Jindal Steel and Power Company
-
Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులందర్లో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ అత్యధిక ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ చైర్మన్ అయిన నవీన్ హరియాణాలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. తనకు రూ.1,241 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 39 శాతం మంది కోటీశ్వరులే. వీరికి సగటున రూ.6.21 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా కురుక్షేత్రలో జిందాల్‌పై ఆప్ కూడా సంపన్న నేతనే పోటీకి దించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్‌కుమార్ గుప్తా రూ.169 కోట్ల ఆస్తులతో టాప్–3లో ఉన్నారు. ఒడిశాలో కటక్ బీజేడీ అభ్యర్థి సంతృప్త్ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తనవద్ద కేవలం రెండు రూపాయలే ఉన్నట్టు రోహ్తక్ లోక్‌సభ స్థానంలో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రణ«దీర్ సింగ్ పేర్కొన్నారు! 180 మందిపై క్రిమినల్ కేసులు ఆరో విడతలో 180 మంది (21 శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. వీరిలో 141 మందిపై సీరియస్ కేసులున్నాయి. 12 మంది తమను దోషులుగా కోర్టు ప్రకటించినట్టు పేర్కొనగా, పలువురు హత్య కేసుల్లోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. 21 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. 24 మంది మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులు. ముగ్గురిపై అత్యాచారం కేసులున్నాయి. ఆప్ తరఫున పోటీలో ఉన్న ఐదుగురు, ఆర్జేడీ అభ్యర్థులు నలుగురూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో 75 శాతం, బీజేపీ అభ్యర్థుల్లో 55 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఆర్జేడీకి చెందిన నలుగురూ, ఆప్‌నకు చెందిన నలుగురు (80 శాతం), ఎస్పీ నుంచి 12 మంది (75 శాతం) బీజేడీ నుంచి 18 మంది (35 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జిందాల్‌కు బెదిరింపు
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ సెంట్రల్ జైలు ఖైదీ ఒకడు పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు బెదిరింపు లేఖ రాశాడు. రూ.50 కోట్లను 48 గంటల్లోగా పంపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అందులో హెచ్చరించాడు. ఈ మేరకు గత వారం రాయ్‌గఢ్‌లోని పత్రపాలి గ్రామంలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్పీఎల్)కు లేఖ అందింది. దీనిపై కోట్రా రోడ్ పోలీసులు సెక్షన్లు 386, 506 కింద కేసు నమోదు చేశారు. సదరు బెదిరింపు లేఖను బిలాస్పూర్ జైలులోని ఖైదీ పోస్టు ద్వారా పంపినట్లు తేలిందని దర్యాప్తులు పోలీసులు చెప్పారు. -
ఆ రంగానికి కలిసొస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న యుద్ధం భారత ఉక్కు పరిశ్రమకు కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ దాడుల వల్ల కలిగిన సరఫరా అంతరాన్ని భర్తీ చేయడానికి భారతదేశంలోని ఉక్కు తయారీదారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. కానీ, ఎగుమతి పరంగా మన దేశ వాటా చాలా తక్కువ. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు యూరప్ దేశాలకు ఎక్కువగా ఉక్కును ఎగుమతి చేస్తాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్దం కొనసాగుతుండటం వల్ల ఉక్కు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ లోటును భర్తీ చేసేందుకు దేశీయ ఉక్కు తయారీ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్(జెఎస్పీఎల్) తెలిపిన వివరాల ప్రకారం.. సరఫరా అంతరాయం వల్ల గత నెలలో ఉక్కు ధరలు 20 శాతం పెరగడంతో ఐరోపా, మధ్య ప్రాచ్య & ఆఫ్రికా కంపెనీలు మన దేశం వైపు చూస్తున్నాయి. ఐరోపా, మధ్య ప్రాచ్య & ఆఫ్రికా ప్రాంతంలో ఉక్కు కొరత ఉంది. ఆ సరఫరాను భారతదేశం, పాక్షికంగా చైనా పూడ్చుతుంది" అని వి.ఆర్. శర్మ బ్లూమ్ బెర్గ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ కలిపి ఏడాదికి 44-45 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తాయని బ్రోకింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. రష్యా ఒక్కటే యూరప్‌కు 14-15 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తోంది. బెంచ్‌మార్క్ ధర మార్కెట్లో ఫిబ్రవరి 18 నాటికి హాట్ రోల్డ్ కాయిల్ స్టీల్ టన్నుకు 947 డాలర్లు ఉండేది. కానీ, మార్చిలో ఆ ధర టన్నుకు 1205 డాలర్లకు చేరుకుంది.. యూరప్‌లోని చాలా కంపెనీలు స్టీల్ ధరను పెంచడం ప్రారంభించాయి. దీంతో ఎగుమతి ధర పెరిగింది. భారతీయ కంపెనీలు టన్నుకు 1150 డాలర్ల ధరతో యూరప్‌కు ఉక్కును సులభంగా పంపగలవని, ఇది యూరప్‌లో నడుస్తున్న ధర కంటే దాదాపు 100 డాలర్లు తక్కువ అని వి.ఆర్. శర్మ చెప్పారు. ప్రస్తుతం భారత ఉక్కు పరిశ్రమ టన్నుకు దాదాపు 1000 డాలర్ల రేటుతో ఉక్కును ఎగుమతి చేస్తోందని ఆయన చెప్పారు. గత సంవత్సరం మన దేశ ఉక్కు & ఇనుప ఖనిజం ఎగుమతులలో దాదాపు మూడవ వంతు ఐరోపా దేశాలకు కంపెనీలు ఎగుమతి చేశాయి. ప్రధానంగా ఇటలీ, బెల్జియం, నేపాల్ & వియత్నాంలకు భారతదేశం 2021లో 20.63 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది. ఉక్కు సరఫరా కొరతను తీర్చడానికి భారతీయ ఉక్కు తయారీదారులు ఐరోపాకు రవాణాను పెంచాలని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్దం వల్ల ఏర్పడిన సరఫరా కొరత వల్ల ప్రస్తుతం దేశీయ అమ్మకాలు 25 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. (చదవండి: మార్కెట్లోకి మరో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే రేంజ్!) -
