన్ రూ.10 లక్షల సాయం ఇక మృతుడు అమర్నాథ్ కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడేలా రూ.10 లక్షల చెక్కును పంపారు. ప్రభు త్వం అన్ని విధాలుగా బాధిత కుటుంబానికి సాయం అందిస్తుందని స్పష్టంచేశారు. చెక్కును ఆదివారం అందజేస్తారు. -
జిందాల్ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి బొత్స
సాక్షి, గుంటూరు : జిందాల్ ప్లాంట్ పనులు 2016లో ప్రారంభమయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 10% పనులే చేసిందని, మేం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ పనులు వేగవంతం చేశామని అన్నారు. వచ్చేనెలలో ప్లాంట్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గురువారం జిందాల్ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ‘‘ గుంటూరు, విజయవాడ, తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్ సహా.. మరో 6 మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తను ఉపయోగిస్తాం. విశాఖలోనూ ఈ తరహా ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఈ ప్లాంట్ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది’’ అని తెలిపారు. కాగా, ఈ జిందాల్ ప్లాంట్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయనున్న సంగతి తెలిసిందే. -
ఇక ‘జిందాల్’ పెయింట్స్
♦ రెండు ప్లాంట్ల పనులు ప్రారంభం ♦ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి.. ముంబై: సజ్జన్ జిందాల్ కుటుంబం పెయింట్ల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. రెండు ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయి. ఒక ప్లాంట్‌ను(డెకరేటివ్ పెయింట్స్) కర్ణాటకలోని విజయ్‌నగర్‌లో, మరో ప్లాంట్(ఇండస్ట్రియల్ సెగ్మెంట్)ను మహారాష్ట్రలోని వసింధ్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఈ వ్యాపారాన్ని చూస్తున్న పార్థు జిందాల్ తెలియజేశారు. ఈ రెండు ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, రెండేళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్లోనూ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారాయన. ఈ కుటుంబం జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ కంపెనీలను నిర్వహిస్తోంది. వన్ స్టాప్ సొల్యూషన్ పెయింట్ల పరిశ్రమ ప్రతి ఏటా 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోందని, ఈ రంగంలో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా ప్రతి ఏడాదీ పెరుగుతోందని పార్థు జిందాల్ చెప్పారు. ఇప్పటికే స్టీల్, సిమెంట్ రంగాల్లో ఉన్నామని, పెయింట్ల రంగంలో ప్రవేశించడం ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ (అన్ని ఉత్పత్తులు ఒకే చోట అందించే) అవకాశం లభించనున్నదని వివరించారు. బీ2బీ (బిజినెస్ టు బిజినెస్), బీ2సీ (బిజినెస్ టు కన్సూమర్) సెగ్మెంట్లలో ఉత్పత్తులను అందిస్తామని పేర్కొన్నారు. భారత్‌లో మొత్తం పెయింట్ల మార్కెట్ ఏడాదికి 25 లక్షల కిలో లీటర్లని, దీంట్లో ఏషియన్ పెయింట్స్ వాటా 10 లక్షల కిలోలీటర్లని తెలిపారు. 2025 కల్లా 10 లక్షల కిలోలీటర్ల మార్కెట్‌ను సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. మొదట్లో దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలపై దృష్టి పెడతామని ఆయన వివరించారు. -
’మన్మోహనే జిందాల్‌కు బొగ్గు గనులను కేటాయించారు’
-
మాకొద్దీ ఐపీఎల్ టీమ్!
వెనక్కి తగ్గిన జిందాల్ గ్రూప్ ముంబై: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనాలని భావించిన జేఎస్‌డబ్ల్యూ (జిందాల్) గ్రూప్ తాజా పరిణామాలతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. లీగ్‌లో రెండు జట్లను రద్దు చేయాలంటూ జస్టిస్ లోధా కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో లీగ్‌లో భాగం కావాలన్న ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ‘ఈ సమయంలోనైతే ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనేదే మా నిర్ణయం. చెడ్డ పేరు తెచ్చుకున్న లీగ్‌తో మా కంపెనీ పేరును జత చేర్చడం మాకిష్టం లేదు’ అని జిందాల్ గ్రూప్ సభ్యుడు పార్థ్ జిందాల్ స్పష్టం చేశారు. రెండు ఫ్రాంచైజీలను