జిందాల్ స్టీల్‌పై మరో ‘బొగ్గు’ కేసు
తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటారుుంపునకు (1993-2005) సంబంధించిన దర్యాప్తులో భాగంగా మోసం, అవినీతి వంటి ఆరోపణలతో.. తాజాగా జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇది 36వ ఎఫ్‌ఐఆర్ అని సంస్థ ప్రతినిధి ఒకరు ఆదివారం నాడిక్కడ చెప్పారు. జిందాల్ స్రైప్స్ లిమిటెడ్ (ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్)తో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులపై నేరపూరిత కుట్ర, ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదైనట్టు సీబీఐ వర్గాలు వెల్లడించారుు.
వెనువెంటనే సీబీఐ రాయ్‌గఢ్, ఛత్తీస్‌గఢ్‌ల్లోని మొత్తం 4 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు తెలిపారుు. ఇది గరె పల్మా 4/1 బొగ్గు గని కేటారుుంపునకు సంబంధించిన కేసుగా ఆ వర్గాలు వివరించారుు. కంపెనీకి చెందిన స్పాంజ్ ఐరన్ ప్లాంట్ కోసం గనిని కేటారుుంచగా.. దానికి బదులు కంపెనీ, బొగ్గు శాఖ నిర్దేశిత పరిధికి మించి అక్రమ మైనింగ్‌కు ప్రతిపాదించడమే కాకుండా అందుకు పాల్పడిందనే ఆరోపణలున్నారుు. మితిమీరిన మైనింగ్‌కు పాల్పడటమే కాకుండా ముడి బొగ్గును అమ్మడం వంటి చర్యలకు పాల్పడినట్టుగా ఆరోపణలున్నట్టు సీబీఐ ప్రతినిధి తెలిపారు.
జార్ఖండ్‌లో ఓ బొగ్గు గనిని కైవసం చేసుకోవడంలో అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలతో జేఎస్‌పీఎల్ ఇప్పటికే సీబీఐ విచారణను ఎదుర్కొంటోంది. ఈ కేసుకు సంబంధించి కంపెనీ చైర్మన్, మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌ను సీబీఐ ప్రశ్నించింది.