జిందాల్ యాజమాన్యానికి వైద్యారోగ్యశాఖ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: జిందాల్ యాజమాన్యానికి ఏపీ ప్రభుత్వం తరఫున వైద్య, ఆరోగ్యశాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఒడిశాలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ నుంచి ఏపీకి ట్యాంకర్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రానికి జిందాల్ ఫ్యాక్టరీ ప్రతిరోజూ 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపుతోంది. ఆక్సిజన్ కొరత తీరే వరకు సరఫరా కొనసాగుతుందన్న జిందాల్ యాజమాన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్యాంకర్ ద్వారా ఆక్సిజన్ప పంపించినందుకు జిందాల్ ఫ్యాక్టరీకి వైద్యారోగ్యశాఖ కృతజ్ఞతలు తెలిపింది. -
మరింత పెరిగిన జిందాల్ స్టీల్ నష్టాలు
న్యూఢిల్లీ: నవీన్ జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జేఎస్పీఎల్) కంపెనీ నష్టాలు క్యూ4లో మరింతగా పెరిగాయి. 2016–17 క్యూ4లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.100 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ సారి రూ.425 కోట్లకు పెరిగాయని జేఎస్పీఎల్ తెలిపింది. వ్యయాలు, వడ్డీ భారం అధికం కావడమే దీనికి కారణమని వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.6,756 కోట్ల నుంచి రూ.8,599 కోట్లకు ఎగసింది. వ్యయాలు రూ.7,074 కోట్ల నుంచి రూ.8,494 కోట్లకు పెరిగాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,538 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,616 కోట్లకు తగ్గాయని జేఎస్పీఎల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.22,706 కోట్ల నుంచి రూ.27,844 కోట్లకు పెరిగింది. -
ఆంద్రప్రదేశ్‌లో జిందాల్ పవర్ ప్లాంట్
న్యూఢిల్లీ: జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో 2,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. అలాగే జార్ఖండ్‌లో 1,300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని గ్రూప్ సీఈఓ, ఎండీ రవి ఉప్పల్ చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల కోసం(3,300 మెగావాట్లు) ఐదేళ్లలో రూ.20,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని వివరిం చారు. ప్రస్తుత తమ విద్యుదుత్పత్తి సామర్థ్యం 5,300 మెగావాట్లు అని, 2020 కల్లా 8,600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడం లక్ష్యంగా ఈ స్థాయి పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొన్నారు. గత వారంలో ఛత్తీస్‌ఘఢ్‌లో 2,400 మెగావాట్ల తమ్నార్ ప్రాజెక్ట్ విస్తరణను పూర్తి చేశామని పేర్కొన్నారు. దీని కోసం రూ.13,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్‌ల్లోని రెండు ప్రాజెక్టుల కోసం ఏడాదికి 16.5 మిలియన్ టన్నుల బొగ్గు అవసరమని అంచనాలున్నాయని చెప్పారు. బొగ్గు సమీకరణకు సంబంధించి వివిధ మార్గాల కోసం అన్వేషిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్ తీరప్రాంతంలో ఏర్పాటు చేయనున్నందున విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమా లేక దేశీయంగానే సమకూర్చుకోవడమా అనే అంశంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. -
జిందాల్ స్టీల్‌పై మరో ‘బొగ్గు’ కేసు
తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటారుుంపునకు (1993-2005) సంబంధించిన దర్యాప్తులో భాగంగా మోసం, అవినీతి వంటి ఆరోపణలతో.. తాజాగా జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇది 36వ ఎఫ్ఐఆర్ అని సంస్థ ప్రతినిధి ఒకరు ఆదివారం నాడిక్కడ చెప్పారు. జిందాల్ స్రైప్స్ లిమిటెడ్ (ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్)తో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులపై నేరపూరిత కుట్ర, ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదైనట్టు సీబీఐ వర్గాలు వెల్లడించారుు. వెనువెంటనే సీబీఐ రాయ్‌గఢ్, ఛత్తీస్‌గఢ్‌ల్లోని మొత్తం 4 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు తెలిపారుు. ఇది గరె పల్మా 4/1 బొగ్గు గని కేటారుుంపునకు సంబంధించిన కేసుగా ఆ వర్గాలు వివరించారుు. కంపెనీకి చెందిన స్పాంజ్ ఐరన్ ప్లాంట్ కోసం గనిని కేటారుుంచగా.. దానికి బదులు కంపెనీ, బొగ్గు శాఖ నిర్దేశిత పరిధికి మించి అక్రమ మైనింగ్‌కు ప్రతిపాదించడమే కాకుండా అందుకు పాల్పడిందనే ఆరోపణలున్నారుు. మితిమీరిన మైనింగ్‌కు పాల్పడటమే కాకుండా ముడి బొగ్గును అమ్మడం వంటి చర్యలకు పాల్పడినట్టుగా ఆరోపణలున్నట్టు సీబీఐ ప్రతినిధి తెలిపారు. జార్ఖండ్‌లో ఓ బొగ్గు గనిని కైవసం చేసుకోవడంలో అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలతో జేఎస్పీఎల్ ఇప్పటికే సీబీఐ విచారణను ఎదుర్కొంటోంది. ఈ కేసుకు సంబంధించి కంపెనీ చైర్మన్, మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌ను సీబీఐ ప్రశ్నించింది.