తొలగించొచ్చు: లోధా రెండేళ్ల నిషేధానికి గురైన చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలను తొలగించే స్వేచ్ఛ బీసీసీఐకి ఉందని స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విచారించిన జస్టిస్ లోధా వెల్లడించారు. కమిటీ చేసిన ప్రతిపాదనలను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై బీసీసీఐలో కాస్త అయోమయం నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. ‘ఓ రకంగా ఈ రెండు ఫ్రాంచైజీలను తొలగించినట్లే. సుప్రీంకోర్టు తీర్పులో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి బీసీసీఐ కూడా తొలగింపునే పరిగణనలోకి తీసుకోవాలి. బీసీసీఐ-ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ఒప్పందం ప్రకారం... ఏ ఫ్రాంచైజీ లేదా గ్రూప్ లేదా కంపెనీ లేదా యజమానులు లీగ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే... ఆ ఫ్రాంచైజీలను తొలగించొచ్చు’ అని లోధా వివరించారు. జస్టిస్ లోధా ఇచ్చిన వివరణ నేపథ్యంలో రెండు ఫ్రాంచైజీలను తొలగిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆదివారం జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు. -
294 ఎకరాల భూమి వెనక్కు ఇవ్వనున్న జిందాల్
కోల్‌కతా: స్టీల్, విద్యుత్, సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు తీసుకున్న భూమిని జిందాల్ సంస్థ్ వెనక్కు ఇచ్చేయనుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అధికారికంగా కేటాయించిన 294 ఎకరాల భూమిని రైతులకు తిరిగిచ్చేయాలని జేఎస్ డబ్ల్యూ బెంగాల్ సంస్థ తమకు సమాచారం పంపిందని చెప్పారు. ఈ భూమిని రైతులకు పంపిణీ చేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భూమి వెనక్కు ఇచ్చేయడం, పరిశ్రమలు రద్దు చేసుకోవడం ద్వారా సుమారు రూ.700 కోట్లు నష్టం కలుగుతుందని జిందాల్ సంస్థ అంచనా వేసింది. -
జిందాల్ స్టీల్‌పై మరో ‘బొగ్గు’ కేసు
తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటారుుంపునకు (1993-2005) సంబంధించిన దర్యాప్తులో భాగంగా మోసం, అవినీతి వంటి ఆరోపణలతో.. తాజాగా జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇది 36వ ఎఫ్ఐఆర్ అని సంస్థ ప్రతినిధి ఒకరు ఆదివారం నాడిక్కడ చెప్పారు. జిందాల్ స్రైప్స్ లిమిటెడ్ (ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్)తో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులపై నేరపూరిత కుట్ర, ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదైనట్టు సీబీఐ వర్గాలు వెల్లడించారుు. వెనువెంటనే సీబీఐ రాయ్‌గఢ్, ఛత్తీస్‌గఢ్‌ల్లోని మొత్తం 4 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు తెలిపారుు. ఇది గరె పల్మా 4/1 బొగ్గు గని కేటారుుంపునకు సంబంధించిన కేసుగా ఆ వర్గాలు వివరించారుు. కంపెనీకి చెందిన స్పాంజ్ ఐరన్ ప్లాంట్ కోసం గనిని కేటారుుంచగా.. దానికి బదులు కంపెనీ, బొగ్గు శాఖ నిర్దేశిత పరిధికి మించి అక్రమ మైనింగ్‌కు ప్రతిపాదించడమే కాకుండా అందుకు పాల్పడిందనే ఆరోపణలున్నారుు. మితిమీరిన మైనింగ్‌కు పాల్పడటమే కాకుండా ముడి బొగ్గును అమ్మడం వంటి చర్యలకు పాల్పడినట్టుగా ఆరోపణలున్నట్టు సీబీఐ ప్రతినిధి తెలిపారు. జార్ఖండ్‌లో ఓ బొగ్గు గనిని కైవసం చేసుకోవడంలో అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలతో జేఎస్పీఎల్ ఇప్పటికే సీబీఐ విచారణను ఎదుర్కొంటోంది. ఈ కేసుకు సంబంధించి కంపెనీ చైర్మన్, మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌ను సీబీఐ ప్రశ్నించింది. -
ఇంటికి తాళం పడితే చోరీ ఖాయం
తోరణగల్లులో దొంగతనాలు జోరు రికవరీ నిల్ జాగ్రత్తగా ఉండాలని పోలీసుల ఉచిత సలహాలు తోరణగల్లు : తోరణగల్లు, తోరణగల్లు ఆర్ఎస్ ప్రాంతాల్లో దొంగతనాలు జోరందుకున్నాయి. దీంతో ఇంటికి తాళం వేసి ఊరెళ్లాలంటే స్థానికులు జంకుతున్నారు. చెమటోడ్చి సంపాదించిన సొమ్ము చోరులపాలవుతుండటంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మరో వైపు చోరీలకు సంబంధించి రికవరీ చేయడంలో పోలీసులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నాయి. గత ఏడాది ఇదేమాసంలో జిందాల్ పాతగేటు సమీపంలోని ఏటీఎంను దుండగలు ధ్వంసం చేసి డబ్బు దోచుకొన్నారు. ఆ తర్వాత తోరణగల్లు ఆర్ఎస్లోని ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. శంకరగుడ్డ కాలనీలోని టౌన్‌షిఫ్‌లో ఒకే రోజు 16 ఇళ్లలో చోరీలు జరిగాయి. లక్షలు విలువ చేసే బంగారు, నగదు దోచుకొన్నారు. తోరణగల్లు రైల్వేస్టేషన్లో ఆరు రోజులకొకసారి దుకాణాల్లో చోరీలు జరగడం మామూలైంది. గత వారం తోరణగల్లులో ఒకేరోజు 16 ఇళ్లల్లో చోరీలు జరిగాయి. లక్ష లాది రూపాయలు విలువ చేసే బంగారు, నగదు చోరీకి గురైంది. దీంతో తోరణగల్లు గ్రామం,ఆర్ఎస్, జిందాల్ టౌన్‌షిప్‌ల్లోని నివాసులు చోరీలను నివారించడానికి రాత్రి పూట దుడ్డు కర్రలు పట్టుకొని గస్తీ తిరగడం పరిపాటైంది. పోలీసులు ఇంతవరకు ఒక్క దొంగను కూడా పట్టుకొన్న దాఖలాలు లేవు. పైగా మీ వస్తువులను మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ పోలీసులు నోటీసులు అందజేస్తున్నారని దుకాణదారులు వాపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు తోరణగల్లు ఆర్ఎస్లో మొబైల్ రిపేరీ, అమ్మకాల దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నా. ఆరు నెలల క్రితం దుకాణంలో కొత్త మొైబైల్స్, నగదును దుండగులు దోచుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పైగా మీ దుకాణాల్లో చోరీ జరగకుండా కాపాడుకోవడం మీదే బాధ్యత అని హెచ్చరిక పత్రం ఇచ్చారు. - ఎస్.చిన్నా, మొబైల్ దుకాణం యజమాని, తోరణగల్లు కష్టపడి సంపాదించన సొమ్ము దొంగలపాలైతే ఎలా? తరచు చోరీలతో భీతిల్లుతున్నాం. రాత్రనక పగలక కష్టపడి కుటుంబం, పిల్లల చదువుకోసం సంపాదించిన డబ్బు దొంగల పాలైతే ఎంత వేదనకు గురవుతారో అధికారులు, పోలీసులు ఆలోచించాలి. కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి పొట్టపోసుకోవడానికి వచ్చిన కార్మికుల ఇళ్లల్లో సైతం చోరీలు జరిగితే వాళ్లు ఎలా కోలుకొంటారు. - వరప్రసాద్, వ్యాపారి, తోరణగల్లు చోరీల నివారణకు చర్యలు తోరణగల్లులో చోరీలను అరికట్టడానికి గ్రామంలోను, ఆర్ఎస్, జిందాల్ టౌన్‌షిప్‌ల్లో పోలీసు గస్తీని ఏర్పాటుచేశాం. దొంగలను పట్టుకోవడానికి తనిఖీ బృందాన్ని ఏర్పాటుచేశాం. గ్రామస్తులు ఊళ్లకు వెళ్లే ముందు పోలీసు స్టేషన్లో తెలియజేయాలని నిబంధన పెట్టాం. చోరీల నివారణకు చర్యలు తీసుకొంటున్నాం. - మహమ్మద్ రఫి,తోరణగల్లు ఎస్ఐ -
విశాఖ పోర్ట్ అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : విశాఖ పోర్ట్ ట్రస్ట్‌ను మరింతగా అభివృద్ధి చేసేం దుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, పోర్ట్ సేవలు ఆయూ పరిశ్రమల యూజమాన్యాలు వినియోగించుకోవాలని విశాఖ పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ జీవీఎల్ సత్యకుమార్ అన్నారు. ఇక్కడ ఓ హోటల్లో ట్రేడ్ మీట్‌ను బుధవా రం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 1933లో ఏడాదికి మూడు లక్షల టన్నుల కెపాసి టీ ఉండే ట్రస్ట్ 2014 నాటికి 800 లక్షల టన్నుల సామర్థ్యం ద్వారా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఉన్న పలు పరిశ్రమలు యూజ మాన్యాలతో సంప్రదింపులు జరిపి, విశాఖ పోర్ట్ ట్రస్ట్ సేవలపై పూర్తి స్థారుులో అవగాహన కల్పిస్తున్నట్టు తెలి పారు. ఇతర పోర్టుల కంటే ధీటుగా విశాఖ పోర్టును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు పోర్టు సమీపంలో సముద్ర తీరం లోతు పెంచి పెద్ద పెద్ద షిప్పులు వచ్చే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పోర్టు ట్రస్ట్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వ్యాపారంలో ప్రగతిని సాధించేందుకు వీలుగా అభివృద్ధి చేశామన్నారు.ప్రస్తుతం రోజుకు లక్ష టన్నుల మేరకు సరుకులను ఎగుమతి చేయగల సామర్థ్యం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించడం ద్వారా కాలుష్యం బారిన పడకుండా చూశామని తెలిపారు. జిల్లాలోని జిందాల్, ఫేకర్, ఎన్సీఎస్ సుగర్స్, మహామాయ, ఆంధ్రా ఫెర్రో ఎల్లారుుస్ వంటి పెద్ద పరిశ్రమలకు అందుబాటులో ఉండే విధం గా పోర్టు తన సేవలను విస్తృతం చేస్తోందన్నారు. మీట్ లో పోర్ట్ అధికారులు కల్యాణ్ చక్రవర్తి, ఎం.సుధీర్, కె.సత్యనారాయణ, సెంథిల్‌కుమార్, సీహెచ్ అవతారంనాయుడు, డాక్టర్ ఎస్వీ భాస్కరరావు పాల్గొన్నారు.